బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

|

మీరు రోజు అనేక రకాలైన వస్తువులను చూసి ఉంటారు. అయితే ఆ వస్తువులను మీరు నిశితంగా గమనించినట్లయితే నల్లటి గీతలు మీకు ఆ వస్తువు మీద కనిపిస్తాయి. మరి అవేంటి..అవి ఎలా పనిచేస్తాయి. బార్ కోడ్ కింద ఉన్న నంబర్లు ఏంటీ..అవి వేటిని సూచిస్తాయి. ఇలాంటి అనేక అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

అనుకున్నట్లుగానే ఆ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

మీరు రోజు ఉఫయోగించే ప్రతి వస్తువు ప్యాకింగ్‌లపై కనిపించే నల్లటి గీతలనే 'బార్ కోడ్స్' అంటారు. వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి. వాటి ద్వారానే ఆ వస్తువు గురించి తెలుసుకునే వీలుంది.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?
 

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అంకెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి.

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

బార్ కోడ్స్ గురించి ఎంతవరకు తెలుసు...?

ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.

Best Mobiles in India

English summary
Here Write Things You Didnt Know about Barcode technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X