గూగుల్ నుంచి కొత్త ఫోన్ వస్తోంది
ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లో ఎంత పాపులారిటీని సొంతం చేసుకున్నాయో మనందరికి తెలుసు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, భారీ ఫీచర్ అప్‌డేట్‌లతో కూడిన సరికొత్త ఆండ్రాయిడ్ వన్ (2.0 వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. జూలై 14న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది.
Read More: మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆస్తికర విషయాలు
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ ఈ ఫోన్‌ను తయారు చేసింది. ప్రముఖ ప్రాసెసింగ్ చిప్‌ల కంపెనీ మీడియాటెక్ ఈ ఫోన్‌కు ప్రాసెసర్ వ్యవస్థను సమకూర్చినట్లు తెలుస్తోంది. ఫోన్ మార్కెట్ ధర రూ.12,000 వరకు ఉండొచ్చని అంచనా. లావా, మీడియాటెక్‌ల సంయుక్త భాగస్వామ్యంతో గూగుల్ అభివృద్థి చేసిన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్ 2జీబి ర్యామ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో మార్కెట్ హాట్ టాపిక్‌గా నిలవనుంది.
Read More: సాఫ్ట్‌వేర్ జాబ్స్.. వాళ్లకు ఎంత జీతం ఇస్తారు?
కోర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ గూగుల్ ఇటీవల ప్రదర్శించిన ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ ఆండ్రాయిడ్ ‘ఎం’ ఆపరేటింగ్ సిస్టం గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
అప్లికేషన్ పర్మిషన్లను కంట్రోల్ చేసుకునే సరికొత్త ఆప్షన్‌ను గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రవేశపెట్టనుంది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
‘ఆండ్రాయిడ్ పే' అనే మొబైల్ పేమెంట్ సిస్టంను ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ ప్రవేశపెట్టనుంది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా డోజ్ స్టేట్ అనే డీప్ స్లీప్ మోడ్‌ను గూగుల్ పరిచయం చయబోతోంది. ఈ ఫీచర్ బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేస్తుంది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ర్యామ్ మేనేజర్ మెమరీ యూసేజ్‌కు సంబంధించి బోలెడంత సమాచారాన్ని యూజర్లకు అందిస్తుం

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంలో ఏర్పాటు చేసిన సరికొత్త ఆటో బ్యాకప్ ఫీచర్ డేటాను ఆటోమెటిక్‌గా బ్యాకప్ చేసేస్తుంటుంది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
గూగుల్ నౌ ఫీచర్‌లో సరికొత్త నౌ ఆన్ ట్యాప్ ఫీచర్‌ను గూగుల్ జత చేసింది.

ఆండ్రాయిడ్ ఎమ్.. ఆసక్తికర పీచర్లు
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం యూఎస్బీ సీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








