ట్రంప్ దెబ్బ, చిక్కుల్లో గూగుల్ ఉద్యోగులు

Written By:

ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ దెబ్బకు ఇప్పుడు అన్ని కంపెనీలు ఆత్మర్క్షణలో పడ్డాయి. దిగ్గజ సీఈఓలందరూ ట్రంప్ పై విరుచుకుపడుతున్నారు. మొన్నటిదాకా ఫేస్‌బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ట్రంప్ మీద విరుచుకుపడితే ఇప్పుడు గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్రంప్ మీద ఘాటౌన విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ ఆదేశాలు తమ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయని తెలుపుతూ కంపెనీ స్టాఫ్‌కు ఓ ఈ-మెయిల్ రాశారు. దానిలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌ను విమర్శించారు.

ఎయిర్‌టెల్‌కు భారీ జరిమానా విధించండి: జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

187 మంది గూగుల్ ఉద్యోగులపై

ఈ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ దెబ్బ మొత్తం 187 మంది గూగుల్ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని పిచాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌తో చూపే ప్రభావంపై తాము చింతిస్తున్నామని, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌తో తమ సహచరులకు తలెత్తే వ్యక్తిగత వ్యయాలు చాలా బాధకరమన్నారు.

ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల

విదేశాలకు ట్రావెల్ చేసే గూగుల్ ఉద్యోగులు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చేలోపల అమెరికాకు వచ్చేయాలని పిచాయ్ ఆదేశించారు. గూగుల్ సెక్యురిటీ, ట్రావెల్, ఇమ్మిగ్రేషన్‌పై కంపెనీ సాయం చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

వాలిడ్ వీసా ఉన్నప్పటికీ

కంపెనీల్లో పనిచేసే వారు, కేటాయించిన పనులపై విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ వారిదగ్గర వాలిడ్ వీసా ఉన్నప్పటికీ వారు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని కంపెనీ ఉద్యోగులకు హెచ్చరిస్తోంది.

ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు

శుక్రవారం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ముస్లిం మెజారిటీ ఏడు దేశాలు ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమెన్‌లకు చెందిన పౌరులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించారు.

90 రోజుల వరకు వీసాల జారీ

ఈ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. ఈ ఏడు దేశాలకు చెందిన వారిదగ్గర గ్రీన్ కార్డు ఉన్నా వారిని అమెరికాలోకి రానిస్తారో లేదో అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Criticizes Impact on Staff of Trump Immigration Order read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot