లూసీ గురించి తెలుసా మీకు..?

Written By:

డూడుల్.. గూగుల్ కు ఇదొక అనుబంధ లోగో. ఆరోజుకు ఉన్న ప్రత్యేకతను ఒక ఫోటో ద్వారా విశ్వవ్యాప్తం చేయడానికి గూగుల్ దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే నవంబర్ 24వ తేదీ గూగుల్ సంస్థ సెర్చ్ ఇంజిన్ పై ప్రచురించిన డూడుల్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఆకట్టుంటుంది అనే బదులు ఆ ఫోటో వెనకాల ఉన్న కథా-కమామీషు ఏంటో తెలుసుకోవాలనే కుతూహాలాన్ని మాత్రం పుట్టిస్తుంది. ఫోటోలో కనిపిస్తున్న దాని పేరు లూసీ.

Read more: కళ్లుమూసి తెరిచేలోపు దాడి

లూసీ గురించి తెలుసా మీకు..?

అత్యంత పురాతనమైన శిలాజం. మనిషి జీవ పరిణామ క్రమం ఎలా మొదలైందనే దానికి అద్దం పడుతుంది ఈ లూసీ ఫోటో. మానవ పూర్వీకుల్లో నిట్టనిలువుగా నడిచే జీవులకు సంబంధించిన పూర్తిస్థాయి అస్థిపంజరం మొట్టమొదటిసారిగా 1974లో ఇథియోపియాలో వెలుగు చూసింది. దానిపేరే లూసీ. ఆస్ట్రాలోపిథెకస్‌ అఫారెనిసెస్‌ జాతికి చెందిన ఈ లూసీ జీవి శిలాజం ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఇథియోపియాలో కనుగొన్న లూసీ పళ్లు, చేతి, కాళ్ల ఎముకల ఆధారంగానే శాస్త్రవేత్తలు మానవ పరిణామక్రమంపై ఒక స్పష్టతకు వచ్చారు.

Read more: ఐ ఫోన్ ఇవ్వండి..లేదంటే నేను చచ్చిపోతా

లూసీ గురించి తెలుసా మీకు..?

ఈ శిలాజాలు 42 లక్షల ఏళ్ల నాటి ఆస్ట్రాలోపిథెకస్‌ అనామెనిసిస్‌ జాతివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలినాటి మానవ పూర్వీకులైన ఆర్దిపిథెకస్‌ రామిడస్‌.. ఆస్ట్రాలోపిథెకస్‌ జాతిగా రూపాంతరం చెందిన తీరును ఃలూసీః ఆవిష్కరించింది. అయితే లూసీ శిలాజం బయటపడి 41 ఏళ్లయిన సందర్భంగా సెర్చ్ ఇంజన్‌ గూగుల్‌ తన ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. డిస్‌ప్లే నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శాస్త్రవేత్త జాన్సన్ డోనాల్డ్ దీనిని 32 లక్షల సంవత్సరాల పూర్వందిగా గుర్తించాడు.

లూసీ గురించి తెలుసా మీకు..?

ప్రఖ్యాత మ్యూజిక్ అండ్ బీటిల్స్ ఆల్బమ్ రూపొందించిన లూసీ ఇన్ ది స్కై విత్ డైమండ్స్ ఆధారంగా ఈ పేరును పెట్టారు శాస్త్రవేత్తలు. ఇది తన జీవిత కాలంలో మనిషిని పోలిన నడకతో జీవించినట్టు శాస్త్రవేత్తలు చెప్తుంటారు.

Read more about:
English summary
Here Write Google Doodle celebrates early human ancestor
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting