గూగుల్ నెక్సస్ 6లో బ్యాటరీ లోపాలు!

|

గూగుల్ నెక్సస్ 6 బ్యాటరీ పనితీరు పై వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోన్ మార్కెట్లో విడుదలై 3 నెలల కావస్తోంది. ప్రధానంగా బ్యాటరీ సమస్య నెక్సస్ 6 ఎస్6 యూజర్లను వేధిస్తోంది. తాజాగా బ్యాటరీ ఉబ్బుకు గురైన నెక్సస్ 6కు సంబంధించిన ఫోటోలన ఢిల్లీకి చెందిన మౌనికా జాసుజా అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఈ సంఘటన జరిగినపుడు ఫోన్ కనీసం చార్జింగ్‌లో కూడా లేదని సదరు యూజర్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

గూగుల్ నెక్సస్ 6లో బ్యాటరీ లోపాలు!

నెక్సస్ 6 నాన్-రిమూవబుల్ ప్లాస్టిక్ బ్యాక్ తో లభ్యమవుతోంది. తమకు ఎదురైన ఇదే సమస్యను పలువురు గూగుల్ నెక్సస్ 6 యూజర్లు ట్విట్టర్, రెడ్డిట్, గూగుల్ + వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో కొద్ది రోజులుగా ప్రస్తావించటం జరుగుతోంది. ఇండియన్ మార్కెట్లో గూగుల్ నెక్సస్ 6 ఫోన్ రూ.43,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. ఈ సమస్యను మోటరోలా ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి మరి.

గూగుల్ నెక్సస్ 6లో బ్యాటరీ లోపాలు!

గూగుల్ నెక్సస్ 6 స్పెసిఫికేషన్‌‍లు: 5.96 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 2.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

(ఇంకా చదవండి: షియోమీ ఎంఐ4ఐ vs మైక్రోమాక్స్ యు యురేకా vs లెనోవో ఏ7000)

Best Mobiles in India

English summary
Google Nexus 6 battery swells and explodes. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X