ప్రధాని నుంచే నేరుగా ఎస్‌ఎం‌ఎస్ వస్తే..

Written By:

ప్రధాని నుంచే నేరుగా ఎస్‌ఎం‌ఎస్ వస్తే.. ప్రధాని మనకు ఎస్‌ఎం‌ఎస్ చేయడమేంటని షాకవుతున్నారా..అవును రానున్న కాలంలో అదే జరగబోతోంది. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఇదిగో ఈ పధకం మీకోసమేనంటూ సందేశాలు ఇచ్చే రోజులు రాబోతున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ సంపర్క్ ను ప్రభుత్వం విస్తరించనుంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి నేరుగా పౌరులకు తెలిపేలా మోడీ సందేశాలు రాబోతున్నాయి. అది ఈ మెయిల్ రూపంలో కాని ఎస్‌ఎం‌ఎస్ రూపంలో కాని వస్తుంది మరి.

Read more: మోటోజీ ఫోన్లకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో రెడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రముఖుల జన్మదినాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ

ప్రముఖుల జన్మదినాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వారికి బర్త్ డే విషెస్ చెబుతుంటారు. అంతేకాక పలు ముఖ్య వేడుకలు, పర్వదినాల సందర్భంగా ఆయన ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేకంగా శుభాకాంక్షల ట్వీట్లు కనిపిస్తాయి.

వీటిని నరేంద్ర మోదీనే స్వయంగా ట్వీట్ చేస్తారన్న

వీటిని నరేంద్ర మోదీనే స్వయంగా ట్వీట్ చేస్తారన్న వాదన కూడా ఉంది. ఇకపై ఆయన మరింత బిజీ కానున్నారు. 

మన ఈ-మెయిల్ ఖాతాలోనూ ప్రధాని నేరుగా పంపే మెయిల్

ఎందుకంటే, ఏదేనీ కొత్త విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం (ఎస్సెమ్మెస్) నేరుగా ప్రధాని నుంచే మన మొబైల్ కు చేరుతుంది. అంతేకాదండోయ్, మన ఈ-మెయిల్ ఖాతాలోనూ ప్రధాని నేరుగా పంపే మెయిల్ కూడా ఉంటుందట.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను పాలనలో మరింత మేర భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా వృత్తి నిపుణుల మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్ అకౌంట్లకు

ప్రధానంగా వృత్తి నిపుణుల మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్ అకౌంట్లకు ప్రధాని నుంచి సమాచారం రానుంది. అలాగే సామాన్య పౌరులకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సంపర్క్ వద్ద ఉన్న నెంబర్ల అన్నింటీకి మోడీ సందేశాలు రానున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే ఈ-సంపర్క్ డేటా బేస్ కింద

ఈ మేరకు ఇప్పటికే ఈ-సంపర్క్ డేటా బేస్ కింద ప్రభుత్వం వద్ద 80 లక్షల ఈ-మెయిల్ ఖాతాలతో పాటు, కోటి మేర మొబైల్ నెంబర్లు ఉన్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ వినూత్న చర్యలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

నేరుగా ప్రధాని నుంచే ఎస్‌ఎం‌ఎస్ లేక ఈ మెయిల్

ఇక ముందు ముందు నేరుగా ప్రధాని నుంచే ఎస్‌ఎం‌ఎస్ లేక ఈ మెయిల్ అందుకోనున్నామన్నమాట.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Digital India: Get SMS alert informing of new policy decision straight from PM Narendra Modi
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot