తన చావును తనే కొని తెచ్చుకుంటోంది

Written By:

రానున్న కాలంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాలతో ప్రపంచానికే ఓ పీడకలగా మారనుందా.. తాను తయారుచేసిన అణ్వాయుధాలే ఆ దేశ కొంపలు ముంచనున్నాయా..లేక ఆ అణ్వాయుధాలతో ప్రపంచానికి ప్రమాదకరరీతిలో అది తయారుకానుందా..ఒక్కో స్థానం ఎగబాకుతూ అమెరికా , రష్యాలను తలదన్నే రీతిలో బాంబులను తయారుచేయనుందా.. ఆ బాంబులే పాకిస్తాన్ కొంప ముంచేందుకు సిద్ధమవుతున్నాయా.. అంటే అవుననే అంటోంది అమెరికా..అది ప్రపంచానికే పెనుముప్పుగా మారబోతుందని అలాగే తన చావును తనే కొని తెచ్చుకోబోతుందని ఆ దేశ పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనం రాసింది.

Read more: బుద్ధిమారని పాక్: యుద్ధానికి రమ్మంటూ సంకేతాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రానున్న రోజుల్లో పాకిస్థాన్‌ ఒక అణు పీడకలగా..

రానున్న దశాబ్దకాలంలో పాకిస్థాన్‌ అణుశక్తి దేశాలలో మూడోస్థానంలో నిలువనున్నదని, ఇది ప్రపంచానికి ప్రమాదకరమని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. రానున్న రోజుల్లో పాకిస్థాన్‌ ఒక అణు పీడకలగా మారనున్నది.

ఇప్పటికే దాదాపు 120 వార్‌హెడ్లను కలిగిన ఉన్న పాకిస్థాన్‌..

ఇప్పటికే దాదాపు 120 వార్‌హెడ్లను కలిగిన ఉన్న పాకిస్థాన్‌ అమెరికా, రష్యాల తర్వాత మూడోస్థానంలోనూ, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్ల కంటే ముందు స్థానంలోనూ నిలిచిందని, ఇతర దేశాలతో పోలిస్తే పాక్‌ ఆయుధాగారం వేగంగా వృద్ధి చెందుతోందని, ఇటీవల కాలంలో మరిన్ని అణ్వాయుధాలను తన ఆయుధాగారంలో చేర్చుకుందని తెలిపింది.

అక్కడి సైనిక దళాలే వారికి శిక్షణ, ఆయుధాలు ..

భారత్‌తో పాటు దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల అణు క్షిపణులను పాక్‌ సమకూర్చుకుందని తెలిపింది. పలు ఉగ్రవాద గ్రూపులకు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోంది. అక్కడి సైనిక దళాలే వారికి శిక్షణ, ఆయుధాలు సమకూరుస్తున్నారు.

దక్షిణాషియాలోనే కాక మొత్తం ప్రపంచానికి ప్రమాదకర రీతిలో..

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రవర్గాలు పనిచేస్తున్నాయి. దక్షిణాషియాలోనే కాక మొత్తం ప్రపంచానికి ప్రమాదకర రీతిలో పాకిస్థాన్‌ తయారవుతోందని పేర్కొంది. ఇవన్నీ కలవరపెట్టే నిజాలని పేర్కొంది.

అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో పాకిస్తాన్ 3వ స్థానం..

పాకిస్తాన్ ప్రస్తుతం తన అణుశక్తిని విపరీతంగా పెంచుకునే పనిలో ఉందని అమెరికా పేర్కొంది. ఇప్పటికే పాక్ వద్ద 120కి పైగా అణ్వాయుధాలు ఉన్నాయని, ప్రస్తుతం అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో పాకిస్తాన్ 3వ స్థానం ఉందని అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు.

ఒక్కో స్థానం ఎగబాకుతూ.. అమెరికా, రష్యాల తర్వాత ..

ఒక్కో స్థానం ఎగబాకుతూ.. అమెరికా, రష్యాల తర్వాత ఎక్కువ అణుబాంబులను కలిగి ఉన్న దేశంగా నేడు పరిణమించిందని, పాక్ తర్వాత స్థానాల్లో చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలున్నాయంటూ తాజా జాబితాతో పాటు అమెరికా ఇంటలిజెన్స్ అధికారులు రూపొందించిన నివేదికను అమెరికా మీడియా వెల్లడించింది.

గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ అణు వార్ హెడ్ ల తయారీలో ..

గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ అణు వార్ హెడ్ ల తయారీలో తలమునకలై ఉందని, అణ్వాయుధాల తయారీకి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆసియా ప్రాంతంలో బలమైన అణుదేశంగా ఎదగటంతో పాటు, భారత్ ను భయపెట్టాలని ప్రయత్నిస్తోందని అమెరికా మీడియా పేర్కొంది.

భారత్ విషయంలో అణు వార్ హెడ్ లకంటే చర్చలే ..

భారత్ విషయంలో అణు వార్ హెడ్ లకంటే చర్చలే సరైన పరిష్కారాన్ని చూపగలవని పాకిస్తాన్ కు వ్యంగ్యంగా సలహా ఇచ్చింది.

తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే పాకిస్తానే ఎక్కువ నష్టపోవాల్సి..

పాక్ ఎక్కువ మొత్తంలో అణ్వాయుధాలు కలిగి ఉండటం వల్ల భారత్ కు ఏ నష్టం ఉండదనీ, ఒక వేళ అవి తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే పాకిస్తానే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందని కూడా అమెరికా మీడియా విశ్లేషించింది.

ఒక్క అణ్వాయుధం కూడా లేని ఇరాన్ కంటే కూడా..

ఇప్పటికే అనేక అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్, ఒక్క అణ్వాయుధం కూడా లేని ఇరాన్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆయుధ తయారీపై ఖర్చు చేస్తోందని ఇంటలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.

భారత్ కంటే పాకిస్తాన్ కే ఎక్కువ మంచిదని..

అణు పరీక్షలు, ఎక్కువ దూరాలను చేరుకునే మిసైల్స్ పరీక్షలను పాక్ నిలిపివేస్తే.. భారత్ కంటే పాకిస్తాన్ కే ఎక్కువ మంచిదని, దీనివల్ల పాక్ ఆర్థిక పరిస్థితి కొంత బాగుపడే అవకాశముందని పేర్కొన్నారు.

ఒక్క అణ్వాయుధం కూడా లేని ఇరాన్ కంటే కూడా..

ఇప్పటికే అనేక అణ్వాయుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్, ఒక్క అణ్వాయుధం కూడా లేని ఇరాన్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆయుధ తయారీపై ఖర్చు చేస్తోందని ఇంటలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.

నవాజ్ షరీఫ్ తో భేటీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..

గత అక్టోబర్ 22న పాక్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తో భేటీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అంశాన్ని లేవనెత్తితే బాగుండేదని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ తో కూడా అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందంపై సంతకం చేయించాల్సిన అవసరం ఉందని, అగ్రదేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని అమెరికా మీడియా పేర్కొంది.

అంతర్జాతీయ దేశాలు ఒత్తిడి చేస్తున్నా..

మరో పదేళ్లలో అత్యధిక అణ్వాయుధాలు నిల్వ చేసుకున్న టాప్-3 దేశంగా పాకిస్తాన్ నిలిచి ప్రపంచానికి ప్రమాదకరంగా తయారు కానున్నదని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ దేశాలు ఒత్తిడి చేస్తున్నా, పాకిస్తాన్ అణు కార్యక్రమాల విషయంలో ముందుకే వెళుతోందని ఆరోపించింది.

2025 నాటికి అణ్వాయుధాల విషయంలో ..

ఇప్పటికే 120 వార్‌హెడ్స్ ఆ దేశంలో ఉన్నాయని, 2025 నాటికి అణ్వాయుధాల విషయంలో చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లను పాకిస్తాన్ అధిగమించనుందని, ఆ సమయానికి ఇండియాలోని అన్ని ప్రాంతాలను, అంతకు మించిన సుదూర లక్ష్యాలను పాక్ అణ్వాయుధాలు చేరుకునేలా ఉంటాయని, ఈ విషయం ప్రపంచానికి పీడ కలేనని 'న్యూయార్క్ టైమ్స్' తన సంపాదకీయంలో అభిప్రాయపడింది.

ఇప్పటికే తీవ్రవాదుల సంఖ్య అధికంగా ఉన్న ఆ దేశంలో ..

ఇప్పటికే తీవ్రవాదుల సంఖ్య అధికంగా ఉన్న ఆ దేశంలో అణ్వా యుధాలు వారి చేతికి చేరితే మరింత ప్రమాదకరమని వ్యాఖ్యానిం చింది. మరీ పాక్ తన బుద్ధని మార్చుకుంటుందో లేదో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Pakistan in a losing nuclear weapons race New York Times
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot