చిత్తూరులో సోనీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ?

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ సోనీ దేశీయంగా తమ ఉత్పత్తుల తయారీని, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలోని ఏర్పాటు చేయనున్న ఫాక్స్‌కాన్ యూనిట్ ద్వారా చేపట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ పరిశ్రమవర్గాల ద్వారా తెలియవచ్చింది.

Read More: గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

చిత్తూరులో సోనీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ?

ప్రముఖ బ్రాండ్ల డిజైన్ మేరకు మొబైల్ ఫోన్‌లను తయారుచేసే ఫాక్స్‌కాన్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడులతో చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఆర్థిక మండలిలో ఓ యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితమే శ్రీసిటీలోకి అడుగుపెట్టిన ఫాక్స్‌కాన్ తమ యూనిట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతోంది.

Read More: తాత శవంతో సెల్ఫీ

English summary
Foxconn Set to Help Sony Manufacture in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot