Google Pixel 4a త్వరలోనే వచ్చేస్తోంది!!! ఫీచర్స్ ఇవే...

|

గూగుల్ సంస్థ నుంచి కొత్తగా రాబోతున్న ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 4a కూడా ఒకటి. దీని యొక్క లాంచ్ ఎప్పుడు అని చాలా కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ ఆగస్టు 3 న ఇండియాలో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం.

 

గూగుల్ పిక్సెల్ 4a ఆన్‌లైన్ లీక్స్

గూగుల్ పిక్సెల్ 4a ఆన్‌లైన్ లీక్స్

జూలై 13 న గూగుల్ పిక్సెల్ 4a లాంచ్ కావడంలేదు అని మొదట పేర్కొన్న టిప్‌స్టర్ ఇప్పుడు కంపెనీ లాంచ్ తేదీని నిర్ణయించిందని పేర్కొంది . గత సంవత్సరంలో విడుదలైన పిక్సెల్ 3 మరియు పిక్సెల్ 3a లకు అప్ గ్రేడ్ వెర్షన్ గా ఈ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 4a ఫోన్ గూగుల్ యొక్క సరసమైన వెర్షన్‌గా భావించబడుతుంది. పిక్సెల్ 4a లాంచ్ గురించి గూగుల్ ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు కానీ ఆగష్టు మొదటి వారంలో విడుదల అవుతున్నట్లు కొన్ని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి.

 

Also Read: JioMart app: అధిక డౌన్‌లోడ్ లతో జియోమార్ట్ అద్భుతమైన రికార్డు...Also Read: JioMart app: అధిక డౌన్‌లోడ్ లతో జియోమార్ట్ అద్భుతమైన రికార్డు...

గూగుల్ పిక్సెల్ 4a లాంచ్ డేట్
 

గూగుల్ పిక్సెల్ 4a లాంచ్ డేట్

గూగుల్ సంస్థ ఆగస్టు 3 న తన కొత్త ఫోన్ పిక్సెల్ 4a ను విడుదల చేయనున్నట్లు టిప్‌స్టర్ జోన్ ప్రాసెసర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన చాలా దగ్గరగా ఉంది. కాని టిప్‌స్టర్ ప్రకారం ఇది వచ్చే వారం జరగవచ్చు. ఇప్పటి వరకు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ , ధర మరియు లాంచ్ డేట్ గురించి అనేక లీకులు వచ్చాయి కానీ ఇంకా ఏదీ అధికారికంగా చేయబడలేదు. గత నెల జూన్ 3 న జరిగే ఆండ్రాయిడ్ 11 ఈవెంట్‌లో ఫోన్‌ను ప్రకటిస్తారని భావించినప్పటికీ అది జరగలేదు. అప్పుడు, జూలై 13 న ప్రారంభిస్తామని మరికొందరు పేర్కొన్నారు కానీ ప్రాసెసర్ ప్రకారం ఇది కూడా వాయిదా పడింది. కాబట్టి ఆగస్టు 3 న లాంచ్ అవుతుందో లేదో చూడాలి.

గూగుల్ పిక్సెల్ 4a ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ 4a ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ 4a ఫోన్ 64GB మరియు 128GB వేరియంట్లలో వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర $ 299 (సుమారు రూ.22,400) కాగా, 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర $ 349 (సుమారు రూ. 26,100).

గూగుల్ పిక్సెల్ 4a లీక్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 4a లీక్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 4a ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అడ్రినో 618 GPU తో మరియు స్నాప్‌డ్రాగన్ 730 SoC తో రన్ అవుతూ 6GB RAM తో జతచేయబడి ఉంటుంది. ఈ ఫోన్ 5.8-అంగుళాల డిస్ప్లేతో రావచ్చు. ఇది చాలావరకు ఆండ్రాయిడ్ 10తో పనిచేసే అవకాశం ఉంది. పిక్సెల్ 4a ఫోన్ యొక్క బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో వస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Google Pixel 4a Launch Date Leaked Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X