న్యూజిలాండ్‌కు ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి, ఎవరికంటే..?

Written By:

మీరు ఇంజనీరింగ్ చదివారా..జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా..అయితే మీకోసం న్యూజిలాండ్ అద్భుత ఆఫర్ ఇస్తోంది. ప్రతిభ గల ఇంజనీర్ల కోసం న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ నగరం అన్వేషణ మొదలు పెట్టింది. అభ్యర్థులు ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా వెల్లింగ్టన్ కు ఇంటర్వ్యూ కోసం వచ్చేందుకు వీలుగా ఉచిత విమాన ప్రయాణం, ఉచిత వసతి కల్పిస్తామని ప్రకటించింది. కారణం ఇదే..

డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ, 6 జిబి ర్యామ్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రముఖ టెక్నాలజీ సంస్థలు

వెల్లింగ్టన్ నగరంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు 100 మంది ఇంజనీర్లను నియమించుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి.

రిజిష్టర్ లింక్ కోసం క్లిక్ చేయండి

మార్చి 8 -11 తేదీల మధ్య

ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 8 -11 తేదీల మధ్య నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు, టెక్ లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసింది.
రిజిష్టర్ లింక్ కోసం క్లిక్ చేయండి

ఉచిత ప్రయాణ, వసతి సౌకర్యాలు

దీనికి హాజరయ్యేందుకు గాను అభ్యర్థులకు ఉచిత ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లింగ్టన్ మేయర్ జస్టిన్ లెస్టర్ తెలిపారు. 

అభ్యర్థులు తమ సీవీలను

ముందుగా అభ్యర్థులు తమ సీవీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పరిశీలన అంనతరం వీడియో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ తర్వాత ఉద్యోగ సంస్థలు కాల్ చేసి అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి.

ప్రత్యక్ష ఇంటర్వ్యూల కోసం

వారి ప్రతిభ నచ్చితే అదే విషయాన్ని పేర్కొంటూ వారి అభ్యర్థిత్వాలను సిఫారసు చేస్తాయి. దాంతో అప్పుడు ప్రత్యక్ష ఇంటర్వ్యూల కోసం అభ్యర్థులు వెల్లింగ్టన్ కు ప్రయాణం కట్టాల్సి ఉంటుంది. సో అర్హులైన వారు రెడీగా ఉండండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Free trips to New Zealand offered to 100 tech workers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot