రఫాలేతో ఫ్రాన్స్ ఉగ్ర రూపం: వైట్‌హౌస్‌పై ఉగ్రకన్ను

Written By:

ఫ్రాన్స్ విసిరిన పంజా ధాటికి ఉగ్రవాదులు ఇప్పుడు గిలగిలా కొట్టకుంటున్నారు..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమై రక్షణ వ్యవస్థను కలిగిన ఫ్రాన్స్ ఆ రక్షణ వ్యవస్థతో ఉగ్రవాదులకు నరకం అంటే ఏంటో చూపెడుతోంది. అత్యంత పవర్ పుల్ యుద్ధ విమానాలైన రఫాలే యుద్ధ విమానాలను ఉగ్రవాదులపైకి మళ్లించింది. ఈ రఫాలే విమానాల ధాటికి ఇప్పుడు ఉగ్రవాదులు దాడులంటేనే హడలెత్తిపోయే స్థితికి చేరుకున్నారు. దెబ్బతో ఉగ్రవాదులు రూటు మార్చారు. ఇప్పుడు అమెరికా వైట్ హౌస్ పై కన్నేశారు. మరో పక్క చైనా కూడా ఉగ్రవాదుల అంతు చూస్తానని ప్రకటన చేసింది. విస్తు గొలిపే కథనం చదవండి.

Read more: వారి అంతు చూస్తాం: పట్టిస్తే రూ. 330 కోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిరియాపై అధికారికంగా యుద్ధం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిస్‌లో సృష్టించిన నరమేధంతో ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్ ఐసిస్ ప్రధాన స్థావరమైన సిరియాపై అధికారికంగా యుద్ధం ప్రకటించింది. అక్కడి ఉగ్రవాద శిబిరాలపై నిరవధికంగా దాడులు నిర్వహిస్తున్నది.

చార్లెస్ డి గోల్లీ' యుద్ధ నౌకను మధ్యదరాసముద్రంలో

సిరియాపై దాడులను ముమ్మరం చేసేందుకు ఫ్రాన్స్ అత్యాధునిక 'చార్లెస్ డి గోల్లీ' యుద్ధ నౌకను మధ్యదరాసముద్రంలో మోహరించింది. తూర్పు మధ్యదరాసముద్రంలో దీన్ని నిలిపి, అక్కడి నుంచి ఫ్రాన్స్ తమ దాడులను తీవ్రతరం చేస్తుంది.

ఈ యుద్ధనౌకపై రఫాలే సహా అన్ని రకాల యుద్ధ విమానాలు

ఈ యుద్ధనౌకపై రఫాలే సహా అన్ని రకాల యుద్ధ విమానాలు, 2 వేల నుంచి 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు నిలపవచ్చు. ఫలానా ప్రాంతంపై దాడి చేయాలి అంటే, రాడార్లకు దొరక్కుండా దూసుకెళ్లే క్షిపణి వ్యవస్థ ఫ్రాన్స్ దగ్గరుంది.

మొత్తం 26 జెట్ విమానాలను మోసుకెళ్లిన ఈ నౌకలో

అయితే దీన్ని గల్ఫ్ రీజియన్ లోకి పంపకుండా సిరియా లేదా లెబనాన్‌లకు దగ్గరగా ఉంచాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. మొత్తం 26 జెట్ విమానాలను మోసుకెళ్లిన ఈ నౌకలో అణు శక్తితో నిండిన వార్ హెడ్లు కూడా ఉన్నాయి. మొత్తం 26 జెట్ విమానాలను మోసుకెళ్లిన ఈ నౌకలో అణు శక్తితో నిండిన వార్ హెడ్లు కూడా ఉన్నాయి.

సిరియా లేదా లెబనాన్ లకు దగ్గరగా

దీన్ని గల్ఫ్ రీజియన్ లోకి పంపకుండా, సిరియా లేదా లెబనాన్ లకు దగ్గరగా ఉంచాలని ఫ్రాన్స్ నిర్ణయించడంతో.. ఐఎస్ఐఎస్ పై మరింతకాలం పాటు దాడులు జరపాలని ఆ దేశం భావిస్తున్నట్టు సమాచారం.

ఫ్రాన్స్ 12 యుద్ధ విమానాలు నిలిపి వాటితో సిరియాపై దాడులు

ఇప్పటికే యూఏఈ, జోర్డాన్ తదితర ప్రాంతాల్లో ఫ్రాన్స్ 12 యుద్ధ విమానాలు నిలిపి వాటితో సిరియాపై దాడులు చేస్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్ ఈ తరహాలో వైమానిక దాడులు జరపడం ఇదే తొలిసారి.

తన దేశంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదులను

సిరియా వరకూ వెళ్లి యుద్ధం చేస్తున్న ఫ్రాన్స్ తన దేశంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేస్తున్నది. 

సిరియాలో చేస్తున్న యుద్ధంగానీ

సిరియాలో చేస్తున్న యుద్ధంగానీ, ఫ్రాన్స్‌లో ఉగ్రవాదుల ఏరివేతగానీ అంత తేలిక కాదనేది పరిశీలకుల అభిప్రాయం. స్వీయ అనుభవం వల్లనో ఏమో కానీ అమెరికా మాత్రం ఫ్రాన్స్ చేస్తున్న ఈ యుద్ధానికి వత్తాసు పలకడం లేదు.

ఐఎస్ ఉగ్రవాదులు మరింత మేర బరితెగించేందుకు పక్కాగా వ్యూహాలు

ఇదిలా ఉంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ముప్పేట దాడితో ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఐఎస్ ఉగ్రవాదులు మరింత మేర బరితెగించేందుకు పక్కాగా వ్యూహాలు పన్నుతున్నారట. పకడ్బందీగా జరుగుతున్న ఈ తరహా దాడులకు కళ్లెం వేయడం అంత సులువేమీ కాదని సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మా యుద్ధం వైట్ హౌస్ గా పిలుచుకునే భవనంతో ముగిస్తాం

దీనికి ఊతమిస్తూ ఉగ్రవాదులు మరో హెచ్చరికల వీడియోని విడుదల చేశారు. పారిస్ భిఫోర్ రోమ్ అంటూ టైటిల్ పెట్టిన ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో మీతో మొదలు పెట్టాం. మా యుద్ధం వైట్ హౌస్ గా పిలుచుకునే భవనంతో ముగిస్తాంఅంటూ ఓ ఫైటర్ వెల్లడించడం కనిపిస్తోంది.

మా సూసైడ్ బెల్టులు కారు బాంబులు సిద్ధంగా ఉన్నాయి

మేము దాన్ని పేల్చాస్తాం.ఎలాగైతే ఇతర భవనాలను పేలుస్తున్నామో అలాగే మా సూసైడ్ బెల్టులు కారు బాంబులు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎక్కడికెళ్లినా మేము రాగలం అంటూ అగ్రరాజ్యాధినేతలకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది.

అమెరికా కొట్టి పారేస్తున్నా సెప్టెంబర్ 11 మళ్లీ ఎక్కడ

అయితే పారిస్ దాడులకు లాగా అమెరికాలో దాడులకు అవకాశం లేదని అమెరికా కొట్టి పారేస్తున్నా సెప్టెంబర్ 11 మళ్లీ ఎక్కడ పునరావృతమవుతుందోనని హడలి పోతోంది. లోలొపల మధనపడిపోతోంది. ఇందుకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెస్నన్ వ్యాఖ్యలే నిదర్శనం.

ఉగ్రవాద సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడని చైనా సైతం ఇప్పుడు కస్సుబుస్సు

అయితే ఇప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడని చైనా సైతం ఇప్పుడు కస్సుబుస్సులాడుతోంది. తమ దేశానికి చెందిన వ్యక్తిని ఉగ్రవాద సంస్థ దారుణంగా చంపేయడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను అసహ్యించుకునే జాబితాలో తాజాగా చైనా కూడా తోడయింది.

అంత తేలికగా ఐఎస్ను విడిచిపెట్టబోమంటూ ఉగ్ర ప్రతిన

ఇది తమకు అత్యంత విషాధకరమైన విషయమని, అంత తేలికగా ఐఎస్ను విడిచిపెట్టబోమంటూ ఉగ్ర ప్రతిన బూనింది. దీనిపై స్వయంగా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రకటన చేశారు. తమ దేశీయుడిని చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఐఎస్ కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు.

నిన్నమొన్నటి వరకు చైనా మాత్రం

వాస్తవానికి ఇప్పటి వరకు ఐఎస్ ఎన్ని దేశాలపై దాడులు జరుపుతున్నా చైనా పట్టించుకోలేదు. అగ్రదేశాలన్ని కూడా ఇప్పటికే ఐఎస్ తో సమరానికి సిద్ధమై ఉండగా నిన్నమొన్నటి వరకు చైనా మాత్రం మిన్నకుండిపోయింది.

తాజాగా తమ దేశ పౌరుడిని చంపేసినట్లు తెలియడంతో

కానీ, తాజాగా తమ దేశ పౌరుడిని చంపేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా చైనా కూడా అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రస్తుతం ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర అగ్ర దేశాలతో కలిసి పోరాడాలా లేక స్వయంగా బరిలోకి దిగి ఐఎస్ భరతం పట్టాలా అని మీమాంసలో ప్రస్తుతం చైనా చేరుకుంది.

ఐఎస్ ఎస్ ఇప్పుడు తన చావును తనే

మొత్తం మీద ఐఎస్ ఎస్ ఇప్పుడు తన చావును తనే కొని తెచ్చుకుంది. రంగంలోకి అగ్రరాజ్యాలు దిగాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write france-rafale-fighter-jet-is-perfect-technology-weapon-against-isis
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot