గూగుల్ కూడా డిగ్రీ కోర్సు పెట్టేసింది

Written By:

ఈ పదం తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్లో వెతికితే దొరకందంటూ ఉండదు. మరి అలాంటి గూగుల్ ఇప్పుడు భారత్‌లో ఆన్‌లైన్ ఐటీ డిగ్రీ కోర్సులను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాప్స్ తయారుచేసేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను రెడీ చేస్తోంది గూగుల్. ఇందుకోసం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ఉడాసిటీతో చేతులు కలిపింది. ఈ గూగుల్ ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కోర్సు కోసం నెలకు దాదాపు పదివేల రూపాయలు చెల్లించాలి. అమెరికాలోని టీచర్లు పాఠాలు బోధిస్తారు. అలాగే గూగుల్, టాటాట్రస్ట్ కలిపి ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కోర్సు చేసే విద్యార్థుల్లో కనీసం వెయ్యి మందికి ఉపకార వేతనాలు కూడా ఇస్తుందట! వచ్చే సంవత్సరం గూగుల్ భారత్‌లో నిర్వహించే ఉద్యోగమేళాలో ఈ పట్టా పొందిన వారికి కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది! గూగుల్ ప్లానేంటో ఓ సారి చూద్దాం.

Read more: 18 సంవత్సరాల గూగుల్ చరిత్ర ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ డిగ్రీ

గూగుల్ డిగ్రీ

అంతర్జాతీయ దేశీయ యాప్ ల రూపకల్పన చేసే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలపర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ డిగ్రీలు అందిస్తున్నామని గూగుల్ చెబుతోంది.

భారత్ లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్ వేర్ ప్రొపెషనల్స్

భారత్ లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్ వేర్ ప్రొపెషనల్స్

భారత్ లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్ వేర్ ప్రొపెషనల్స్ ఉన్నారని,2018 కల్లా ఈ విషయంలో భారత్ అమెరికాను అధిగమిస్తుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్ చెబుతున్నారు. అప్పటికల్లా భారత్ లో సాఫ్ట్ వేర్ నిపుణులు సంఖ్య 40 లక్షలకు పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమే

భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమే

అయితే టాప్ 1000 ఆండ్రాయిడ్ యాప్ లలో భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమేనట.

ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు

ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు

అయితే ఈ కోర్సు ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు. ఏ డివైస్ తో నైనా కొత్త నైపుణ్యాలను కొన్ని నెలల్లోనే నేర్చుకుని తమ కెరీర్ లో ముందుకు వెళ్లవచ్చని యుడాసీటీ వ్యవస్థాపకుడు ,సీఈఓ సెబాస్టియన్ తరుణ్ చెబుతున్నారు.

కాలపరిమితి 6-9 నెలలు

కాలపరిమితి 6-9 నెలలు

ఇక ఈ కోర్సు కాలపరిమితి 6-9 నెలలు నెలకు రూ. 9800 ఖర్చు అవుతుందని తెలిపారు. కోర్సు పూర్తయిన తరువాత ట్యూషన్ ఫీజులో 50 శాతం రిఫండ్ చేస్తామని వివరించారు.

500 ఉచిత స్కాలర్ షిప్ లు

500 ఉచిత స్కాలర్ షిప్ లు

ఈ కోర్సుకు గూగుల్ టాటా ట్రస్ట్ సంస్థలు చెరో 500 ఉచిత స్కాలర్ షిప్ లు ఆఫర్ చేస్తున్నాయి.

నిపుణుల సంఖ్య స్వల్పం

నిపుణుల సంఖ్య స్వల్పం

సాఫ్ట్ వేర్ నిపుణులు అధికసంఖ్యలో ఉన్నా యాప్స్ రూపొందించే నైపుణ్యం ఉన్న నిపుణుల సంఖ్య స్వల్పంగా ఉందని ఈ లోటును భర్తీ చేయడానికి ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను ఆఫర్ చేస్తోందని వారు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google aims to make India a hub for app development
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting