గూగుల్ నుంచి సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లు: మరో విప్లవానికేనా..

Written By:

ఇప్పటిదాకా మీరు సెల్ఫీ డ్రైవింగ్ కార్లను చూసి ఉంటారు.. కారులో మనం కూర్చుంటే చాలు డ్రైవర్ లేకుండా దానంతట అదే మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకువెళుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా గూగుల్ మరో విప్లవానికి తెరలేపింది. అదే సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లు...సైకిళ్లు మనం తొక్కకుండానే వాటంతట అవే రోడ్ల మీద పరుగులు పెడతాయి. ఆశ్చర్యంగా ఉన్న ఇది. నిజం గూగుల్ నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more: ఈ సారి దక్షిణ కొరియా నేలమట్టమయింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లను గూగుల్ తొలిసారిగా నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే ప్రీమియర్ సైక్లింగ్ సీటీగా పేరుగాంచిన నగరం. అందుకే గూగుల్ ముందుగా ఇక్కడ ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లను ప్రవేశపెట్టింది. మరి అది నిజమైనదనా లేక ఫేక్ అనేది మాత్రం కొంచెం సంశయంగానే ఉంది.

2

వీడియో ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశంలో సైకిళ్లను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ దేశంలో సంవత్సరానికి ఓ వ్యకి దాదాపు 900 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతాడు. ఇక అందరూ కలిసి సంవత్సరానికి సైకిల్ తొక్కే దూరం దాదాపు 15 బిలియన్ల కిలో మీటర్లని అంచనాగా చెబుతున్నారు.

3

మొదటగా గూగుల్ ఆమ్‌స్టర్‌డ్యాంలోని జనావాస పరిసర ప్రాంతాల్లో ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ పార్కుల్లో అలాగే రోడ్లమీద ఈ సైకిళ్లను ప్రయోగాత్మకంగా పరీక్షంచనున్నట్లు వీడియోని బట్టి తెలుస్తోంది.

4

ఆక్కడి ప్రయోగాలు విజయానంతరం ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లను అన్ని ఏరియాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీతో పట్టణాలను చైతన్యవంతం చేయడం అలాగే కలుషితం లేని టెక్నాలజీని అందించండంలో భాగంగా గూగుల్ ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్లను ముందుకు తీసుకువస్తుండవచ్చు.

5

ప్రపంచంలో ఏటా కాలుష్యం పెరిగిపోవడం ముఖ్యంగా వాహనాల పొగతో కాలుష్యం విపరీతంగా పెరగడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టడమే గూగుల్ ఆశయంగా పెట్టుకుంది. అందుకని ఈ సెల్ఫీ డ్రైవింగ్ సైకిళ్ల ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.

6

అయితే కంపెనీ వీడియో చివరిలో ఏప్రిల్ ఫస్ట్ రోజునే ఇవి దొరుకుతాయంటూ మెసేజ్ ఇచ్చారు. దీంతో దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది ఫేక్ అని ఏప్రిల్ ఫస్ట్ న అందర్నీ పూల్ చేయడానికే ఈ వీడియోని రిలీజ్ చేశారని కొందరు అంటున్నారు. మరి నిజాలు ఏంటనేది ముందు ముందుగాని తెలియదు.

7

దీనికి సంబంధించిన వీడియో 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google introduce the self-driving bicycle in the Netherlands
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot