ఆకాశంలో గూగుల్ హై స్పీడ్ ఇంటర్నెట్

Written By:

గూగుల్ ..ప్రపంచంలోనే అత్యంత పాపులర్ సెర్చ్ ఇంజిన్..ఇప్పుడు 2020 దిశగా అడుగులు వేసేందుకు బాగానే కసరత్తు చేస్తోంది. ఇండియాలోని మారుమూల పల్లెల్లోకి సైతం ఇంటర్నెట్ స్పీడును పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇండియాలో ఉన్న 2ఎంబిపిఎస్ స్పీడును ఏకంగా 10 ఎంబిపిఎస్ కే పెంచేందుకు ఆకాశంలో భారీ టవర్లు నిర్మిస్తోంది. భూమికి దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం జరిపేలా గూగుల్ ఇప్పటినుంచే కసరత్తుల మీద కసరత్తులు చేస్తోంది.

Read more: ప్రపంచాన్నే మాయ చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ స్పీడును ఇక బెలూన్ల ద్వారా విస్తరించేందుకు ..

గూగుల్... ఇంటర్నెట్ స్పీడును ఇక బెలూన్ల ద్వారా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది.

సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాల్లో..

సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా ఇంటర్నెట్ అతి వేగంగా వస్తుంటే ఇండియాలో మాత్రం సరైన వసతుల్లేక, పాలకులకు ముందుచూపు లేక నత్తనడకన సాగుతోంది. ఒక్క ప్రధానమంత్రి కార్యాలయంలో తప్పించి ఇండియాలో ఎక్కువశాతం 2 ఎంబిపిఎస్ స్పీడ్ వరకే అందుబాటులో ఉంటోంది.

ఈ నేపథ్యంలో 10 ఎంబిపిఎస్ కంటే ఎక్కువ ..

టెలికాం రంగం కుంభకోణాలమయంగా మారడంతో ఇండియాలో బ్రాడ్ బాండ్ విస్తరణ నత్తనడకగా మారింది. ఈ నేపథ్యంలో 10 ఎంబిపిఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న నెట్ ను వాడుతున్న వినియోగదారులు.. కేవలం 1.2 శాతం మాత్రమే ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి.

ఇంటర్నెట్ స్పీడులో ఇండియా 52వ స్థానంలో..

దీంతో ఇంటర్నెట్ స్పీడులో ఇండియా 52వ స్థానంలో ఉంది. కాగా అమెరికాలో గూగుల్ ఫైబర్ సెకనుకు 1జిబి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. అలాగే మిన్నెసోటా రాష్ట్రంలో అత్యధికంగా 10 జీబీపీఎస్ డౌన్ లోడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటం విశేషం.

ఇండోనేషియాలో రెండేళ్ళ 'ప్రాజెక్ట్ లూన్' ను ..

ప్రస్తుతం గూగుల్ ఇండోనేషియాలో రెండేళ్ళ 'ప్రాజెక్ట్ లూన్' ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేస్తోంది.

ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో..

ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మొత్తం ఇండోనేషియాలో సుమారు 250 మిలియన్ల ప్రజలు ఉంటే వారిలో కేవలం 42 మిలియన్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉన్నట్లు సీఐఏ లెక్కలు చెప్తున్నాయి.

ప్రాజెక్ట్ లూన్ ఇప్పటికే ఈ టెక్నాలజీని..

ప్రాజెక్ట్ లూన్ ఇప్పటికే ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది. అయితే సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.

గృహాలకు, వ్యాపారాలకు బెలూన్లపరిధిలోని నెట్ స్పీడును..

గృహాలకు, వ్యాపారాలకు బెలూన్లపరిధిలోని నెట్ స్పీడును అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నూతన విధానంలో యూజర్లకు ఇంటర్నెట్ ను వైర్ లెస్ ప్రొవైడర్ల ద్వారా అందిచనుంది. ఇండోనేషియాలో మొబైల్ ఫోన్లు వాడేవారు ఇప్పటికే సుమారు 319 మిలియన్లకు మించి పోయారు.

ఇంటర్నెట్ డేటా ప్లాన్ ల ఖరీదును భరించే స్థోమతలేక..

అయితే వీరిలో చాలామంది వినియోగదారులు ఇంటర్నెట్ డేటా ప్లాన్ ల ఖరీదును భరించే స్థోమతలేక, మారుమూల ప్రాంతాల్లో నివసించడం వల్ల, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాక.. ఇలా పలు కారణాలతో నెట్ లేకుండానే గడిపేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుకు డిజిటల్ ప్రకటనలద్వారా డబ్బును సేకరించి ..

అయితే గూగుల్... ముందుగా ఈ ప్రాజెక్టుకు డిజిటల్ ప్రకటనలద్వారా డబ్బును సేకరించి ఆ డబ్బుతో నిధులను సమకూర్చుకుంటుంది. న్యూజిల్యాండ్ లో పరీక్షల అనంతరం.. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, బ్రెజిల్ లోని మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. అనుకున్న ప్రకారం జరిగితే 'ప్రాజెక్ట్ లూన్' ఆకాశంలో సెల్ టవర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google announces expansion of plans to deliver Internet by balloons
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot