ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

Written By:

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ నలుగురు ఇప్పుడు హాట్ టాఫిక్. వారి గురించే చెప్పనే అవసరం లేదు. వారే తెలంగాణా సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్. మరి ఈ నలుగురిలో ఎవరినీ గూగుల్ లో ఎక్కువగా శోధించారు. ఎవరు టాప్ లో ఉన్నారు. అసలు వారిని ఏ పేర్లతో గూగుల్ లో ఎక్కువగా శోధించారు ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: సైంటిస్టుల ముందడుగు..చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

కేటీఆర్ తన తండ్రి రికార్డును గూగుల్ లో దాటేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ నంబర్ వన్. కేటీఆర్, కేటీఆర్ తెలంగాణ, కేటీఆర్ మినిస్టర్, కేటీఆర్ హైద్రాబాద్ అనే పేర్లతో గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తెలిసింది.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

ఇక కేసీఆర్ తరువాత స్థానంలో దూసుకుపోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ నెటిజన్ల సెర్చ్‌లో ముందున్నారట. అయితే స్వల్ప తేడానే ఉందని తెలిసింది. కేసీఆర్ స్పీచ్ అనే కీ వర్డ్ కేసీఆర్ గురించి సెర్చ్ చేసిన జాబితాలో టాప్‌లో ఉందట. కేటీఆర్ లైమ్ లైట్‌లోకి రాగానే కేసీఆర్ ప్రభ తగ్గిందని ఈ సర్వేలో తేలింది.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

ఇక ఏపీ విషయానికొస్తే, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గూగుల్ సెర్చ్‌లో వెనుకబడ్డారు. 2014 ఎన్నికల తర్వాత జగన్ హవా ఒక్కసారిగా పడిపోయింది. 2015 జూన్‌లో చంద్రబాబు రాజధానికి భూమి పూజ చేసిన సమయంలో జగన్ హవా ఉన్నట్టుండి పెరిగిందని సర్వే వెల్లడించింది.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

జగన్ రాజధాని భూమి పూజకు వస్తారా లేదా అన్న డైలమానే నెట్‌లో సెర్చ్ చేయడానికి కారణంగా తెలుస్తోంది. జగన్ తర్వాత అతని గురించి సెర్చ్ చేసిన వివరాలలో ఆయన బెంగళూరు ఇల్లు ఉండటం గమనార్హం.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

ఇక జగన్‌కు సంబంధించి నెటిజన్లు సెర్చ్ చేసిన కీ వర్డ్స్‌లో ‘రాయలసీమ స్ట్రాంగ్‌మ్యాన్' అనే కీ వర్డ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ కీ వర్డ్‌ను ఎక్కువగా ఉపయోగించిన వారిలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి వాసులు ఎక్కువగా ఉన్నారు.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

ఇక సీఎం చంద్రబాబుకు నెటిజన్లలో క్రేజ్ పెరిగింది. రాజధానికి సంబంధించి భూమి పూజ జరిగినప్పటి నుంచి బాబు పేరు నెట్‌లో సెర్చ్ చేశారు. చంద్రబాబు గురించి నెట్‌లో ఎక్కువగా వెతుకులాడిన వారిలో గుంటూరు, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం వాసులు ఉన్నారు.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

జగన్ అంటే తక్కువ ఆసక్తి చూపిన వ్యక్తుల్లో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర వాసులు ఉండటం గమనార్హం. అలాగే తెలంగాణలో హైద్రాబాద్‌తో సహా చంద్రబాబు గురించి తెలుసుకోవడానికి అనాసక్తి చూపారు.

ఆ నలుగురిలో గూగుల్ రాజెవరంటే..

గూగుల్ సెర్ఛ్ లో తెలుగుదేశం యువనేత లోకేష్ బాగా వెనుకబడ్డారని తెలుస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write KTR tops Google search by netizens in Telugu States
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot