వారి అంతు చూస్తాం: పట్టిస్తే రూ. 330 కోట్లు

By Hazarath
|

రష్యా ఆయుధాలతో ప్రపంచాన్ని అలాగే ఉగ్రవాదులను భయపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఇప్పుడు రష్యా కలిగి ఉంది. మొన్న ఉగ్రవాదుల దెబ్బ రష్యాను ఇప్పుడు అత్యాధునికి ఆయుధాలను సమకూర్చుకునేలా చేస్తోంది. రష్యా విమానాన్ని కూల్చివేసింది ఉగ్రవాదులేనని నివేదికలు తేల్చడంతో ఇప్పుడు రష్యా వారి అంతుచూసేవరకు నిద్రపోయేది లేదని తేల్చి చెప్పడంతో ఉగ్రవాదులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అంతేకాకుండా రష్యా విమానాన్ని కూల్చివేసిన వారి జాడ చెప్పిన వారికి 330 కోట్ల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. దీంతో పాటు రష్యా చేతిలో ఉన్న అస్త్రాలను కూడా చూద్దాం.

Read more: ఐఎస్‌ఐఎస్ వార్నింగ్‌తో వేడెక్కిన యుద్ధం

వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన

వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన

గత నెల ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిన బూనారు. విమానాన్ని కూల్చేసి.. 224 మంది మృతిచెందడానికి కారణమైన వారిని పట్టుకొని చట్టం ద్వారా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు

వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు

విమానం కూల్చివేతకు కారణమైన వారి సమాచారాన్ని తెలియజేసిన వారికి 50 మిలియన్ డాలర్లు (రూ. 330 కోట్లు) బహుమానం ఇస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది. అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం రష్యా భద్రతా చీఫ్ అలెగ్జాండర్ బోట్ర్‌నికోవ్ భేటీ అయి.. ఈజిప్టులో కూలిన విమానం ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తముందని స్పష్టం చేశారు.

ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని

ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని

ఉగ్రవాదులు పెట్టిన బాంబు వల్లే విమానం ఆకాశంలో ముక్కలైందని వెల్లడించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ' కారకులు ఎక్కడ దాగివున్నా.. వారి వెతికి మరీ పట్టుకుంటాం. ప్రపంచంలోని ఏ మూల దాగున్నా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వారిని శిక్షించి తీరుతాం' అని బొట్ర్‌నికోవ్‌తో చెప్పారని క్రెమ్లిన్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి

తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి

రష్యాకు చెందిన ఫ్లయిట్ నెంబర్‌ 7K9268 ఎయిర్‌బస్-321 విమానం గత నెల 31న ఈజిప్టులోని షర్మ్-అల్-షేక్ విమానాశ్రం నుంచి బయలుదేరిన కాసేపటికే కూలిపోయింది. 224 మందితో ప్రయాణించిన ఈ విమానాన్ని తామే కూల్చేశామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

రష్యా చేతిలో ఉగ్రవాదులను ఒక్క వేటుతో నాశనం చేయగల ..

రష్యా చేతిలో ఉగ్రవాదులను ఒక్క వేటుతో నాశనం చేయగల ..

ఇప్పుడు రష్యా చేతిలో ఉగ్రవాదులను ఒక్క వేటుతో నాశనం చేయగల అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటితో ఇప్పుడు రష్యా తన పంజాను ఉగ్రవాదులపై విసురుతోంది. వారిని సర్వనాశనం చేసే దిశగా కదులుతోంది.మరి రష్యా చేతిలో ఉన్న ఆ ఆయుధాలను చూద్దాం.

బోరా క్లాస్ గైడెడ్ మిస్సైల్ హోవర్ క్రాఫ్ట్ :

బోరా క్లాస్ గైడెడ్ మిస్సైల్ హోవర్ క్రాఫ్ట్ :

ఇదొక అత్యాధునికి జల యుద్ధ ఓడ..8 మస్కిటో క్షిపణులను అలాగే 20 రకాల యాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను మోసుకెళ్లగలదు. 68 మంది సైనికులతో ఈ ఓడ గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తూ శత్రువులపై దాడి చేయగలదు.

ది ఫాంటసిర్-ఎస్1

ది ఫాంటసిర్-ఎస్1

ఇదొక మీడియం రేంజ్ ఎయిర్ క్షిఫణి. అంతేకాకుండా యాంటీ క్రాఫ్ట్ క్షిపణి సిస్టం కలిగి ఉంటుంది. 12 క్షిపణులను ఒక్కసారి లోడ్ చేసి శత్రువుల మీదకు వదలగలదు. అలాగే 30 ఎమ్ ఎమ్ గన్ లతో పైన పోయే విమానాలను హెలికాప్టర్లను క్రూయిజ్ క్షిపణులను సర్వనాశనం చేయగలవు.

అదృశ్య జలాంతర్గామి

అదృశ్య జలాంతర్గామి

ఇదొక అత్యాధునిక జలాంతర్గామి.గత సంవత్సరం సెయింట్ పీటర్స్ బర్గ్ షిప్ యార్ట్ లోకి దీన్ని ప్రవేశపెట్టారు. నీటిలోపల నుంచే శత్రువులను ధ్వంసం చేయగల శక్తి దీని సొంతం.

ది మిగ్ 35 మల్టి రోల్ జెట్ ఫైటర్

ది మిగ్ 35 మల్టి రోల్ జెట్ ఫైటర్

గాలిలో పోరాటాలకు ఈ విమానాలు పెట్టింది పేరు. గంటకు 2400 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించి శత్రువులపై దాడి చేయగలవు. సముద్రం ఉపరితల లక్ష్యాలను అలాగే గాలిలో పయనించే ఏ వస్తువునైనా ఇవి పసిగట్టి క్షణాల్లో భస్మీపటలం చేయగలవు.

ది బక్ 2 మిస్సైల్ సిస్టం

ది బక్ 2 మిస్సైల్ సిస్టం

వీటితోనే మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ లో పేల్చేశారని ఆరోపణలు కూడా దీనిపై ఉన్నాయి. 9ఎమ్ త్రి17 క్షిపణులు 46 వేల అడుగుల ఎత్తులో ఏం పోతున్నా కాని దాన్ని సర్వ నాశనం చేసే సత్తా ఉంది.154 పౌండ్ వార్ హెడ్లను మోసుకెళ్లగలిగే సత్తా దీని సొంతం.

ది ఆర్ ఎస్ 24 యార్స్

ది ఆర్ ఎస్ 24 యార్స్

10,000 మైళ్ళ పరిధి తో బహుళ స్వతంత్రంగా లక్ష్యం అణు వార్హెడ్లతో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే Topol-M ఇది క్రియాత్మకంగా ప్రతి క్షిపణి. 2010 నుండి బాలిస్టిక్ క్షిపణులను స్థానంలో దీన్ని రూపకల్పన చేశారు.1945 ఆగస్టు లో హిరోషిమా మీద పడింది ఇలాంతటి బాంబే. 100 "లిటిల్ బాయ్స్" యొక్క శక్తి కలిగి ఉంటుంది.

ది రష్యన్ కాన్ క్రోడ్

ది రష్యన్ కాన్ క్రోడ్

ఇదొక సూపర్ సోనిక్ కాంబోట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని 1980లో సోవియట్ యూనియన్ డిజైన్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది ఈ విమానం. 40 వేల కేజీల ఆయుధాలను ఇది పట్టుకెళ్లగలదు.రష్యా చేతిలో ఇటువంటివి ఇప్పుడు 16 ఉన్నాయి.

ది టీ 90

ది టీ 90

ఇదొక అత్యాధునిక యుద్ధ ట్యాంకు. ఇప్పుడు రష్యా ఆర్మీ దీన్ని వాడుతోంది. 125 ఎమ్ ఎమ్ వేగంతో పనిచేయగలదు. అంతేకాకుండి రిమోట్ సిస్టం ఉంటుంది. ఒక్కసారి రిమోట్ నొక్కితే ఎదురుగా ఎంతదూరంలో ఉన్న వస్తువైనా క్షణాల్లో బూడిద కావాల్సిందే.

ఎట్ 14,700 టన్నర్స్ బోరే బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్స్

ఎట్ 14,700 టన్నర్స్ బోరే బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్స్

అత్యంత చిన్నగా ఉన్న ఈ జలాంతర్గాములు చాలా ప్రమాదకరమైనవి. ఒకేసారి 16 బాలిస్టిక్ మిస్సైల్స్ ను తీసుకెళ్లగలిగే సామర్ధ్యం వీటి సొంతం. ఆరు నుంచి 10 వార్ హెడ్ లను ఒకేసారి ప్రయోగించగలదు. 8300 కిలో మీటర్ల దూరపు లక్ష్యాన్ని ఇవి చేధించగలవు.

ది రష్యన్ ఎమ్ ఐ 28 హవోక్ హెలికాప్టర్

ది రష్యన్ ఎమ్ ఐ 28 హవోక్ హెలికాప్టర్

హెలికాప్టర్లను వెంటాడి వాటిని తుదముట్టించగల అత్యాధునిక హెలికాప్టర్ ఇది. ఇప్పుడు రష్యా ఆర్మీ చేతిలో ఉంది. ఇది ఆకాశంలోకి నాలుగు యాంటి టాంక్ క్షిపణులను మోసుకెళ్లగలదు. అవి రాకెట్ ప్యాడ్లు కావచ్చు అలాగే గన్ ప్యాడ్లు కావచ్చు.

సుఖోయ్ స్ట్రైక్ విమానాలు

సుఖోయ్ స్ట్రైక్ విమానాలు

గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణి ఇది.

సుఖోయ్ స్ట్రైక్ విమానాలు నెక్ట్స్ జనరేషన్

సుఖోయ్ స్ట్రైక్ విమానాలు నెక్ట్స్ జనరేషన్

ఇక ఈ విమానాలను వచ్చే జనరేషన్ విమానాలుగా తీర్చి దిద్దనున్నారు. సుఖోయ్ టీ 50 పేరుతో వీటికి ఇంకా అత్యాధునిక టెక్నాలజీని జోడించనున్నారు. రాడార్లకు చిక్కకుండా సిగ్నల్స్ కు దొరక్కుండా శత్రువుల విమానాలను ధ్వంసం చేసే విధంగా తయారుచేయనున్నారు.

యాక్టివ్ కరెంట్ స్కాన్డ్ అర్రే రాడార్ (AESA)

యాక్టివ్ కరెంట్ స్కాన్డ్ అర్రే రాడార్ (AESA)

ఆకాశంలోని స్కానింగ్ చేసి విమానాలను నాశనం చేసే ఈ విమానాలను రష్యా తన అమ్ములపొదిలో చేర్చుకోనుంది. ఎటువైపు వెళుతున్నా సరే వాటిని స్కాన్ చేసి క్షణాల్లో వాటిని భస్మీ పటలం చేయగలిగ విధంగా వీటిని రూపొందిస్తున్నారు.

టీ 14 ఆర్మటా మెయిన్ బాటిల్ ట్యాంక్

టీ 14 ఆర్మటా మెయిన్ బాటిల్ ట్యాంక్

ఇదొక ప్రమాదకరమైన యుద్ధ ట్యాంకు..ఎదురుగా ఎటువంటివి ఉన్నా వాటిని ఇట్టే ధ్వంసం చేయగలవు కూడా. బరువు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని ప్రొపైల్ కూడా చాలా తక్కువ. కాని యుద్ధంలోకి దిగిందంటే ఎంత పెద్ద ప్రొపైల్ కన్నా సమాధానం చెప్పగలదు. 2300 ట్యాంకులను కొనాలని రష్యా ప్లాన్ చేస్తోంది.

యాసిన్ అటాక్ సబ్ మెరైన్స్

యాసిన్ అటాక్ సబ్ మెరైన్స్

నీటిలోపలి నుంచే శత్రువులకు కనపడకుండా వాటి దగ్గరకు చేరుకోగల అత్యాధునిక జలాంతర్గామి ఇది. 1980లో వచ్చిన ఓల్డ్ ఆకుల క్లాస్ అటాక్ జలాంతర్గామికి అత్యాధునిక హంగులన జోడించి దీన్ని తయారుచేయనున్నారు. ఇది రంగంలోకి దిగిందంటే శత్రువులకు సంబంధించి ఓ ఒక్కటి మిగలదు. నీటి లోపలి నుంచే శత్రు స్థావరాలను పసిగట్టి వాటిపై క్షిపణులను ప్రయోగించగలదు.

యాసిన్ అటాక్ సబ్ మెరైన్స్

యాసిన్ అటాక్ సబ్ మెరైన్స్

నీటిలోపలి నుంచే శత్రువులకు కనపడకుండా వాటి దగ్గరకు చేరుకోగల అత్యాధునిక జలాంతర్గామి ఇది. 1980లో వచ్చిన ఓల్డ్ ఆకుల క్లాస్ అటాక్ జలాంతర్గామికి అత్యాధునిక హంగులన జోడించి దీన్ని తయారుచేయనున్నారు. ఇది రంగంలోకి దిగిందంటే శత్రువులకు సంబంధించి ఓ ఒక్కటి మిగలదు. నీటి లోపలి నుంచే శత్రు స్థావరాలను పసిగట్టి వాటిపై క్షిపణులను ప్రయోగించగలదు.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Russia’s five most threatening weapons detailed 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X