ప్రతీకార జ్వాల : ఉగ్రవాదంపై ఫ్రాన్స్ పంజా

|

అందాల నగరాన్ని మృత్యు నగరంగా మార్చిన ఉగ్రవాదులపై ఫ్రాన్స్ తన పంజా విప్పింది. ఉగ్రవాదులు ఉండే ప్రతి ప్రదేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తోంది. అనుమానమున్న చోటల్లా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని భావించిన ప్రతిచోటా ఫ్రాన్స్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అందాల ప్యారిస్ కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ ఉగ్రవాదాన్ని సర్వనాశనం చేసే దాకా నిద్రపోయేది లేదంటూ ఫ్రాన్స్ తన పంజా విసురుతోంది. ఫ్రాన్స్ విసిరిన పంజా దెబ్బకు ఉగ్రవాదులు ఇప్పడు గిలగిలకొట్టుకునే పరిస్థితి ఎదురయింది.

తన చావును తనే కొని తెచ్చుకుంటోంది

తమ దేశంపై జరిగిన ఉగ్రదాడికి ఫ్రాన్స్ సమాధానం..
 

తమ దేశంపై జరిగిన ఉగ్రదాడికి ఫ్రాన్స్ సమాధానం..

తమ దేశంపై జరిగిన ఉగ్రదాడికి ఫ్రాన్స్ సమాధానం చెప్పడం ప్రారంబించింది. ఆదివారం పొద్దుపోయిన తరువాత 10 యుద్ధ విమానాలు యూఏఈ,జోర్డాన్ దేశాల్లోని బేస్ ల నుంచి సిరియా వైపు వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయని భావించిన చోటల్లా బాంబుల వర్షం కనిపించాయి. మొత్తం 20 శక్తివంతమైన బాంబులను జార విడిచినట్లు ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

సిరియాలోని రఖ్ఖా వద్ద గల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై

పారిస్ పై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా సిరియాలోని రఖ్ఖా వద్ద గల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు నిర్వహించింది. పారిస్ పై దాడి సందర్భంగా ‘యుద్ధంలో ఇది భాగం' అంటూ ఉగ్రవాదులు ఇచ్చిన సందేశానికి తాము ధీటుగా బదులివ్వకుండా ఊరుకోబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే అన్నారు.

వారు మొదలుపెట్టిన యుద్ధాన్ని తాము పూర్తి చేస్తామని

వారు మొదలుపెట్టిన యుద్ధాన్ని తాము పూర్తి చేస్తామని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఘటనను విచారిస్తున్న అమెరికా, ఫ్రాన్స్ అధికారులకు ఖచ్చితమైన ఆధారాలు లభించాయని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారు ఏవిధంగా కుట్ర పన్నారో తమకు పూర్తి సమాచారం లభించిందని, త్వరలో మరిన్ని విషయాలను వెల్లడించనున్నామని తెలిపారు.

ఆధునిక ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించారని..
 

ఆధునిక ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించారని..

దాడులకు కుట్రచేయటంలో భాగంగా వారు ఆధునిక ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగించారని, సోషల్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ ఫార్మర్లు అయిన వాట్సాప్ వంటి వాటిని ఉపయోగించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని తమ విచారణలో తెలిసిందని ఫాన్స్ పోలీసులు తెలిపారు.

దాడికి అన్నివిధాలుగా శిక్షణ పొందిన తీవ్రవాదులను

దాడికి అన్నివిధాలుగా శిక్షణ పొందిన తీవ్రవాదులను ఇక్కడికి పంపించారని, వారు చాలా తెలివిగా వ్యవహరించారని తెలిపారు.

ఒకరి తుపాకిలో బుల్లెట్లు అయిపోయిన వెంటనే..

ఒకరి తుపాకిలో బుల్లెట్లు అయిపోయిన వెంటనే రీలోడ్ చేసుకునే విరామంలో మరో తీవ్రవాది కాల్పులకు దిగబడటం, ఒక తీవ్రవాది పేలుళ్ళకు పాల్పడిన వెంటనే మరో తీవ్రవాది పేలుళ్ళకు పాల్పడటం చేశారని, ఇందురు వారు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజి చేయగలిగారని తెలిపారు.

ఒకరి తుపాకిలో బుల్లెట్లు అయిపోయిన వెంటనే..

ఒకరి తుపాకిలో బుల్లెట్లు అయిపోయిన వెంటనే రీలోడ్ చేసుకునే విరామంలో మరో తీవ్రవాది కాల్పులకు దిగబడటం, ఒక తీవ్రవాది పేలుళ్ళకు పాల్పడిన వెంటనే మరో తీవ్రవాది పేలుళ్ళకు పాల్పడటం చేశారని, ఇందురు వారు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజి చేయగలిగారని తెలిపారు.

ఒకదానివెంట మరొకటి చేసి ప్రపంచ దేశాలను భయానికి గురిచేసి..

రష్యాలో విమానాన్ని కూల్చివేయటం, పారిస్ లో ఆత్మాడుతి దాడి, తూపాకులతో దాడికి పాల్పడటం ఒకదానివెంట మరొకటి చేసి ప్రపంచ దేశాలను భయానికి గురిచేసి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని వారు భావించారని అధికారులు పేర్కొన్నారు.

దేశాధినేతల మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు..

ఆదివారం నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే, టర్కీ ప్రభుత్వం సహా మరికొన్ని దేశాధినేతల మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని ఫ్రాన్స్ పోలీసు అధికారులు తెలిపారు.

ఉగ్రదాడులకు ఫ్రాన్స్‌ లక్ష్యం కావడానికి కారణమేంటి.

అయితే ఉగ్రదాడులకు ఫ్రాన్స్‌ లక్ష్యం కావడానికి కారణమేంటి? ఈ ఏడాది మొదట్లో చార్లీ హెబ్డో పత్రికపై దాడిచేసిన ఉగ్రమూకలు 10 నెలల్లో మరో నరమేధానికి ఒడిగట్టాయి. లౌకిక దేశంగా పేరున్న ఫ్రాన్స్‌ ఐరోపాలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉంది. అధికారిక కార్యకలాపాల్లో మత ప్రస్తావన ఉండదు. ఇలాంటి దేశం.. మతోన్మాద ఐఎస్‌ ఉగ్రవాదుల లక్ష్యం కావడానికి కారణాలివీ..

ఫ్రాన్స్‌కు ఉత్తర ఆఫ్రికాలోని పలు ముస్లిం దేశాలతో సుదీర్ఘ అనుబంధం

ఫ్రాన్స్‌కు ఉత్తర ఆఫ్రికాలోని పలు ముస్లిం దేశాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అవన్నీ ఒక నాడు ఫ్రాన్స్‌ వలస రాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో పలువురు ఫ్రెంచివారు ఆయా దేశాల్లో స్థిరపడగా, ఆ దేశాల నుంచి అనేకమంది ఫ్రాన్స్‌ వచ్చి స్థిర పడ్డారు. వీరిలో అధికశాతం ముస్లింలే. దశాబ్దా లుగా వారు ఫ్రాన్స్‌లో ఉంటున్నా, స్థానికులు తమను వేరుచేసి చూస్తున్నారన్న భావం వారిలో ఉండిపోయింది.

ఇది క్రమేణా పెరుగుతూ మత అసహనానికి దారితీసి ..

ఇది క్రమేణా పెరుగుతూ మత అసహనానికి దారితీసి ముస్లింలను ఉగ్రవాదం వైపు పురిగొల్పింది. మరే ఇతర ఐరోపా దేశాల నుంచి లేనివిధంగా ఫ్రాన్స్‌నుంచి 1000మందిదాకా యువకులు ఐఎస్‌వంటి ఉగ్ర సంస్థల్లో చేరారు. ఫ్రాన్స్‌ జైళ్లలోని ఖైదీల్లో 70శాతం ముస్లింలే. వీరిలో అధికశాతం అసహనంతో తొలుత చిన్న చిన్న నేరాలకు పాల్పడినవారే. జైళ్లలో ఉగ్రసంస్థలు వీరిని తమ వైపు తిప్పుకుంటున్నాయి.

మహ్మద్‌ మెరాహ్‌ అనే వ్యక్తి 2012లో

మహ్మద్‌ మెరాహ్‌ అనే వ్యక్తి 2012లో జనసమ్మ ర్దంగల ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. అతన్ని పోలీసులు జైలుకు పంపగా ఆ తర్వాత అతడు కరడుగట్టిన ఉగ్రవాదిగా మారాడు. ఈ పరిస్థితిపై పాలకులు దృష్టి సారించకపోవడం దేశానికి ముప్పుగా పరిణమిస్తోంది.

తీవ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌ చురుగ్గా పాల్గొనడమూ..

ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌ చురుగ్గా పాల్గొనడమూ ఈ దేశాన్ని ఉగ్రవాదులు లక్ష్యం చేసుకోవడానికి కారణమవుతోంది. మాలి, లిబియా, ఇరాక్‌ల్లో 10వేల మందిదాకా ఫ్రాన్స్‌ సైనికులు దాడుల్లో పాల్గొంటున్నారు. వారం కిందట ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండే ఇరాక్‌లో ఐఎస్‌పై పోరాటానికి పర్షియన్‌ గల్ఫ్‌లో విమానవాహక నౌకలను మోహరించనున్నట్లు ప్రకటించారు.

ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు అన్ని దేశాలు ఏకమైతేనే

ఇప్పుడు ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు అన్ని దేశాలు ఏకమైతేనే ఈ రాక్షసకాండకు చరమగీతం పాడినట్లవుతుంది. ఇది ఒక్క దేశంతో పోయేది కాదు..అన్ని దేశాలను వణికించేది..మొన్న రష్యా విమానం నిన్న ప్యారిస్ దాడులు రేపు ఏధైనా కావచ్చు.. వాటిని సమూలంగా నాశనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Here Write French Jets Bomb ISIS Targets in Syria After Police Launch Manhunt for 'Dangerous' Suspect

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more