స్మార్ట్ టీవీలకు & ఆండ్రాయిడ్ టీవీలకు తేడా ఏమిటి?

|

గత రెండు సంవత్సరాలుగా టెలివిజన్ మార్కెట్లో చాలా పెద్ద మార్పు కనిపించింది. కొన్నేళ్లుగా టీవీ మార్కెట్ చాలా దారుణంగా ఉండి తిరోగమనం చూసిన తరువాత ఇప్పుడు టీవీ మార్కెట్ చాలా బాగా పెరుగుతోంది అంతే కాకుండా టీవీల యొక్క అమ్మకాలు కూడా చాలా బాగా పెరిగాయి. చాలా తక్కువ మరియు సరసమైన ధరలకు టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చిన షియోమి, ఇఫాల్కాన్, వియు, థామ్సన్ వంటి వాటితో టీవీ మార్కెట్ చాలా బాగా పెరిగింది.

android tv vs smart tv google assistant netflix youtube hotstar

ఇప్పుడు మీరు క్రొత్త టీవీని కొనాలని చూస్తున్నట్లయితే మీరు స్టాండర్డ్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ మరియు స్మార్ట్ టీవీలను చూడవచ్చు. అంతేకాకుండా కొత్తగా ఇప్పుడు AI ఫీచర్ వంటి 4K LED టీవీలు కూడా మార్కెట్ లోకి వచ్చాయి. ఆండ్రాయిడ్ మరియు స్మార్ట్ టీవీలు ఒకే విధంగా సమానంగా ఉన్నప్పటికీ చాలా తేడా ఉంది. తేడా ఏమిటో తెలుసుకోవడానికి కింద చదవండి.

స్టాండర్డ్ టీవీలు:

స్టాండర్డ్ టీవీలు:

స్టాండర్డ్ టీవీలు HD రెడీ, ఫుల్ HD లేదా 4K డిస్ప్లే ప్యానెల్ ఎంపికలతో వస్తాయి. ఇవి HDMI పోర్ట్, అనలాగ్ కేబుల్ పోర్టులు మరియు USB పోర్ట్ వంటి సాధారణ కనెక్టివిటీ ఎంపికలతో వస్తాయి. పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ లేదా USB డ్రైవ్ నుండి మీడియా ఫైళ్ళను చదవగల మరియు ప్లేబ్యాక్ చేయగల ప్రాథమిక సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది. ఈ ఫైళ్ళలో ఫోటోలు, వీడియోలు మరియు సంగీతం వంటి వాటిని చూడవచ్చు.

స్మార్ట్ టీవీలు:

స్మార్ట్ టీవీలు:

ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు ప్రాచుర్యం పొందాయి.అంతేకాకుండా మీరు నోబెల్ స్కియోడో యొక్క స్మార్ట్ టీవీని తక్కువ ధరకు కేవలం 7,299 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. 15,000 రూపాయల లోపు స్మార్ట్ టీవీలను అందించే ఇతర బ్రాండ్లలో ఇఫాల్కాన్, కోడాక్, జెవిసి, షియోమి మరియు థామ్సన్ ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ టీవీ యొక్క వాటి ఆపరేటింగ్ సిస్టమ్ చాలా భిన్నంగా ఉంటుంది.

స్మార్ట్ టీవీ ఫీచర్స్:
 

స్మార్ట్ టీవీ ఫీచర్స్:

ఈ స్మార్ట్ టీవీలు WebOS, Tizen, హోమ్‌ఓఎస్ లేదా కొన్ని కస్టమ్ Linux-ఆధారిత OSలతో రన్ అవుతాయి. ఈ స్మార్ట్ టీవీలను వేరుచేసేది కేవలం అన్ని రకాల యాప్ లభ్యత. స్మార్ట్ టీవీలలో మీరు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని ప్రసిద్ధ యాప్ లను పొందుతారు. ఈ OTT యాప్లు మరియు వాటి సభ్యత్వంతో మీకు కావలసినప్పుడు మీకు ఇష్టమైన టీవీ షోలు మరియు మూవీలను ప్రసారం చేయవచ్చు. వాస్తవానికి స్మార్ట్ టీవీలలో ఎటువంటి సమస్యలు లేకుండా కంటెంట్‌ను ప్రసారం చేయగలగడానికి మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది.

ఆండ్రాయిడ్ టీవీలు:

ఆండ్రాయిడ్ టీవీలు:

ఆండ్రాయిడ్ టీవీలు కూడా స్మార్ట్ టీవీ వలె ఉంటాయి కానీ చిన్న తేడా ఏమిటంటే అవి ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రన్ అవుతాయి. Android OS లో టీవీ రన్ అయేటప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏమిటంటే ఆండ్రాయిడ్ ఓఎస్‌ ద్వారా మీరు గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సిస్ పొందవచ్చు. అంటే ఆండ్రాయిడ్ టీవీలను ఒక కంప్యూటర్ వలె కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మీరు ఛానెల్‌లను మార్చడం, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం వంటి ఫంక్షన్ల కోసం వాయిస్ ఆదేశాలను ఇవ్వవచ్చు. దీని ద్వారా వాతావరణ సమాచారం, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, జోక్స్ వంటివి మరెన్నో తెల్సుకోవచ్చు. మీరు మీ వాయిస్‌తో IoT హోమ్ పరికరాలను కూడా నియంత్రించవచ్చు.

ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్స్:

ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్స్:

Android టీవీలో ఉన్న ప్లే స్టోర్ నుండి మీరు అన్ని రకాల యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా యాక్సిస్ పొందుతారు. వీటిలో ప్లే మూవీస్, ప్లే మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, స్పాటిఫై, ట్విట్టర్ వంటి మరిన్ని యాప్లు ఉన్నాయి. Asphalt 8, ఫైనల్ ఫాంటసీ, మోర్టల్ కంబాట్, మిన్‌క్రాఫ్ట్ వంటి గేమ్స్ కూడా ఆండ్రాయిడ్ టీవీలోని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసి మంచి గేమింగ్ అనుభవం పొందడానికి మంచి విసువల్ వ్యూతో ఆడవచ్చు.

Best Mobiles in India

English summary
android tv vs smart tv google assistant netflix youtube hotstar

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X