జీమెయిల్‌ కొత్త ఫీచర్ ‘Block’

|

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఈమెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్‌లో సరికొత్త ‘బ్లాక్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను జీమెయిల్ యూజర్లు సద్వినియోగం చేసుకోవటం ద్వారా అవసరంలేని స్పెసిఫిక్ ఈమెయిల్ అడ్రస్‌ను బ్లాక్ చేయవచ్చు. ముఖ్యంగా అవాంఛిత ఈమెయిళ్లను బ్లాక్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

 

Read More : బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ తగ్గింపు

ఈ బ్లాక్ ఆప్షన్‌‌తో కేవలం రెండే రెండు మౌస్ క్లిక్స్‌తో అనవసరమైన ఈమెయిల్ అడ్రస్‌లను బ్లాక్ చేయవచ్చు. మీరో ఈమెయిల్ అడ్రస్‌ను బ్లాక్ చేసిన తరువాత, ఆ మెయిల్ నుంచి వచ్చే మేసేజ్‌లన్ని స్పామ్ ఫోల్డర్‌కు పంపడబడతాయి. భవిష్యత్‌లో కావాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సదరు మెయిల్ ఐడీని అన్‌బ్లాక్ చేయవచ్చు. జీమెయిల్ వెబ్ వర్షన్‌లో ఈ ‘బ్లాక్ ఫీచర్'ను ఓపెన్ చేయబడిన ఈ-మెయిల్‌లో Reply buttonతో అనుసంధానమైన drop-down menuలో చూడొచ్చు.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్ ఒకటి. గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీసులు ఆప్టికల్ ఫైబర్ తీగల ద్వారా అందుతున్నాయి. ఈ వ్యవహారం ఖరీదైనదిగా ఉండటంతో అనేక దేశాల్లో ఇంటర్నెట్ అందని ద్రాక్షగానే ఉంది. ప్రపంచ జనాభాలో 220 కోట్ల మందికి అందుబాటులో ఉండగా.. 480 కోట్ల మందకి దూరంగానే ఉంది. ఈ అంతరాన్ని తొలగించే లక్ష్యంతో గూగుల్ ఈ ప్రాజెక్టు పై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. 18 నెలల క్రితం గూగుల్ ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది.

 గూగుల్ రహస్య ప్రాజెక్టులు
 

గూగుల్ రహస్య ప్రాజెక్టులు


 గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్ తయారీ పై దృష్టిసారించింది. ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనున్నాయి. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది.

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

గూగుల్ రహస్య ప్రాజెక్టులు

గూగుల్ లైవ్లీ, ఈ వెబ్ ఆధారిత వర్చువల్ కమ్యూనిటీ స్పేస్ ప్రాజెక్ట్‌లో భాగంగా యూజర్లు చాటింగ్‌లో భాగంగా తమ ఆన్‌లైన్ హ్యాంగవుట్ స్పేస్‌ను తమకు నచ్చినట్లు పర్సనలైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సెక్సెస్ అనంతరం గూగుల్ ఈ ప్రాజెక్టును 2008లో నిలిపివేసింది.

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

గూగుల్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తులలో 'గూగుల్ ఎర్త్' ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబ్‌లో మనకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని మౌస్‌తో జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశానికి సంబంధించి పరిసర ప్రాంతాలు, రోడ్లు, భవనాలు శాటిలైట్ చిత్రం రూపంలో మనకు కనిపిస్తాయి. ఉపగ్రహ 3డి కోణంతో భూమిపై ఉన్న ప్రకృతిని మెరుగైన చిత్రాలుగా వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా యూజర్స్ ఖచ్చితంగా మంచి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇందులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నేరుగా వాటిని సవరించే అవకాశం లేకుండా భౌగోళిక ప్రకృతి దృశ్యాలను వినియోగదారులకు ప్రదర్శిస్తుంది.

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

 ‘ప్రాజెక్ట్ ఎరా' పేరుతో గూగుల్సరికొత్త స్మార్ట్‌ఫోన్ వ్యవస్థను వృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థలో భాగంగా యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లను తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ వర్షన్‌లో వీటిని గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది.

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

 రోగాలను కనిపెట్లే ఓ మాత్రను తాము అభివృద్థి చేస్తున్నట్లు గూగుల్ ఇటీవల వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపాన్ని అద్దుకున్నట్లయితే ప్రమాదకర వ్యాధులను ముందుగానే పసిగట్టవచ్చు.

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

ఫ్లైయింగ్ విండ్ టర్బైన్స్, ఈ ప్రాజెక్టును గూగుల్ 2013లోనే సొంతం చేసుకుంది. ఎయిర్‌బోర్న్ టర్బైన్‌ల ఆధారంగా తక్కువ ఖర్చులో శక్తిని సృష్టించటమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

గూగుల్+ పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను గూగుల్ 2011లో ఆవిష్కరించింది. ఈ సామాజిక సంబంధాల వేదికకు ప్రస్తుతం 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

గూగుల్  ప్రాజెక్టులు

గూగుల్ ప్రాజెక్టులు

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ మిలియన్ల కొద్ది పుస్తకాలను డిజిటలైజ్ చేయనుంది. 2004లోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

Best Mobiles in India

English summary
Gmail Now Offers Option To Block Specific Email Addresses. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X