ఆ విమానశ్రయంలో మనుషులు ఉండరు..దెయ్యాలు కనిపిస్తాయి

Posted By:

ఎక్కడైనా విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో ఎప్పుడూ బిజిగా ఉంటుంది.. ఇక వచ్చీ పోయే విమానాలతో అత్యంత రద్ధీగా మన దేశంలోని విమానాశ్రయాలు ఉంటాయి..అయితే ఆ విమానాశ్రయంలో మనుషులు ఉండరు. అక్కడ అంతా దెయ్యాలకోటలా ఉంటుంది.విమానాశ్రయం కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రయాణికుడు కూడా అక్కడికి వెళ్లలేదు..సుమారు 111 కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక హంగులతో విమానాశ్రయం నిర్మిస్తే ఇప్పడు అది దెయ్యాలకు నిలయంగా మారింది. అది ఎక్కడ తెలుసా రాజస్థాన్ లోని జై సల్మేర్ ఎయిర్ పోర్ట్. ఆ ఎయిర్ పోర్ట్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:ఎగిరే కార్లతో ఎంజాయ్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

111 కోట్లు ఖర్చు

జై సల్మేర్ రాజస్థాన్ లోని ఎడారి నగరం.ఇక్కడ అంతా ఎటు చూసినా ఇసుకతో అలరారుతూ ఉంటుంది. అటువంటి చోట దాదాపు 17 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 111 కోట్లు ఖర్చు పెట్టి రెండేళ్ల క్రితం అత్యాధునిక విమానాశ్రయాన్ని నిర్మించారు.

3 లక్షల మంది ప్రయాణికులు... 180 సీట్లు

ఈ విమానాశ్రయం దాదాపు 300 మంది ప్రయాణికుల అవసరాలు తీర్చేలా,180 సీట్లుండే మూడు విమానాలు ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించారు.

ఖాళీగా విమానాశ్రయం

ఇంత ఖర్చు పెట్టిన ఈ విమానాశ్రయం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒక్కరంటే ఒక్క ప్రయాణికుడు కూడా అక్కడి నుంచి ప్రయాణించడం లేదు.

326 కోట్లు 7 విమానాశ్రయాలు

జైసల్మేర్ ఒక్కటే కాదు. 2009 నుంచి దాదాపు ఇండియాలో 326 కోట్లతో సుమారు విమానాశ్రయాలను నిర్మించారు. వీటిల్లో ఒక్క ఎయిర్ పోర్టుకు సర్వీసులు తిరగట్లేదు.

దెయ్యాల కోటలు

ఈ ఎయిర్ పోర్ట్ లో ఖాళీగా కనిపించే చెకిన్ డెస్క్ లు ,దుమ్ముపట్టిన సీట్లు దర్శనమిస్తుంటాయి.ఇక రాత్రయితే అక్కడ లైట్లు వెలగక అవిదెయ్యాల కోటల్లా కనిపిస్తుంటాయి.

ఒక్క విమానం కూడా దిగలేదు

దేశ వ్యాప్తంగా ఎయిర్ ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలోని 100కు పైగా విమానాశ్రయాల్లో ఈ ఏడాది ఒక్క విమానం కూడా దిగలేదు. వీటిలో కొన్నింటిని చార్టెడ్ విమానాల కోసం నిర్మించినట్లుగా అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్పైస్ జెట్ స్పందన

ఒక విమానాశ్రయాన్ని నిర్మించినంత మాత్రాన మౌళిక వసతులు కల్పించేశాం అభివృద్ధి చెందామని భావించరాదు.వాస్తవ పరిస్థితులను గమనించాలి అని స్పైస్ జెట్ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అంటున్నారు.

వెనక్కి తగ్గిన స్పైస్ జెట్

గత సంవత్సరం తాము కొత్తగా నిర్మించిన మైసూరుకు సేవలను ప్రారంభించినా ప్రజల నుండి స్పందన లేకపోవడంతో వెనక్కి తగ్గామని ఆయన చెబుతున్నారు.

మోదీ మాటలతో బయటకు

విమాానశ్రయాలను ఆధునీకరిస్తామంటూ ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇటువంటి వాటిపై దృష్టి పెట్సాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

ఉన్నవి మరుగున...కొత్తవి పట్టాల మీదకి

ఉన్న విమానశ్రయాలను బాగుచేసి ఆ తరువాత కొత్త విమానశ్రయాల గురించి ఆలోచిస్తే బావుంటుందని పలువురు కోరుకుంటున్నారు. 

ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌లను నేరుగా మీ ఫేస్‌బుక్ పేజీలో చూడండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Two-and-a-half years after the completion of a new $17 million terminal building, the airport in Jaisalmer, a small and remote desert city in Rajasthan, stands empty.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot