శ్వేత విప్లవ పితామహునికి గూగుల్ ఘన నివాళి

Written By:

ఎప్పటికప్పుడు కొత్తదనంతో మురిపిస్తోంది గూగుల్ డూడుల్. ఆ డే స్పెషల్ తో పాటు మహనీయుల స్మృతులను ప్రపంచానికి అందిస్తోంది. దానిలో భాగంగా శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్‌ కురియన్‌కు గూగుల్‌ ఘన నివాళులర్పించింది. నేడు ఆయన 94వ జయంతి సందర్భంగా గూగుల్‌ తన ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.

Read more: వైఫైని వణికిస్తున్న లైఫై

శ్వేత విప్లవ పితామహునికి గూగుల్ ఘన నివాళి

డిస్‌ప్లే గోవు, పాల క్యాన్లతో కురియన్‌ ఉండడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 'అమూల్‌' సంస్థను స్థాపించిన ఆ పితామహుడి గురించి కొన్ని విశేషాలు. కేరళలోని కాలికట్‌లో నవంబర్‌ 26, 1921లో సంపన్న విద్యావంతులైన సిరియన్‌ క్రిస్టియన్ల ఇంట కురియన్‌ జన్మించాడు. ఇంజనీరింగ్‌ (మెటలర్జీ) చదివి టాటా స్టీల్‌ ప్లాంటులో అప్రెంటీస్‌గా చేరి.. తర్వాత ప్రభుత్వ సహకారంతో డైరీ ఇంజనీరింగ్‌లో స్కాలర్‌షిప్‌ పొంది అమెరికా వెళ్లారు.

Read more: గ్రహాంతరవాసుల గుట్టు చైనా చేతిలో

శ్వేత విప్లవ పితామహునికి గూగుల్ ఘన నివాళి

అనంతరం భారత్‌కు తిరిగొచ్చాక ఆనంద్‌లో చిన్న ప్రభుత్వ డైరీలో ఉద్యోగిగా చేరారు. అప్పుడే కైరా జిల్లా పాల సహకార సంఘం, వారి నాయకుడు త్రిభువన్ దాస్ పటేల్‌ల పరిచయాలతో ఆయన జీవితం మలుపుతిరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ పాల ఉత్పత్తి రంగానికి పునాదులు పడ్డాయి. సామాజిక వ్యవస్థాపకుడైన కురియన్‌కు.. తన బిలియన్ లీటర్ ఆలోచన ప్రసిద్ధి వచ్చింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని స్థాపించారు.

Read more: లూసీ గురించి తెలుసా మీకు..?

శ్వేత విప్లవ పితామహునికి గూగుల్ ఘన నివాళి

1989 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వంటి పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ వంటి పురస్కారాలు అందుకున్నారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్‌ 9, 2012న నడియాడ్‌లో మృతిచెందారు.

English summary
Here Write Google Doodle pays tribute to Verghese Kurien
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot