గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

Written By:

టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుందనేదానికి అనేక వాటిని చూపించవచ్చు. ప్రయాణాల సంగతే తీసుకుంటే నాటి ఎడ్ల బండి నుంచి నేటి విమానాల దాకా టెక్నాలజీ సరికొత్త రూపురేఖలు సంతరించుకుంటూనే ఉంది. అయితే టెక్నాలజీ ఇంకా ముందు ముందుకు పోతుందనడానికి ఇప్పుడు ఎగిరే ట్యాక్సీలు రోడ్ల మీద చక్కర్లు కొడుతున్నాయి. ఎగిరే ట్యాక్సీలా అని నోరెళ్లబెట్టకండి..మీరు విన్నది నిజమే కావాలంటే ఓ స్మార్ట్ లుక్కేయండి.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఎడ్లబండి, జ‌ట్కాబండిలో ప్ర‌యాణం చేసే రోజుల‌నుంచి కాలక్రమంలో అత్యంత అధునాతన ప్ర‌యాణ సాధనాలు కొత్త‌కొత్త‌వి పుట్టుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే రోడ్లు, నీరు, గాల్లో ఎగిరే రవాణా సాధనాలు ఎన్నో వ‌చ్చాయి.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

గాల్లో విమానం, హెలికాప్ట‌ర్‌, రాకెట్‌, డ్రోన్ వంటివే ప్ర‌యాణిస్తుండ‌డం ఇంత‌వ‌ర‌కూ చూశాం. ఇక‌పై మ‌నం ఫ్లైయింగ్‌ ట్యాక్సీల‌ను కూడా చూడ‌వ‌చ్చు. 

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేసే ‘అటానమస్‌ ఫ్లైయింగ్‌ ట్యాక్సీ'లను తాము త్వ‌ర‌లోనే తీసుకురానున్న‌ట్లు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ పేర్కొంది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

కృత్రిమ తెలివితేటలతో పనిచేసే ట్యాక్సీలను తయారు చేయాలని ఎయిర్‌బస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ట్యాక్సీ తనంతట తాను పరిస్థితులను అర్థం చేసుకుని నియంత్రించుకోగలదు.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఇవి డ్రోన్ల మాదిరిగా ఉంటాయని, వీటికి ‘సిటీ ఎయిర్‌బస్ అని పేరు పెట్టామని తెలిపింది. ప్రయాణాలకోసం, సరుకు రవాణా కోసం కూడా వీటిని ఉపయోగించుకోవచ్చునని వివరించింది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని , దీనిని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసి ఆపరేట్ చేయొచ్చని తెలిపింది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఫిబ్రవరి నుంచి వీటి తయారీ ప్రారంభమైందని, తొలి డిజైన్‌ను వచ్చే ఏడాది పరీక్షిస్తామని పేర్కొంది. ప్రజలకు అందుబాటులోకి రావాలంటే సుమారు పదేళ్ళు పట్టవచ్చునని వివరించింది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఇవి ప్ర‌యాణించేట‌ప్పుడు వాటంతంట అవే ఎయిర్‌ ట్రాఫిక్‌ను గుర్తించే వ్యవస్థను సవాల్‌గా తీసుకుని తాము వీటిని రూపొందిస్తున్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

సిటీ ఎయిర్‌బస్‌ బ్యాటరీతో నడుస్తుందని తెలిపింది. ఇవి గ‌నుక అందుబాటులోకి వ‌స్తే ట్రాఫిక్‌ సమస్యలు త‌గ్గుతాయ‌ని భావిస్తున్నారు.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఇప్పటికే చైనాలో ఎహంగ్ 184 పేరుతో ఓ వాహనాన్ని తయారు చేశారు. దీనిలో ఒక ప్రయాణికుడు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

జర్మనీ కూడా ఈ-వోలో కంపెనీ వోలోకాప్టర్ పేరుతో ఓ ఫియట్‌ను తయారు చేసింది. ఈ రెండూ ఈ ఏడాదే తయారయ్యాయి.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఇక ఇప్పటికే గూగుల్‌, ఉబర్‌, ఐబీఎం వంటి ప‌లు సంస్థలు స్వయం నియంత్రిత వాహనాల‌ను త‌యారు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే డ్రైవర్‌లెస్‌ కార్లను, బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయి.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

ఈ కంపెనీల కసరత్తులు ఫలిస్తే సాధారణ జనం హెలికాప్టర్లలో విహరిస్తున్న అనుభూతులను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్ బస్ కంపెనీ చేస్తున్న ప్రయోగం విజయవంతమైతే ప్రజలు ఇక ట్యాక్సీలకు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్ డేట్‌కోసం మాతో కలిసి ఉండండి. అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Forget self-driving cars: Airbus wants to make self-FLYING taxis - and it could begin tests of its first prototype next year
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot