ఆదర్శం : రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్‌తో గ్రామాన్ని పరుగులెత్తిస్తోంది

By Hazarath
|

ఈ రోజుల్లో కంప్యూటర్ నేర్చుకోవాలంటే కిందా మీదా పడుతుంటారు చాలామంది. ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులుకు అసలు కంప్యూటర్ అంటే ఏంటో దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. అయితే వీరందరికీ ఇప్పుడు ఈ బామ్మ స్ఫూర్తినిస్తోంది. చదువురాని బామ్మ కీ బోర్డ్ మీద చకచకావేళ్లు కదుపుతోంది. అందరికీ ఇనిస్ఫిరేషన్‌గా నిలుస్తోంది. ఆ బామ్మ కథేంటో చూడండి.

Read more: ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

మీరు చూస్తున్న ఈ బామ్మ పేరు నౌరోతి దేవి. వయసు 74 ఏళ్లు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా, హర్మడా గ్రామం మాజీ సర్పంచ్. అంతేకాదు గ్రామ సర్పంచ్‌గా గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దవచ్చో చేసి చూపించిన ధీరవనిత.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

ఈ బామ్మకు కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో 15 ఏళ్ల క్రితం వరకు తెలియను కూడా తెలియదు. అసలు ఎప్పుడూ బడికి కూడా పోలేదు. దళిత కుటుంబానికి చెందిన ఈ బామ్మకు చదువు ఎలా ఉంటుందో కూడా తెలియదు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

చిన్నప్పటినుంచే తోటి పనివాళ్లతో రాళ్లు కొట్టి జీవించేది. ఎక్కువ వరకు రోడ్డు పనులకు రాళ్లు కొట్టేది. 1980వ దశకం వరకు ఆమె జీవనం ఇలాగే కొనసాగింది. అప్పట్లో ఆమెతోపాటు ఆడవారికి రోజుకు నాలుగు రూపాయలు కూలీ ఇచ్చేవారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

అయితే మగవాళ్లకు కూలి ఎక్కువ మాకు తక్కువ అంటూ నిలదీసి సంచలనం సృష్టించింది. మగవాళ్లతో సమానంగా కష్టపడి పనిచేస్తున్నా ఈ వివక్ష ఏమిటని ఆమె కాంట్రాక్టర్‌ను, ప్రభుత్వ ఇంజనీరును ప్రశ్నించింది.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

వారికన్నా మేమే ఎక్కువగా పనిచేయగలం అని నిరూపించి కోర్టు మెట్లు ఎక్కింది. తోటి మహిళలతో కలసి జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో న్యాయపోరాటం జరిపింది. అప్పటికీ న్యాయం జరగలేదు. దాంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

చివరకు సుప్రీంకోర్టులో గెలిచి మగవారితో సమానంగా వేతనాలు అందుకుంది. అయితే ఈ పోరాటంటో ఆమెకు ఎన్నో విషయాలు తెలిసాయి. కాని చదువు లేకపోవడం వల్ల వేలి ముద్రలు వేయడం ఆమెను ఎంతగానో కుంగదీసింది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

ఎలాగైనా చదువు నేర్చుకోవాలని 60 ఏళ్ల ప్రాయంలో స్వగ్రామమైన హర్మడాకు నాలుగు కిలోమీటర్ల దూరంలోవున్న టిలోనియాలోని ‘బేర్‌ఫుట్ కాలేజ్'కు వెళ్లి ఆరు నెలల కోర్సు చదివారు. అక్కడే అక్షర మాల నుంచి ప్రపంచ విజ్ఞానం వరకు తెలుసుకున్నారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

కంప్యూటర్‌తోనే అన్ని పనులు జరుగుతాయని తెలిసి కంప్యూటర్ తెలిసిన పిల్లల ద్వారా కంప్యూటర్ విద్య నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె వద్ద కంప్యూటర్ శిక్షణ పొందిన అనేక మంది గ్రామస్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

అంతే కాకుండా న్యాయపోరాటంలో భాగంగా తోటి మహిళలతోపాటు గ్రామంలోను ఆమె నాయకురాలిగా ఎదిగారు. గ్రామస్థుల సలహామేరకు ఆమె 2010లో గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలిచారు. ఆ వెంటనే సర్పంచ్ కార్యాలయంలో తాను శిక్షణ పొందిన బేర్‌ఫుట్ కాలేజ్ సహకారంతో ఓ కంప్యూటర్‌ని ఏర్పాటు చేశారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

అన్ని పనులు తానే స్వయంగా కంప్యూటర్ ద్వారా నిర్వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా ఆమె కంప్యూటర్ నేర్పించారు. కంప్యూటర్ ద్వారానే తనకు మహిళల హక్కులేమిటో, గ్రామ పౌరుల హక్కులేమిటో, సర్పంచ్‌గా తాను నిర్వహించాల్సిన బాధ్యతలేమిటో తెలుసుకుని ఆ దిశగా గ్రామాన్ని పరుగుల పెట్టించారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

ఇప్పుడు ఈ బామ్మ ‘వర్డ్'పైనా, ‘ఎక్సెల్'పైనా ఎలా పనిచేయాలో, ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తనకు బాగా తెలుసుని గర్వంగా చెబుతారు. ఇలాంటి బామ్మకు 2015లో సర్పంచ్‌గా మళ్లీ పోటీ చేయాలనుకున్న విద్యార్హతల కారణంగా వీలు కాలేదు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

సర్పంచ్ పదవికి పోటీచేసే వారు కనీసం 8వ తరగతి, జిల్లా పరిషద్, పంచాయతి సమితికి పోటీచేసే వారికి కనీసం పదవ తరగతి పాసైన విద్యార్హతలు ఉండాలని నిర్దేషిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం 2015లోనే బిల్లు తీసుకొచ్చింది. ఆ కారణంగా ఇప్పుడు బామ్మ కంప్యూటర్ శిక్షణకే పరిమితమయ్యారు.

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

రాళ్లు కొట్టిన బామ్మ కంప్యూటర్ పాఠాలతో అదరగొడుతోంది

అందరికీ కంప్యూటర్ పాఠాలను నేర్పిస్తూ కాలం గడిపేస్తున్నారు. చదువురాని వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Source: thebetterindia.com

Best Mobiles in India

English summary
Here Write From a Stone-Cutter to a Computer-Educated Sarpanch

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X