ఇక శ్మశానాల్లో ఫ్రీ వైపై

Written By:

వైర్‌లెస్ ఇంటర్నెట్ ఇప్పుడు పాపులర్. ఆ సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ సేవాలు అందుబాటులో ఉన్నాయి. కేఫ్‌లు, మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై వస్తోంది. ఇప్పుడు ఆ సేవలను రష్యా ప్రభుత్వం శ్మశానవాటికల్లోనూ కల్పించనుంది. మాస్కో నగరంలో ఉన్న కీలక శ్మశానవాటికల్లో పౌరులకు ఉచిత వై-ఫై సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Read more: ఆపిల్ సీక్రెట్ ప్రాజెక్ట్‌లు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రష్యాలోని పలునగరాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో

రష్యాలోని పలునగరాల్లో ఉన్న శ్మశాన వాటికల్లో ఉచిత వైఫై సేవలను అధికారులు అందిచనున్నారు. ఈ సేవలను తొలుత వాగన్ కోవ్ ,ట్రోయెకురొవ్, నొవొడెవిచీ శ్మశానవాటికల్లో వచ్చే ఏడాది నుంచి అందుబాలులోకి రానున్నాయి.

ఆ తర్వాత రష్యా రాజధాని మాస్కోలో

ఆ తర్వాత రష్యా రాజధాని మాస్కోలో ఈ ఉచిత వైఫైసేవలను కల్పించనున్నారు. అయితే రాజధాని నరగంలోని మాస్కోలో ఈ ఉచిత వైఫై సేవలను ముందుగా అందించకపోవడానికి కారణాలు లేకపోలేదు.

వాగన్ కోవ్,ట్రోయెకురోవ్,నొవొడెవిచీ శ్మశానవాటికల్లో

వాగన్ కోవ్,ట్రోయెకురోవ్,నొవొడెవిచీ శ్మశానవాటికల్లో రష్యాకు చెందిన పలువురు ప్రముఖుల సమాధులు ఉన్నాయి.ఇక్కడికి సందర్శకులు తరచుగా వస్తుంటారని సమాచారం సేకరిస్తుంటారని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కానియా తెలిపారు.

కొంతమంది ఆయా సమాధుల వద్ద నిలబడి ఫోటోలు

కొంతమంది ఆయా సమాధుల వద్ద నిలబడి ఫోటోలు దిగుతుంటారని పేర్కొన్నారు. అందుకే ఈ శ్మశాన వాటికల వద్ద ముందుగా ఉచిత వైఫై సేవలందించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఇక్కడ వైఫై సేవలకు లభించే ఆదరణను అనుసరించి మిగిలిన శ్మశాన వాటికలకూ ఈ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు.

రష్యా ప్రముఖ దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చొకోవ్

కాగా రష్యా ప్రముఖ దిగ్గజాలైన ప్రముఖ రచయిత ఆంటన్ చొకోవ్ ,సోవియట్ నేత నికిత కృశ్చేవ్,మొదటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ వంటి ప్రముఖుల సమాధులు ఆ శ్మశాన వాటికల్లో ఉన్నాయి.

ఇంతకుముందు రష్యా రాజధాని మాస్కో వాసులు

కాగా ఇంతకుముందు రష్యా రాజధాని మాస్కో వాసులు ఇప్పటివరకు హోటళ్లు, మెట్రో స్టేషన్లలో వైర్‌లెస్‌ ఫ్రి ఇంటర్నెట్ సదుపాయం ఉండేది. ఇప్పుడు వాళ్లు ఊహించనివిధంగా నగరంలోని శ్మశానాల్లోనూ ఉచిత వై-ఫై సేవలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతుడంతో వారు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శ్మశానాలు ప్రజలకు బహిరంగ మ్యూజియంలుగా

అయితే ఈ శ్మశానాలు ప్రజలకు బహిరంగ మ్యూజియంలుగా మారిపోయాయని, ఇక్కడికి ప్రజలు తరచుగా వచ్చి ఏదో ఒక సమాధి ముందు నిలబడి.. అందులో ఖననం చేయబడిన ప్రముఖ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటారని, అందుకే వీటిలో ఉచిత వై-ఫై సేవలు అందించాలని భావిస్తున్నామని మాస్కో శ్మశాన నిర్వహణ సంస్థ ప్రతినిధి లిల్యా ల్వొస్కాయా తెలిపారు.

వై-ఫై సేవలు ప్రజాదరణ పొందితే

వీటిలో వై-ఫై సేవలు ప్రజాదరణ పొందితే నగరంలోని 133 శ్మశానవాటికలకూ ఈ సేవలు విస్తరింపజేయాలని అధికారులు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Free Wi-Fi Coming to Moscow Cemeteries
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot