అంతరిక్షంలో ఏలియన్స్ : ఆధారాలు ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు

Posted By:

ఏలియన్స్..ఏలియన్స్....ఎప్పటినుంచో ఈ పదం పరిశోధనల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తున్న పదం..మనలాగే అంతరిక్షంలో కూడా గ్రహాంతర వాసులు ఉన్నారని సైంటిస్టులు పరిశోధనలో ఒక్కో నిజం బయటకొస్తోంది..ఇక నాసా అయితే ఏలియన్స్ లైఫ్ ని తెలుసుకోవడానికి అంతరిక్షాన్ని జల్లెడపడుతోంది. మరి ఇంతలా జల్లెడ పడుతున్న వారికి ఎక్కడో ఓ చోట ఏదో ఒక ఆధారం దొరకకుండా పోదా అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న..అయితే అంతరిక్షంలో భూత కణాలు ఉన్నాయని అవి ఏలియన్స్ అయి ఉంటాయని ఈ మధ్య శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. మిగతా కధనం స్లైడర్ల లో చదవండి.

Read more:ఆశలు ఆవిరై పోతున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

"ఘోస్ట్ పార్టికల్"

అంతరిక్షంలో ఏం జరుగుతుందనేది నిరంతరం శాస్త్రవేత్తలు గమనిస్తూ, దానిపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా లండన్ కు చెందిన పరిశోధకులు అంతరిక్షంలో ఓ "ఘోస్ట్ పార్టికల్"ను కనుగొన్నారు. అది ఖచ్చితంగా గ్రహాంతరవాసిదే అయి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లివింగ్ బెలూన్ గా పేరుపెట్టిన ఈ కణం అంతరిక్షంలో అగుపించిందని అంటున్నారు.

మైక్రోస్కోపిక్ ఏలియన్ కణం

మైక్రోస్కోపిక్ ఏలియన్ కణంగా దాన్ని పరిగణించవచ్చని చెపుతున్నారు. మానవ వెంట్రుక వెడల్పుతో గోచరించిన ఈ కణం ఖచ్చితంగా గ్రహాంతరవాసిదై ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కార్బన్ మరియు ఆక్సిజన్ తో తయారు కాబడిన ఈ కణం

కార్బన్ మరియు ఆక్సిజన్ తో తయారు కాబడిన ఈ కణం భౌతిక స్వరూపాన్ని కనుక అంచనా వేస్తే ఏదో ఒక ప్రాణిదై ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్షంలో కనుగొన్న ఘోస్ట్ పరికరం నేపథ్యంలో ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు.

లివింగ్ బెలూన్లు

యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, యూనివర్సిటీ ఆఫ్ బకింగ్‌హామ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోబయోలజీలు రీసెర్చ్ చేశాయి. వారు చేసిన పరిశోధనల్లో మైక్రోస్కోపిక్ ఏలియన్ కణాలకు సంబంధించిన వాటిని గుర్తించారు. వాటిని లివింగ్ బెలూన్లుగా పేర్కొన్నారు.

ఒకచోటు నుండి మరొకచోటికి

అవి మైక్రోస్కోపిక్ ఏలియన్ ఆర్గాన్‌లను ఒకచోటు నుండి మరొకచోటికి తీసుకు వెళ్తుండవచ్చునని చెబుతున్నారు. దీంతో, ఎక్కడో ఒకచోట ఏలియన్స్ ఉండి ఉంటారని భావిస్తున్నారు.

కండువా అంత పొడవుతో, వెంట్రుక మందంతో

ఈ విషయమై పరిశోధకులు (రీసెర్చర్) మిల్టన్ వెయిన్‌రైట్ మాట్లాడుతూ.. సదరు లివింగ్ బెలూన్ కండువా అంత పొడవుతో, వెంట్రుక మందంతో ఉందని, దీనిని భూమికి 27 కిలోమీటర్ల దూరంలో స్ట్రాటో స్పియర్‌లో గుర్తించామని చెప్పారు.

ప్రకృతిలో జీవించి ఉందని..

అది ప్రకృతిలో జీవించి ఉందని, అది కార్బన్, ఆక్సిజన్ మూలాల సమ్మేళనం అన్నారు. ఈ లివింగ్ బెలూన్ గాలిలోని వాయువుల కంటే తేలికగా ఉందని, తద్వారా అది గాలిలో, స్పేస్ సముద్రంలో తేలియాడుతుందన్నారు.

ఎక్కడో ఓ చోట జీవం ఉందన్న విషయాన్ని మరోసారి..

అంతరిక్షంలో కనుగొన్నఈ విచిత్ర భూతకణంతో ఎక్కడో ఓ చోట జీవం ఉందన్న విషయాన్ని మరోసారి నిర్థారించుకున్నట్లు శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.ఇది కూలిపోయిన బెలూన్‌లా కనిపిస్తోందన్నారు. అది దాని సహజత్వం కావొచ్చన్నారు.

27 కిలోమీటర్ల దూరంలో ధూళికణాల మధ్య

ఇలాంటిది భూమి పైన గతంలో ఎప్పుడు కనిపించలేదన్నారు.భూ వాతావరణానికి 27 కిలోమీటర్ల దూరంలో ధూళికణాల మధ్య కనపడుతూ,మాయమవుతూ ఉందని రీసెర్చర్లు తెలిపారు.

జీవం ఉందనడానికి మరింత సాక్ష్యం

తమ పరిశోధనల తర్వాత అంతరిక్షంలో జీవం ఉందనడానికి మరింత సాక్ష్యం లభించినట్లయిందని పేర్కొన్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelug

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ghost Particle is Proof of Alien Life, Says Astrobiologists
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot