Home
News

విద్యార్థులకు శుభవార్త 3నెలలు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం

నెట్‌ఫ్లిక్స్ మరియు స్పాటిఫై వంటి పోటీదారుల నుండి పోటీని ఎదురుకోవడానికి ఆన్‌లైన్ కంటెంట్-స్ట్రీమింగ్ విభాగంలో తనకంటు ఒక బలమైన పట్టు సాధించే ప్రయత్నంలో గూగుల్ యుఎస్‌లోని విద్యార్థులకు యూట్యూబ్ ప్రీమియంను మూడు నెలల పాటు ఉచితంగా ఫ్రీ ట్రయల్‌ను అందించింది. గూగుల్ విద్యార్థుల కోసం పాఠశాల ఒప్పందానికి కొత్తగా మళ్ళీ తిరిగి వచ్చింది.

google students three months youtube music premium free

క్రొత్త సభ్యులకు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా యూట్యూబ్ ప్రీమియం యొక్క మూడు నెలల ట్రయల్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందులో యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఉంటుంది. కాబట్టి మీరు మొదటి ఎంపిక తీసుకోవడం మంచిది.

ధర :

ధర :

ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా నెలకు $6.99 (సుమారు రూ .500) ప్లాన్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇందులో యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇది వినియోగదారులను మూడు నెలల పాటు ఉచితంగా సేవలను ఉపయోగించుకునేలా చేస్తుంది.

ప్లాన్ వివరాలు:

ప్లాన్ వివరాలు:

విద్యార్ధులు మరియు కొత్త సభ్యులు పరిమిత సమయం కొరకు #YouTubeMusic ప్రీమియం లేదా @YouTubePremium విద్యార్థి ప్లాన్ వంటివి మూడు నెలల పాటు ఉచితంగా ఆనందించవచ్చు. #BacktoSchool పొందడానికి మీరు ఏమి ఆడుతున్నారో మాకు తెలియజేయండి" అని YouTube మ్యూజిక్ ప్రకటించింది.

YouTube ప్రీమియం:

YouTube ప్రీమియం:

యూట్యూబ్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ ప్రీమియం విద్యార్థుల కోసం తన ప్లాన్లను గత సంవత్సరం వెల్లడించిన ధర కంటే భారీ తగ్గింపుతో అందిస్తున్నాయి. వీటి యొక్క ధరలను 50% తగ్గించి యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం నెలకు $4.99 మరియు యూట్యూబ్ ప్రీమియం నెలకు $6.99 అందిస్తున్నారు. వాటిలో మునుపటిది మ్యూజిక్ సర్వీస్ మాత్రమే అందిస్తుంది. కాబట్టి మీరు సంగీతం మరియు ప్రకటన రహిత YouTube వీడియోలను చూడాలనుకుంటే YouTube ప్రీమియం మంచి ఆఫర్.

ప్రయోజనాలు:

ప్రయోజనాలు:

యూట్యూబ్ ప్రీమియం అనేది సమగ్ర సుబ్స్క్రిప్షన్. ఇది మొబైల్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా ఇది యూట్యూబ్ నుండి ప్రకటనలను తొలగిస్తుంది మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం యొక్క అన్ని ప్రయోజనాలకు అదనంగా యూట్యూబ్ ఒరిజినల్ షోలకు యాక్సిస్ ఇస్తుంది.

యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం:

యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం:

యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం అనేది గూగుల్ యొక్క చెల్లింపు మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్. ఇది క్రొత్త సంగీతాన్ని స్ట్రీమ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి మరియు కనుగొనటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇటీవల అమెజాన్ సంస్థ విద్యార్థుల కోసం అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్‌ను నెలకు $ 0.99 చొప్పున ప్రకటించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
google students three months youtube music premium free
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X