గతి తప్పిన గొప్ప ఆవిష్కరణలు

Written By:

సమాజ శ్రేయస్సు కోసం శాస్ర్తవేత్తలు కనుగొన్న గొప్ప ఆవిష్కరణలు గతి తప్పాయి. సమాజానికి మేలు చేయడం కోసం వారు అహర్నిశలు కష్టపడి కనుగొన్న ఆ గొప్ప ఆవిష్కరణలు మానవాళి వినాశానానికి వాడుతున్నారు. వేలమందిని కాపాడాల్సిన ఆ ఆలోచనలు ఇప్పుడు లక్షలమందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. సరికొత్త ప్రపంచాన్ని కనుగొనాలనే తాపత్రయంలో వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు మానవాళికే పెనుముప్పుగా మారింది.

Read more : డిగ్రీలేదు.. కాని ప్రపంచాన్ని ఏలారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. జైక్లోన్ బి (Zyklon B)

ఫిట్జ్ హబర్ దీన్ని కనుగొన్నారు. ఇతను తన ప్రయోగాలతో నోబెల్ బహుమతిని సైతం అందుకున్నారు. కాని అతను కనుగొన్న ప్రయోగం మానవాళి వినాశానికి దారి తీస్తుందని ఊహించలేకపోయాడు. ఫలితంగా మొదటి ప్రపంచ యుద్ధంలో దీన్ని జర్మనీ తన ఆయుధాల్లో వాడింది. దాదాపు 1.2 మిలియన్ల ప్రజలను బలిగొంది. అయితే దీన్ని గ్యాస్ రూంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి ఆపడానికి తయారు చేయాలని ఆవిష్కర్త భావిస్తే అది మానవాళికే పెనుముప్పుగా మారింది.

3డి ప్రింటింగ్ (3-D Printing)

రెండవ తరం పారిశ్రామిక విప్లవంగా దీన్ని అభివర్ణిస్తారు. ఇది సైన్స్ రంగంలో సర్జరీల కోసం రూపొందిస్తే అది కాస్తా రంగు మార్చుకుని 3డి ప్రింటెడ్ గన్ గా మారిపోయింది. 3డి ప్రింటిగ్ ను ఇప్పుడు ఆయుధాల కోసం, గన్ ల కోసం వాడుతున్నారు. కాని దాన్ని బయటకు ఎందుకు తెచ్చారో అది మాత్రం మరుగునపడిపోయింది.

డైనమిట్ (Dynamite)

ఆల్ఫోర్డ్ నోబుల్ దీనికి అంకురార్పణ చేశారు. దీన్ని కనుగొన్నది గనుల్లో అలాగే బిల్డింగుల్లో అలాగే వేటినైనా పేల్చడానికి ..కాని ఇది ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. టెర్రిరిస్టుల చేతికి పాశపతాస్త్రం అయింది. వారు తమ ఆయుధాల్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. 1920లో యునైటైడ్ స్టేట్స్ లోని వాల్ స్ట్రీట్ పేలిన బాంబుతో ఇది చాలా ప్రమాదకరంగా తయారయింది.దాదాపు ఆ పేళుల్లలో 38 మంది చనిపోగా 143 మంది గాయపడ్డారు. అలాగే 1924లో కాలిఫోర్నియా బ్రిడ్జిని కూల్చడానికి ఉపయోగించారు.

టార్ (Tor)

ఇదొక ఆనియన్ రూటర్. 2002లో దీన్ని డెవలప్ చేశారు. ఇంటర్నెట్ యూజర్స్ కోసం దీన్ని రూపొందించారు. అంటే యూజర్ల ఇంటర్నెట్ ను కంట్రోల్ చేసుకునే దానికి దీన్ని రూపొందిస్తే ఇది ఏకంగా ఎఫ్ బిఐ ను షట్ డౌన్ చేసింది. అక్టోబర్ 1న జరిగిన ఈ పరిణామానికి అన్ని బిజినెస్ సైట్లు అల్లాడిపోయాయి. చిన్నపిల్ల పోర్న్ మూవీస్ మాత్రమే ఒపెన్ అయ్యే విధంగా దాన్ని సెట్ చేశారు.

ట్యాబ్ లేటింగ్ మిషన్ (Tabulating Machine)

ఇది పంచ్ కార్డస్ కోసం అలాగే ఏదైనా డాటాను స్టోర్ చేసుకోవడానికి కనుగొన్నారు. అయితే రాను రాను ఇది కూడా దారి తప్పింది. కులాలను గుర్తించడానికి జర్మనీలో దీన్ని వాడారు. యూదులు రోమన్లు,అలాగే ఇతర కులాల వారి జనన గణనకు దీన్ని తీసుకున్నారు.ఇదొక విషాదకర వార్త

పోస్ జెన్ (Phosgene)

ఇదొక విషవాయువు. దీని సంక్షిప్త రూపం COCl2. 19వ శతాబ్దంలో పరిశ్రమల్లో వాడేందుకు దీన్ని కనుగొన్నారు. అయితే ఇది మొదటి ప్రపంచయుద్ధంలో గ్యాస్ ఆయుధంగా మారి వేలాది మందిని పొట్టన పెట్టుకుంది.

గూగుల్ ఎర్త్ ( Google Earth)

ఇప్పుడు గూగుల్ మ్యాప్ లేకుండా అడ్రస్ ను వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా అడ్రస్ కావాలంటే ఎవరైనా ముందుగా చూసేది గూగుల్ మ్యాప్ వైపే. అయితే ఇది కూడా ఇప్పుడు టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. ముంబైలో 2008 దాడులకు ఈ గూగుల్ మ్యాప్ నే వాడారని సమాచారం. ఎక్కడ ఏయే ప్రదేశాలు ఉన్నాయో చూసుకుని వాటిపై దాడికి పూనుకొనేందుకు ఈ గూగుల్ మ్యాప్ ఇప్పుడు టెర్రరిస్టులకు ఆయుధంగా మారింది.

రిమోట్ యాక్స్ టూల్స్ (Remote Access Tools)

సిస్టంలో ఉన్న సమస్యలనుంచి బటయపడేందుకు దీన్ని ఆవిష్కరించారు. కాని ఇది ఇప్పుడు వేరే విధంగా వినాశానానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హ్యాకింగ్ చేయడానికి ఈ రిమోట్ బాగా పనికొస్తోంది.

బయోటెక్నాలజీ (Biotechnology)

2001లో ఆంత్రాక్స్ అటాక్ నుండి తప్పించుకోవడానికి ఈ బయోటెక్నాలజీని వాడితే అది రాను రాను అనేక వినాశన ప్రయోగాలకు వేదికగా నిలిచింది. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మానవాళి వినాశనానికి కారణమవుతున్నారు.

రోబోట్స్ (Robots)

ఈ రోబోట్స్ ను శాస్త్రవేత్తలు మనుషులకు సేవలు చేయడానికి కనుగొంటే అవి ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేవిధంగా తయారయ్యాయి. పరిశ్రమల్లో బిల్డింగ్ నిర్మాణాల్లో వీటిని వాడేందుకు రూపొందించారు. కాని కాలక్రమంలో అది డ్రోన్లగా రూపాంతరం చెంది మనుషులను చంపేస్తున్నాయి. అమెరికా మిలిటరీ ఇప్పటికే నేలమీద అలాగే సముద్రంలో శత్రువులను ధ్వంసం చేయగల ఆయుధాలను తయారు చేస్తోంది. వాటిపేరే బాన్.

ఏజెంట్ ఆరెంజ్(Agent Orange)

ఆర్ధర్ గాల్ స్టోన్ దీన్ని కనుగొన్నారు. దీన్ని అసలు ఎందుకు కనుగొన్నారంటే సోయాబీన్ అత్యంత తక్కువ కాలంలో వేగంగా పెరగాడానికి. కాని ఇది రాను రాను మారణ హోమానికి కారణమయింది. ఇది పేరు మార్చుకుని ఆరెంజ్ స్ట్రిప్ డ్ బ్యారెల్స్ గా మారి వియాత్నం వార్ లో 4లక్షల మందిని పొట్టన బెట్టకుంది. అలాగే 5 లక్షల మంది పుట్టుకతోనే అనేక వ్యాధులకు గురయ్యారు.

గాట్లింగ్ గన్ (Gatling Gun)

రిచర్డ్ జోర్డాన్ దీన్ని కనుగొన్నారు. ఈ గన్ ధాటికి అమెరికా సివిల్ వార్ లో 1877 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీని ప్రధాన ఉద్దేశం మాత్రం మంటలు రావడానికే మాత్రమే దీన్ని తయారు చేశారు. అయితే ఇప్పుడు మంటలతో పాటు బుల్లెట్లు దూసుకువచ్చి మనిషి ప్రాణాలను తీస్తోంది.

టీఎన్ టీ ( TNT)

జోసఫ్ విల్ బ్రాండ్ దీన్ని 1863లో ఓ ఫార్ములా కోసం కనుగొన్నారు. అయితే అది 1902కు వచ్చేసరికి మిలిటరీ చేతిలో పడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అలాగే రెండవ ప్రపంచయుద్ధంలో దీన్ని అమితంగా వాడారు. ఫలితం వేలమంది మరణం.

లీడెడ్ పెట్రోల్ (Leaded Petrol)

రిఫ్రిజెంట్ కు రీ ప్లేస్ గా సీఎఫ్ సీ ని కనుగింటే అది రాను రాను అమ్మోనియంగా మారి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఇప్పుడు మనుషులను చంపడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.

సెరైన్ గ్యాస్ (Sarin Gas)

ఆకలి మీద పోరాటం చేయడానికి సరికొత్త ఆహారం డెవలప్ చేయడం కోసం దీన్ని కనుగొన్నారు. అయితే ఇది రాను రాను భయంకరమైన విషవాయువుగా మారింది.

న్యూక్లియర్ ప్యూషన్ (Nuclear Fusion)

ఇది ఇప్పుడు అణుబాంబుల తయారీకి బాగా ఉపయోగపడుతోంది. దీన్ని కనుగొన్నది సర్ మార్కస్. ఇది ప్రయోగాల్లో రియాక్షన్ కోసం హెవీ హైడ్రోజన్ గా అభివృద్ధి చేశారు. అయితే ఇది రాను రాను హైడ్రోజెన్ బాంబుగా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Good Tech inventions Turned Bad
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot