Home
News

వీడియో స్ట్రీమింగ్ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్

భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమలో అమెజాన్ మరియు వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ రెండు నీవా లేఖ నేనా అని ఎప్పుడు ప్రతి విషయంలో పోటీ పడుతూవుంటాయి. ఇక భారతీయ ఇ-కామర్స్ సన్నివేశం విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్ అగ్రస్థానంలో ఉండగా అమెజాన్ దానికి పోటీగా దాని వెనుకే ఎప్పుడూ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తు ఉంది.

flipkart video streaming service

అమెజాన్ తన ప్రైమ్ సర్వీస్ కారణంగా ఫ్లిప్‌కార్ట్ కంటే ముందు కొన్ని ప్రాంతాలలో తన కార్యకలాపాలు జరుపుతోంది. అమెజాన్ కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీస్ లను ప్రవేశపెట్టింది. ఏదేమైనా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం సర్వీస్ వీడియో స్ట్రీమింగ్ కు సంబందించిన సేవలను కల్పించలేదు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ను వినియోగదారులకు అందించడానికి పావులు కదుపుతోంది.

flipkart video streaming service

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ తన సొంత వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దాని ప్లస్ కస్టమర్లకు ఉచితంగా స్ట్రీమింగ్ సర్వీస్లను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళికి ముందే దీన్ని ప్రారంభించే అవకాశం కూడా ఉంది.

వీడియో మార్కెట్‌లోకి ఫ్లిప్‌కార్ట్ :

వీడియో మార్కెట్‌లోకి ఫ్లిప్‌కార్ట్ :

ప్రస్తుతం ఇండియాలో వీడియో స్ట్రీమింగ్ పరిశ్రమ విలువ సుమారు 4,462 కోట్లు కావడం విషేషం. దీనిని దృష్టిలో పెట్టుకొని చివరకు ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియో స్ట్రీమింగ్ పరిశ్రమలోకి ప్రవేశించడం గమనించాల్సిన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమ కూడా భారీ వృద్ధిని కనబరిచింది. అంతేకాకుండా ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ మరియు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వేగంగా షిప్పింగ్ మరియు ప్రత్యేకమైన ఒప్పందాలను కలిగి ఉన్నాయి.

 ఫ్లిప్‌కార్ట్ ప్లస్ :

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ :

ఫ్లిప్‌కార్ట్ యొక్క మనీ కంట్రోల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వీడియో అందుబాటులో లేదు త్వరలో మాకు వీడియో లభిస్తుంది అని ఆయన అన్నారు. ఇండియాలో సినిమాను మరియు క్రికెట్ ను చాలా బాగా ప్రేమిస్తారు. సినిమాను ప్రేమించే మరియు శ్వాసించే దేశంలో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మరోవైపు తమకు దగ్గరి పోటీదారు అయిన అమెజాన్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కింద కొత్త కొత్త ఒరిజినల్స్ మరియు ఎక్స్‌క్లూజివ్ షోలను పరిచయం చేయడం ద్వారా ప్లాట్‌ఫాంపై తన ప్రయత్నాలను రెట్టింపు చేస్తోంది. అమెజాన్ రూపొందించిన ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌ను ఇ-కామర్స్ దిగ్గజం డిసెంబర్ 2016 లో భారతదేశంలో ప్రారంభించింది. అప్పటినుండి అమెజాన్ సుమారు 13 మిలియన్ల మంది వినియోగదారులను సంపాదించింది అని రెడ్‌సీర్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ సంఖ్య అమెజాన్ ప్రైమ్ యొక్క మొత్తం వినియోగదారుల స్థావరంలో 10% కంటే ఎక్కువ.

అమెజాన్ ప్రైమ్ :

అమెజాన్ ప్రైమ్ :

అమెజాన్ ఇండియా తన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా కంటెంట్‌ను పంపిణీ చేస్తుంది. ఇది స్ట్రీమింగ్ వీడియో మరియు ఆడియోతో పాటు ఉచితంగా ఒక రోజు మరియు రెండు రోజుల షిప్పింగ్ కూడా అందిస్తుంది.ఇందులో కనీస ఆర్డర్ మొత్తం మరియు షెడ్యూల్ చేసిన కిరాణా డెలివరీల కోసం అమెజాన్ ప్రైమ్ నౌకి యాక్సిస్ వంటి షాపింగ్ ప్రయోజనాలతో కూడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ సర్వీస్ ఇప్పటికీ తన ప్లాన్ వ్యూహాత్మక దశలో ఉన్నందున ఈ వీడియో సర్వీస్ ఎలా పని చేస్తుందో అస్పష్టంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న హాట్‌స్టార్ వంటి వాటిని ప్రసారం చేయడం కోసం ప్రధాన కంటెంట్ ప్రొవైడర్లతో జతకట్టగలదు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఉచితంగా:

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఉచితంగా:

కొత్త ఐబాల్‌లను దాని ప్లాట్‌ఫామ్‌లకు ఆకర్షించడానికి ఫ్లిప్‌కార్ట్ బాలీవుడ్ సహాయం తీసుకోవచ్చు. ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఉచితంగా వీడియోను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యునిగా మారడానికి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుదారుడు 300 సూపర్ నాణేలు లేదా రివార్డ్ పాయింట్లను సేకరించాలి. ప్రతి ఫ్లిప్‌కార్ట్ సభ్యుడు 100 రూపాయల కొనుగోలుకు 2 రివార్డ్ పాయింట్లను లేదా 2 సూపర్ కాయిన్స్ పొందుతాడు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుడు వేగంగా డెలివరీ కూడా పొందుతాడు. ఫ్లిప్‌కార్ట్ లేదా దాని 100 భాగస్వామి సంస్థలైన జోమాటో,OYO మరియు మేక్‌మైట్రిప్ నుండి ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడానికి రివార్డ్ పాయింట్లను ఉపయోగించవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్ :

ఫ్లిప్‌కార్ట్‌-వాల్‌మార్ట్ :

2018 లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. కంపెనీలో నియంత్రణ వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. సంస్థ స్వయంగా గణనీయమైన సముపార్జనలు చేసింది మరియు కంటెంట్‌కు సంబంధించిన వెంచర్లను కూడా ప్రారంభించింది. కానీ ఇవి ఎక్కువగా విజయవంతం కాలేదు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ మరియు రిలయన్స్ జియో వంటి పెద్ద టికెట్ సంస్థల నుండి కంపెనీ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి భారతదేశంలో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ను ఛేదించడానికి ఫ్లిప్‌కార్ట్ చాలా కష్టపడవలసి ఉంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ నుండి రాబోయే వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ ప్రస్తుతం బీటా మోడ్‌లో ఉంది. ఇది దీపావళి షాపింగ్ సీజన్ కంటే ముందే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
flipkart video streaming service
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X