కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

Written By:

కంప్యూటర్లకు కాలం చెల్లింది. భవిష్యత్ లో కంప్యూటర్ అనే మాటే వినపడదు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ కంప్యూటర్లను చంపేస్తాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఇప్పుడు అంతా ప్రజలు కొత్త దనాన్ని కోరుకుంటున్నారని కొత్త కొత్త టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారని రానున్న కాలమంతా దానిమీద నడుస్తుందని గూగుల్ సీఈఓ చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లో విందాం.

Read more: గూగుల్ డాట్ కాం చాలా డేంజర్ : షాకిచ్చిన గూగుల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

మనం వాడుతున్న కంప్యూటర్ల అయుష్షు తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందట. కంప్యూటర్ ను భౌతికంగా కాకుండా .. మరో రూపంలో ఉంటుందన్న భావనను వ్యక్తం చేశారు. రోజువారీ కార్యకలపాల్లోసాయం చేసే కంప్యూటర్ కంటికి కనిపించకుండా ఉండే వీలుందని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేశారు సుందర్ పిచాయ్.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

స్మార్ట్ ఫోన్ .. టచ్ స్క్రీన్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఉత్పత్తులు పెరుగుతాయని .. అవేవీ కంటికి కనిపించవని చెప్పుకొచ్చారు. మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

భవిష్యత్తులో భౌతిక కంప్యూటర్లకు స్థానం ఉండదని డివైస్ అనే భావనకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ భౌతికంగా కాకుండా ఏ రూపంలో ఉన్నప్పటికీ, మన రోజువారీ కార్యకలాపాల్లో ఇంటెలిజెంట్ అసిస్టెంట్ గా సహాయపడుతుందని వివరించారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

మొబైల్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచంలోకి మారతామని వివరించారు. కొద్ది సంవత్సరాల క్రితం ఊహించని విధంగా ఇప్పుడు సర్వం స్మార్ట్‌ఫోనే అయ్యిందని పేర్కొన్నారు. రోజు వారీ జీవితానికి స్మార్ట్‌ఫోన్ రిమోట్ కంట్రోల్లా పనిచేస్తోందన్నారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

విద్యకు, వినోదానికి, కమ్యూనికేషన్కు, వినియోగానికి ... అన్నింటికీ ప్రజలు స్మార్ట్‌ఫోన్నే ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. వాయిస్‌తో సమాచారాన్ని సెర్చ్ చేయడం పెరుగుతుందని వివరించారు. అయితే ఇక ముందు డివైస్ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆక్రమిస్తుందని అన్నారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

త్వరలో గూగుల్ ఫొటోస్ ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నామని పిచాయ్ తెలిపారు. తమ ఫొటోలను, వీడియోలను సులభంగా నిర్వహించుకునేలా, వాటిని సురక్షితంగా ఉంచుకునేలా, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాటిని చూసుకునేలా ఈ గూగుల్ ఫొటోస్ ఫీచర్ ను అందిస్తామన్నారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

ఇదంతా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సాధ్యమని పేర్కొన్నారు. గూగుల్ ప్లేను ఉపయోగించుకుంటున్న ఆండ్రాయిడ్ యూజర్ల సంఖ్య వంద కోట్లను దాటిందని తెలిపారు.

కంప్యూటర్లకు కాలం చెల్లింది..స్మార్ట్‌ఫోన్ల తరువాతేంటో చెప్పిన గూగుల్ సీఈఓ

గూగుల్ ప్రగతి, భవిష్యత్ ప్రాధాన్యతల గురించి సాధారణంగా ప్రతి ఏడాది ఆ కంపెనీ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ వెల్లడిస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుతం గూగుల్ సీఈఓగా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి పిచాయ్ బ్రేక్ చేశారు. గూగుల్ సాధించిన ఘనతలు, తదితర అంశాల గురించిన ఒక లేఖను గూగుల్ అధికారిక బ్లాగ్లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google CEO Pichai Sees the End of Computers as Physical Devices
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot