Home
News

Google Play Movies లో త్వరలో ఫ్రీగా మూవీలను చూడవచ్చు

గూగుల్ సంస్థ రానున్న రోజులలో గూగుల్ ప్లే మూవీస్ యాప్ ద్వారా సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను యాడ్-ఆధారిత లైబ్రరీతో కలుపుకొని ఉచితంగా చూడటానికి తీసుకురానున్నట్లు చాలా రకాల నివేదికలు సూచించాయి. గూగుల్ ప్లే మూవీస్ యొక్క కొత్త అప్ డేట్ లో భాగంగా ఇది సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలను కూడా జోడిస్తుంది.

స్ట్రీమింగ్ సర్వీస్

స్ట్రీమింగ్ సర్వీస్

వినియోగదారులు ఈ కంటెంట్‌ను ఉచితంగా చూడటానికి ప్రకటనలను కలిగి ఉంటుంది. అమెరికన్ స్ట్రీమింగ్ సర్వీస్ Vudu మాదిరిగానే ఈ మోడల్‌ను గూగుల్ అనుసరిస్తుందని నివేదికలు సూచించాయి. కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి సమయంలో డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది చాలా మంచి శుభవార్త.

గూగుల్ ప్లే మూవీస్ యాప్

గూగుల్ ప్లే మూవీస్ యాప్

గూగుల్ ప్లే మూవీస్ యాప్ ప్రస్తుతం వినియోగదారులను సినిమాలను అద్దెకు ఇవ్వడానికి లేదా కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఏదేమైనా XDA డెవలపర్స్ యొక్క నివేదిక ప్రకారం గూగుల్ ప్లే మూవీస్ యాప్ యొక్క వెర్షన్ v4.18.37 యొక్క APK టియర్ డౌన్ ప్రకటనలతో కూడిన సినిమాలు మరియు టీవీ షోలను ఉచితంగా చూడడానికి ఒక ప్రత్యక ఆప్షన్ ను జోడించాలని యోచిస్తున్నట్లు గూగుల్ సూచించింది. గూగుల్ పే మూవీస్ APK లోని కోడ్ యొక్క స్ట్రింగ్స్ ను కూడా ధృవీకరించింది. నివేదికల ప్రకారం గూగుల్ ప్లే మూవీస్ కోడ్‌లోని ఒక స్ట్రింగ్ యొక్క వందలాది సినిమాలు "కొన్ని ప్రకటనలతో" అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ ప్లే మూవీస్ ఫీచర్

గూగుల్ ప్లే మూవీస్ ఫీచర్

9to5Google నివేదిక ప్రకారం ఈ యాప్ యొక్క కోడ్‌లోని అనేక స్ట్రింగ్స్ లను గూగుల్ త్వరలో ఈ ఫీచర్ న్ని తీసుకురాగలదని సూచిస్తుంది. అంతేకాకుండా కొనుగోలు చేసిన కంటెంట్ విషయానికి వస్తే గూగుల్ ప్లే మూవీస్ మరియు యూట్యూబ్ ఒకే లైబ్రరీ నుండి షేర్ చేసినప్పటి నుండి కొత్త సినిమాలు యూట్యూబ్ మూవీస్ యొక్క పొడిగింపుగా ఉంటాయని తెలిపింది.

గూగుల్ ప్లే మూవీస్

గూగుల్ ప్లే మూవీస్

వినియోగదారులకు సినిమాలను ఉచితంగా ఎప్పటి నుంచి అందిస్తారో అన్న దాని మీద ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఇది పిల్లలకు R- రేటెడ్ చిత్రాలను చూడకుండా ఉండటానికి అవకాశం ఉందని పేర్కొంది. యూట్యూబ్ మరియు గూగుల్ ప్లే ఇప్పటికే ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయాయి. యూట్యూబ్ క్రమం తప్పకుండా ప్రకటనలతో కూడిన ఫ్లిక్‌లను ఉచితంగా అందిస్తుంది. గూగుల్ ప్లే మూవీస్ అందించే సినిమాలు ఎక్కువగా బి- మరియు సి-లిస్ట్ ఫ్రీ ఫ్లిక్స్ యొక్క విస్తృతమైన జాబితా నుండి భిన్నంగా ఉంటాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Google Play Movies Offers Ad-Based Movies and TV Shows at Free of Cost Very Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X