ఇండియాలో గూగుల్ టార్గెట్ 100 కోట్లు

Written By:

ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను వంద కోట్లకు చేర్చాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. విషయాన్ని గూగుల్ ఆగ్నేయ ఆసియా, భారత్‌ల వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ముంబైలో వెల్లడించారు. అయితే ఎప్పటిలోపు దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు 35 కోట్లు ఉన్నారనీ ప్రకటించారు. 2020 నాటికి 60 కోట్లకు చేరవచ్చనే అంచనాలున్నాయని ఆనందన్ పేర్కొన్నారు.

గూగుల్ గురించి 30 ఆసక్తికర నిజాలు

ఇండియాలో గూగుల్ టార్గెట్ 100 కోట్లు

ఇంటర్‌నెట్‌ను ప్రజలకు మరింత చవకగా, అందరికీ అందుబాటులోకి తెస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని ఆయన వివరించారు. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ఇప్పటికే గూగుల్ దేశంలోని 27 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నామని ఆనందన్ తెలిపారు. ఉచిత వై-ఫై కింద రోజుకు 2 లక్షల మంది ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారని, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు మరిన్ని ప్రాంతీయ భాషాల్లో సేవలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఇంకో 4జీఫోన్.. వరుస 4జీ ఫోన్లతో దడ పుట్టిస్తున్న రిలయన్స్

గూగుల్‌కు సంబంధించి కొన్ని షాకింగ్ నిజాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

గూగుల్ వ్యవస్థాపకులు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

అడ్వర్టైజింగ్ విభాగంలో ఏటా గూగుల్ అర్జిస్తున్న ఆదాయం 20 బిలియన్ డాలర్లు. ఇది ఇంకా పెరిగి ఉంటుంది.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

గూగుల్‌లో నిమిషానికి 2 మిలియన్ల సెర్చ్‌లు జరుగుతున్నాయి.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

గూగుల్‌కు సంబంధించి 20 ఆసక్తికర వాస్తవాలు

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google aims to get 1 billion Indians online
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot