భారత్‌లో అడుగడుగునా ఫోక్స్‌కాన్..

Written By:

చైనా నుంచి ఇండియాకు ఫోక్స్ కాన్ పరుగులు పెడుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తి తయారీదారు సంస్థ అయిన ఫోక్స్‌కాన్ చైనాను కాదని భారత్ లో ప్రతి రాష్ర్టంలో ఓ ఉత్పత్తి సంస్థను ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. భవిష్యత్ లా ఐటీ హవా భారత్ దేనని అందుకోసం ముందునుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని కసరత్తులు చేస్తోంది. మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఫోక్స్‌కాన్ ప్రతి రాష్ర్టంలో పెట్టుబడులు పెడతామని సంస్థ చైర్మెన్ చెప్పారు. అయితే ఈ ఫోక్స్‌కాన్ అంటే ఏమిటి.. ఎక్కడ...ఎలా మొదలైంది..దీని కథపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : గూగుల్ గుట్టు విప్పేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.ఎక్కడ పుట్టింది..?

ఫోక్స్‌కాన్ అనే కంపెనీ తైవానీస్ మల్టీ నేషనల్ ఎలక్ట్రానిక్ తయారీదారు సంస్థ. చైనా దేశంలోని తైవాన్‌లో హెడ్ క్వార్టన్ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ తయారీదారు సంస్థ ఫోక్స్‌కాన్.అంతేకాకుండా అతి పెద్ద సమాచార శాఖ కంపెనీ కూడా ఇదే.

2.కంపెనీకి సంబంధించిన రూల్స్

ఫోక్స్‌కాన్ కంపెనీ రూల్స్ చాలా స్ట్రిక్ గా ఉంటాయి..ఆ రూల్స్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2012 జనవరిలో దాదాపు 150 మంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాల ఉన్నాయి. అంతేకాకుండా పనికి సంబంధించి అక్కడ ఉద్యమాలు కూడా జరిగాయి కూడా.

3.ఎవరు స్థాపించారు..?

ఫోక్స్‌కాన్ కంపెనీ అసలు పేరు హోన్ హాయ్ ఇండస్ట్రీ ప్రైవైట్ కంపెనీ లిమిటెడ్. అది తదనంతరం ఫోక్స్‌కాన్ గా రూపాంతరం చెందింది. దీన్ని 1974లో 2600 పౌండ్లతో టెర్రీ గో స్థాపించారు. దీని మొదటి ప్లాంట్ లను చైనాలో 1988లో లాంగ్వా,షెన్జెన్ లో ప్రారంభించారు.

4.మొదటి కష్టమర్

2001లో ఇంటెల్ కంపెనీ చిప్ లు తయారుచేయడానికి ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఇంటెల్ మదర్ బోర్డులు కూడా తయారు చేయాలంటూ కంపెనీకి సూచించింది.

5.కంపెనీ విస్తరణ

2007లో ఫోక్స్‌కాన్ 500 యుఎస్ డాలర్లతో సైత్ చైనాలోని హుయ్‌జూలో ప్లాంట్ కోసం ప్లాన్ చేసింది.

6. షార్ఫ్ కార్పోరేషన్ తో ..

2012లో జపాన్ ఎలక్ట్రానిక్ తయారీదారు అయిన షార్ఫ్ కార్పోరేషన్ తో ఎల్ సీడీల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

7.సీఈఓ రాజీనామా

జనవరి 2012న కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెర్రీ ఆరోగ్య కారణాలతో కంపెనీకి రిజైన్ చేశారు.

8.ఐదు కొత్త ప్లాంట్ల స్థాపన

అదే సంవత్సరం సెప్టెంబర్ లో 494 బిలియన్ల డాలర్లతో ఐదు కొత్త ఫ్లాంట్లకు కంపెనీ ప్లాన్ చేసింది. ఇటలీ,బ్రెజిల్ లో ఫ్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 10 వేల మందికి ఉపాధి కల్పించింది.

9.4 జీ కోసం వేట

2014 మేలో కంపెనీ రెండు 4జీ లైసెన్సులు 700 mhz,900mhzల కోసం తైవాన్ టెల్కో స్పెక్ట్రమ్ కు 312 బిలియన్ల డాలర్లను చెల్లించింది. 4జీ ని మరింత విస్తరించాలని తైవాన్ లో ఉన్న మరో పెద్ద నెట్ వర్క్ ఏసియా ఫసిఫిక్ టెలికామ్ తో కలిసి ఫోక్స్‌కాన్ 2014లో డీల్ కుదుర్చుకుంది.

10.అమ్మకాలు

ఫోక్స్‌కాన్ ఫ్యాక్టరీలు దాదాపు అన్ని దేశాలకు విస్తరించాయి.ఆసియా,యూరప్,మెక్సికో ,బ్రెజిల్ మొదలగు దేశాల్లో దాదాపు 40 శాతం ఈ కంపెనీనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అమ్మతోంది.

11. ఫ్లాంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి

ఒక్క చైనాలోనే కంపెనీకి 12 ఫ్లాంట్లు ఉన్నాయి. అన్ని రంగాల్లోకి ఈ కంపెనీ విస్తరించింది. దాదాపు లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో ఉన్నారు.

12. పని ఎలా ఉంటుంది.

కంపెనీనే‌‌ క్వార్టర్స్‌ని ఇస్తుంది.అలాగే వారానికి ఆరు రోజుల పని దినాలు..రోజుకు 12 గంటలు పనిచేయవలిసి ఉంటుంది.

13.చిన్న పిల్లల చేత పని

ఆపిల్ ఐ ప్యాడ్లను తయారు చేసే దశలో చిన్న పిల్లల చేత పని చేయించుకుంటోదని కంపెనీ అప్రతిష్టను మూటగట్టుకుంది. అలాగే ఐ ఫోన్ తయారీ సమయంలో కంపెనీ వేధింపులు తట్టుకోలేక ఒకరు సూసైడ్ కూడా చేసుకున్నారు.

14.భారత్ లో ఫ్లాంట్ల ఏర్పాటుకు రెడీ

ఇప్పుడు ఈ కంపెనీ భారత్ లో తన ఫ్లాంట్ల ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రపంచంలోనే వస్తూత్పత్తిలో చైనాదే అగ్రస్థానం. ఈ కారణంగానే ఆ దేశాన్ని ప్రపంచ కార్ఖానాగా పిలుస్తారు. అయితే ఆ హోదాను ఇప్పుడు భారత్ తన్నుకుపోయేందుకు సిద్ధంగా ఉందని చైనా మీడియా చెబుతోంది.

15. ప్రపంచ కార్ఖానాగా భారత్

సమీప భవిష్యత్ లో భారత్ ప్రపంచ కార్ఖానాగా అవతరించబోతోంది. ఈ విషయాన్ని ఎవరైనా చెబితే అంతగా పట్టించుకోనవసరం లేదు.సాక్షాత్తు ప్రపంచ కార్ఖానా హోదాలో ఉన్న చైనా దేశానికి చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

16.చైనాలో తగ్గుతున్న ఆర్థిక వ్యవస్థ జోరు

చైనా ఆర్ధిక వ్యవస్థ జోరు తగ్గడంతో చైనాకు చెందిన కంపెనీలు కూడా విదేశాల బాట పడుతున్నాయి. ఈ తరహా చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రబాగాన ఉంది.

17. పుంజుకుంటున్న భారత్ మార్కెట్

భారత్ లో మార్కెట్ శరవేగంగా దూసుకుపోతున్న క్రమంలోనే తమ దేశ కంపెనీలు ఆ దేశంవైపు చూస్తున్నాయని ఆ పత్రిక వెల్లడించింది.

చెన్నైలో యుద్దం

ఇక అప్పుడే చెన్నైలో యుద్దం మొదలైంది. చెన్నైలో కంపెనీ ఫ్లాంట్ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

32667 కోట్లతో ఫ్లాంట్

మహారాష్ర్టలో ఇప్పటికే కంపెనీ దాదాపు 32667 కోట్లతో ఫ్లాంట్ పెట్టేందుకు చర్చలు కూడా జరిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Foxconn, the world's largest electronics assembly manufacturer, on Saturday said India would be the next IT hub for it while expressing a desire to open factories in all states in the spirit of the Make in India initiative.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot