ఎయిర్‌టెల్‌కు భారీ జరిమానా విధించండి: జియో
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా భారతీ ఎయిర్‌టెల్ ప్రకటనలు ఇస్తోందని రిలయన్స్‌జియో టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది.
ఉచిత ఆఫర్లతో టెలికం రంగంలో దూసుకుపోతున్న జియో ఎయిర్‌టెల్‌పై మండిపడింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా భారతీ ఎయిర్‌టెల్ ప్రకటనలు ఇస్తోందని రిలయన్స్‌జియో టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది.
సైబర్ మోసాల్లో ఒక్కో యూజర్ ఎంత నష్టపోయాడంటే..?

తాము ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా అందిస్తున్న డేటా విషయంలో ఎయిర్‌టెల్ అతిగా ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేసింది. అది ఇస్తున్న యాడ్లు ఆరోగ్యకరంగా లేవని పేర్కొంది. తప్పుడు ప్రకటనలు చేస్తున్న ఎయిర్‌టెల్‌పై భారీగా జరిమానా విధించాలని కోరింది.

ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘించిన ఎయిర్‌టెల్ ఫ్రీ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, వినియోగదారులు ఫోన్ చేస్తేనే వివరణ ఇస్తోందని, ఇది ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది.


Click it and Unblock the Notifications








