ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్
గూగుల్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఆండ్రాయిడ్ లాలీపాప్ వర్షన్ మార్కెట్లో విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 9.7 శాతం ఆండ్రాయిడ్ డివైస్‌లు మాత్రమే ఈ అప్‌డేట్ పై రన్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం 39.8 శాతం డివైజుల్లో, జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం 39.2 శాతం డివైజుల్లో అందుబాటులో ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది.
(చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్‌లను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే..?)
గూగుల్ కొత్త వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆండ్రాయిడ్ ఎమ్ లేదా ఆండ్రాయిడ్ 6.0 పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశ ముంది. గూగుల్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం గురుంచి పలు ఆసక్తికర విషయాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం మెరుగుపరచబడిన నోటిఫికేషన్ ఫీచర్లతో లభ్యం కానుంది. ఆండ్రాయిడ్ టీవీ, ఆటో సపోర్ట్ వంటి ఫీచర్లు ఓఎస్‌కు మరింత ఆధునీకతను తెచ్చిపెడతాయి. స్మార్ట్‌హోమ్ కనెక్టువిటీ, ఈ ప్రత్యేకమైన ఫీచర్ ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ద్వారా మీ స్మార్ట్‌హోమ్‌ను సునాయాసంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వర్షన్‌లో ఏర్పాటు చేసిన ‘కిల్ స్విచ్' తరహాలోనే మరింత ఆధునీకరించబడిన సెక్యూరిటీ వ్యవస్థను ఆండ్రాయిడ్ ఎమ్ ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఏర్పాటు చేయనుంది. ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఆధునీకరించబడిన స్పెసిఫికేషన్‌లతో ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ ఎమ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది. 
ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్

ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్

ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్

ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్

ఆండ్రాయిడ్ కొత్త అప్‌డేట్.. అదిరిపోయే ఫీచర్స్


Click it and Unblock the Notifications








