గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

Posted By:

గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నెక్సుస్ 6 భారత్‌లో రూ.10,000 ధర తగ్గింపును అందుకుంది. 32జీబి వేరియంట్ గూగుల్ నెక్సుస్ 6ను భారత్ మార్కెట్లో రూ.44,999 ధర ట్యాగ్‌తో విడుదల చేసారు. తాజా ధర తగ్గింపులో భాగంగా ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌‍కార్ట్ ఈ వేరియంట్‌ను రూ.34,999కి విక్రయిస్తోంది. 64జీబి వర్షన్ పాత ధర రూ.49,999 కాగా కొత్త ధర రూ.39,999.

గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

Read More: సెక్యూరిటీ కెమెరాల్లో ఆత్మల అలజడి!

ఈ ధర తగ్గింపు ఆఫర్లే కాకుండా గూగుల్ నెక్సుస్ 6 స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా 32జీబి వేరియంట్ గూగుల్ నెక్సుస్ 6ను రూ.29,999కి, 64జీబి వేరింయట్‌ను రూ.34,999కి సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

Read More: గూగుల్ నుంచి కొత్త ఫోన్ వస్తోంది

‘నెక్సస్ 6' ఫోన్‌ను గూగుల్ ఇంకా మోటరోలా సంయుక్తంగా డిజైన్ చేసాయి. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
Google Nexus 6 gets a price cut in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot