లక్షలాది గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ఇమెయిల్ వినియోగదారులు షాక్ కు గురయ్యే వార్త ఇది. లక్షలాది గూగుల్, యాహూ మెయిల్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా హ్యాక్ అయిన అకౌంట్లను 1 డాలర్ చొప్పున అమ్ముతున్నారట. అదీ ఎక్కడ.. ఎవరు చేస్తున్నారో తెలుసా..రష్యాలోని ఓ యువకుడి ఈ పనిచేస్తున్నాడని సెక్యూరిటీ నిపుణులు వెల్లడిస్తున్నారు. విస్తుగొలిపే కథనం.

Read more: అమేజింగ్ ఇండియన్ ఫోటోలు: గత కాలానికి తీసుకెళ్లాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

హ్యాక్‌నకు గురయిన లక్షల కొద్ది మెయిల్ నెటిజన్ల ఇమెయిల్ యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్ ను రష్యాలోని అండర్ వరల్డ్ క్రిమినల్ గ్యాంగ్ ఒక హ్యాకర్ నుండి సంపాదించి విక్రయానికి పెట్టిందని అలెక్స్ హోల్డెన్ అనే సెక్యూరిటి నిపుణుడు ఒకరు వెల్లడించారు.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

హ్యాక్ చేసిన వందల మిలియన్ల యూజర్ పేర్లు, పాస్ వర్డులు, ఈ-మెయిల్ అకౌంట్లు, వెబ్ సైట్లు రష్యా క్రిమినల్ వరల్డ్ లో వాణిజ్యం జరుగుతున్నాయట. 272.3 మిలియన్ అకౌంట్లు(2723 లక్షల అకౌంట్లు) చోరీ అయ్యాయట.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

వీటిలో 570 లక్షల అకౌంట్లు మెయిల్.రూ కు సంబంధించినవి ఉంటే, 400 లక్షల యాహు అకౌంట్లు, 330 లక్షల హాట్ మెయిల్ అకౌంట్లు, 240 లక్షల జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయని హోల్డ్ సెక్యురిటీ చెప్పింది.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

మొత్తం 272.3 మిలియన్ల ఖాతాలు దొంగతనానికి గురయ్యాయని వాటిలో అత్యధికం రష్యాకు చెందిన వారివేనన్నారు. దీనితో పాటు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ ఇమెయిల్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా హ్యాక్ అయ్యాయని అలెక్స్ హోల్డెన్ చెప్పారు.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

mail.ru అనేది రష్యాదేశపు మెయిల్ సర్వీస్ ప్రొవైడర్. దీనికి అక్కడ బాగా పేరుంది. ఇప్పుడీ mail.ru ఈమెయిల్ ఖాతాదారుల అకౌంట్లు హ్యాక్ కావడంతో ఆ సంస్థ తలనొప్పులు ఎదుర్కుంటోంది.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

 హోల్డెన్ హోల్డ్ సెక్యూరిటి అనే ఆన్ లైన్ సెక్యూరిటీ సంస్థను స్థాపించి దానికి ప్రధాన సమాచార భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా హోల్డ్ సెక్యూరిటీ సంస్థ పలు ఇంటర్నెట్ నేరాలను వెలుగులోకి తెచ్చింది.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

నిగూఢంగా భధ్రపరిచిన సమాచారాన్ని దొంగలించబడటంలో ఇదే అతి పెద్దదని, రెండేళ్ల క్రితం అమెరికాలో బ్యాంకుల, రిటైలర్లపై సైబర్ అటాక్ ఇలానే జరిగాయని ఆయన వెల్లడించారు. 

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

ఈ హ్యాకింగ్ డేటాసెట్ లో వేల సంఖ్యలో అమెరికా బ్యాంకింగ్, తయారీ, రిటైల్ కంపెనీల ఉద్యోగులకు సంబంధించిన యూజర్ పేరు, పాస్ వర్డులు ఉన్నాయని హోల్డ్ వెల్లడించింది.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

రష్యాకు చెందిన యువ హ్యాకర్ ఈ హ్యాకింగ్ లో కీలక పాత్రధారిగా భావిస్తున్నారు. ఇతగాడు తాజాగా ఒక ఆన్ లైన్ ఫోరంలో తన హ్యాకింగ్ గురించి ఘనంగా గొప్పలు చెప్పుకున్నాడు. 

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

ఇతగాడు కేవలం ఒకే ఒక్క డాలర్ కు దొంగలించబడిన అకౌంట్లను అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ పేర్కొంది.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

లక్షలాది ఇమెయిల్ ఖాతాలను తాను హ్యాక్ చేసానని.. వాటిని కావాలంటే ఎవరైనా తనను సంప్రదించవచ్చని ప్రకటించాడు.

2723 లక్షల గూగుల్,యాహూ అకౌంట్లు హ్యాక్..ఇంకా షాక్ ఏంటంటే

ఆ తరువాత ఆ వ్యవహారం రష్యా సైబర్ క్రైమ్ గ్యాంగులకు తెలిసింది. వారు అతగాడి నుండి ఆ సమాచారాన్ని సేకరించినట్లు అనుమానిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Gmail Yahoo data among hundreds of millions of hacked accounts on sale for 1
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot