హై‌స్పీడ్‌తో గూగుల్ ఉచిత ఇంటర్నెట్: 7 సెకన్లలో మూవీ డౌన్‌లోడ్

Written By:

ప్రముఖ సోషల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ హౌ స్పీడ్ తో కష్టమర్లకు ఉచిత ఇంటర్నెట్‌ను అందిచనుంది. గూగుల్ ఇంటర్నెట్ ఉచితంగా ఇవ్వడమేందని ఆశ్చర్యపోకండి. నిజంగానే గూగుల్ ఉచిత ఇంటర్నెట్ ని అందిస్తోంది. అయితే అది మనదేశంలో కాదు. అమెరికాలోని ఓ సిటీలో ఉచితంగా ఇంటర్నెట్ ని ఇస్తోంది. కనెక్ట్ హోమ్‌లో భాగంగా ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నట్లు గూగుల్ యాజమాన్యం తెలిపింది.

Read more: గూగుల్ నుంచి ఆదాయం పొందడమెలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికాలోని కన్సాస్ సిటీ పేదలకు ఉచిత హైస్పీడ్

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికాలోని కన్సాస్ సిటీ పేదలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించనుంది. 1 జీబీపీఎస్ (1000 ఎంబీపీఎస్) స్పీడ్ కలిగిన ఇంటర్నెట్‌ను ఆ సిటీలోని దాదాపు 1300 కుటుంబాలకు అందివ్వనుంది.

హెచ్‌డి సినిమాను కేవలం 7 సెకండ్లలోనే డౌన్లోడ్

దీని వల్ల వారు ఒక హెచ్‌డి సినిమాను కేవలం 7 సెకండ్లలోనే డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుంది. ప్రస్తుతం అమెరికాలో యూజర్లు వాడుతున్న ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 57 ఎంబీపీఎస్ వరకు ఉండగా, యావరేజ్‌గా ఒక్కో యూజర్‌కు ఇది 12 ఎంబీపీఎస్ వరకు వస్తోంది.

గూగుల్‌కు సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు

కాగా ఇప్పుడు గూగుల్ అందించనున్న ఈ గిగాబిట్ ఇంటర్నెట్ స్పీడ్ వీటి కన్నా ఎక్కువే కానుంది. ఈ ఉచిత ఇంటర్నెట్‌ను అందించేందుకు గూగుల్‌కు సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ .6 కోట్లకు పైగా) ఖర్చు కానుంది.

ఉచిత ఇంటర్నెట్ వల్ల ఆయా కుటుంబాల్లో

ఉచిత ఇంటర్నెట్ వల్ల ఆయా కుటుంబాల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరుగుతుందని సంబంధిత గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ఒబామా పేదలకు

గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ఒబామా పేదలకు, తక్కువ ఆదాయం ఉన్న వారికి ఉచిత ఇంటర్నెట్ను అందించేందుకు 'కనెక్ట్హోమ్' పేరిట ఓ పైలెట్ ప్రాజెక్టును ఆవిష్కరించగా, అందులో భాగంగానే తాము ఇప్పుడు ఉచిత ఇంటర్నెట్ను అందిస్తున్నామని వారు తెలియజేస్తున్నారు.

2.75 లక్షల మంది ఉచిత ఇంటర్నెట్‌ను

ఈ ప్రాజెక్టులో భాగంగా 2.75 లక్షల మంది ఉచిత ఇంటర్నెట్‌ను అందుకోనుండగా అందులో కన్సాస్ సిటీ ముందుగా ఈ అవకాశాన్ని దక్కించుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Fiber’s plan to give free Internet to the poor
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot