2015 : గూగుల్‌ని షేక్ చేసిన సినిమాలు

Written By:

గూగుల్ 2015వ సంవత్సరానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ పొందిన పది చిత్రాలను విడుదల చేసింది. అయితే గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో అన్నీ హాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. బాలీవుడ్ ,కోలీవుడ్ ,టాలీవుడ్ ఇలా ఏ వుడ్ నుంచి చోటు దక్కలేదు. బాలీవుడ్ నుంచి సల్మాన్ సినిమా ఒక్కటే చోటు దక్కించుకుంది. ఈ సారి జురాసిక్ వరల్డ్ మూవీ గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో మొదటి స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్ మూవీస్ లో చోటు సంపాదించిన సినిమాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మళ్లీ వార్తల్లోకెక్కిన బాహుబలి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జురాసిక్ వరల్డ్ (Jurassic World)

ఇది 2015లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమా. జరాసిక్ పార్క్ లో నాలుగవ భాగం. కోలిన్ ట్రెవర్రో దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ప్రట్ ,హోవార్డ్ విన్సెంట్ తారాగణంగా వచ్చిన ఈ చిత్రం దాదాపు 60 దేశాల్లో విడుదలయింది. దాదాపు 500 మిలియన్ డాలర్లు ఆర్జించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో మూడవస్థానం సంపాదించింది.

ప్యూరియస్ 7 ( Furious 7)

టెర్రర్ నేపధ్యంలో సాగే సినిమా ఇది. జేమ్స్ వాన్ దర్శకుడు. ఇది కూడా గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో చోటు సంపాదించింది.

అమెరికన్ స్నిప్పర్ ( American Sniper)

అమెరికన్ నేవీ నేపధ్యంగా సాగే చిత్రం. యుద్ధాలతో మొదట్నుంచి సినిమా ఆకట్టు కుంటుంది. ఇది గూగుల్ ట్రెండ్ మూవీస్ లో చోటు సంపాదించింది.

పిప్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ( Fifty Shades of Grey )

అమెరికన్ ఏరోటిక్ రోమాంటిక్ డ్రామా మూవీ ఇది. సినిమా మొదట్నుంచి అనేక మలుపులతో ముందుకు సాగుతుంది. శ్యామ్ టేలర్ జాన్సన్ దర్శకులు.

మినియన్స్ ( Minions )

అమెరికన్ 3డీ కంప్యూటర్ యానిమేటెడ్ ఫ్యామిలి మూవీ.

స్పెక్టర్ ( Spectre )

ఈ సినిమా జేమ్స్ బాండ్ కి 24వ సినిమా. ఓ నిగూఢమైన మెసేజ్ ఉంటుంది.

స్ర్టయిట్ ఉట్ట కాంప్టన్ ( Straight Outta Compton )

అమెరికన్ బయోగ్రఫికల్ డ్రామా సినిమా ఇది. అనేక అవార్డులను కూడా గెలుచుకుంది.

మ్యాడ్ మ్యాక్స్ ( Mad Max )

యాక్షన్ డ్రామా పరంగా సాగే మూవీ. రోసీ లేడీ క్యారక్టర్ లో అద్భుతంగా నటించిన చిత్రం.

ప్రేమ్ రతన్ ధన్ పాయో ( Prem Ratan Dhan Payo )

బాలీవుడ్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ట్రెండింగ్ మూవీస్ లో చోటు దక్కించుకున్ ఏకైక మూవీ. సల్మాన్ ఖాన్ , సోనమ్ కపూర్ జంటగా నటించారు. సూరజ్ దర్శకుడు.

బర్డ్ మ్యాన్ ( Birdman )

యుద్ధ నేపధ్యంగా సాగే సినిమా ఇది కూడా గూగుల్ ట్రెండ్ లో చోటు సంపాదించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google reveals the top ten trending movies of 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot