100 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తున్న ఎయిర్‌టెల్ టీవీ

|

భారతీయ టెలికాం పరిశ్రమలోని అన్ని టెలికాం ఆపరేటర్లు ఆన్-డిమాండ్ వీడియో కంటెంట్ మరియు సంబంధిత యాప్ ల వాడకంతో వారి ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ఆఫర్లను మరింత ఆకర్షణీయంగా చేస్తున్నారు. అన్ని టెల్కోస్ యొక్క అన్ని ప్రణాళికల్లో సాధారణ విషయం ఏమిటంటే సంగీతం లేదా వీడియో యాప్.

airtel tv web version

ఏదేమైనా మూడు ప్రైవేట్ టెల్‌కోస్‌లలో ఎయిర్‌టెల్ అత్యుత్తమ వీడియో ఆన్-డిమాండ్ అప్లికేషన్‌ను కలిగి ఉంది.ఇది చందాదారులకు లైవ్ టీవీ ఛానెల్‌లను, ఆన్-డిమాండ్ కంటెంట్ మరియు మరిన్నింటిని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.ఇందులో మంచి విషయం ఏమిటంటే ఈ సర్వీస్ వినియోగదారు కోసం ఎయిర్‌టెల్ టీవీ యాప్ కి మాత్రమే పరిమితం కాదు ఇది వెబ్‌లో కూడా అందుబాటులో ఉంది.

ఎయిర్టెల్ టీవీ వెబ్ వెర్షన్ వివరాలు:

ఎయిర్టెల్ టీవీ వెబ్ వెర్షన్ వివరాలు:

ఎయిర్టెల్ టీవీ తన వెబ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 115 లైవ్ టీవీ ఛానెళ్లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ టీవీ వీడియో-ఆన్-డిమాండ్ మరియు లైవ్ టీవీ సేవలలో ఒకటి ఇది వెబ్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని అర్థం యాప్ న్ని ఉపయోగించే చందాదారులు సర్వీస్ యొక్క వెబ్ వెర్షన్‌లోకి కూడా లాగిన్ అవ్వగలుగుతారు తద్వారా సంబంధిత కంటెంట్ ను పెద్ద స్క్రీన్‌లలో కూడా చూడవచ్చు. వెబ్‌లో లైవ్ టీవీ చర్యను తెలుసుకోవడానికి చందాదారులు ఎయిర్‌టెల్ టీవీ అధికారిక వెబ్‌సైట్‌ను (www.airtelxstream.in)సందర్సించవచ్చు. అక్కడ వారు OTP ని ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు. తరువాత వారు చూడటానికి అందించే టీవీ ఛానెళ్ల జాబితా నుండి అన్వేషించడానికి లైవ్ టీవీ విభాగానికి నావిగేట్ చేయవచ్చు.

ఎయిర్‌టెల్ టీవీ యాప్:

ఎయిర్‌టెల్ టీవీ యాప్:

ఎయిర్‌టెల్ టీవీ ప్రస్తుతం వీడియోల విషయానికి వస్తే మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అతి పెద్ద టీవీ అప్లికేషన్. ముఖ్యంగా ఎయిర్‌టెల్ చందాదారుల కోసం వారు ఫ్రీ షోస్ మరియు చలనచిత్రాలను యాక్సెస్ చేయాలనుకుంటే ఈ యాప్ సరైనది. ఈ యాప్ ద్వారా ఎయిర్‌టెల్ చందాదారులు ZEE5 కంటెంట్‌ను ఉచితంగా పొందువచ్చు. వెబ్ వినియోగదారుల కోసం ఈ సర్వీస్ ను తీసుకురావడంతో పాటు ఎయిర్టెల్ టీమ్ ఎయిర్టెల్ టీవీ యొక్క మొబైల్ యాప్ కి కొత్త ఫీచర్లను మరింత బలంగా మార్చడానికి ముందుకు తెచ్చింది.

ఎయిర్టెల్ టీవీ మొబైల్ యాప్ ఫీచర్స్ & వివరాలు:

ఎయిర్టెల్ టీవీ మొబైల్ యాప్ ఫీచర్స్ & వివరాలు:

ఎయిర్టెల్ టీవీ మొబైల్ అప్లికేషన్‌లో 350+ లైవ్ టివి ఛానెల్స్ యొక్క న్యూస్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్‌మెంట్, మ్యూజిక్, మూవీస్, భక్తి, జీవనశైలి,కిడ్స్ వంటివి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ వంటి పలు భాషల్లో అందిస్తుంది.ఈ యాప్ కొన్ని తాజా ఫీచర్స్ ను కూడా అందిస్తుంది. ఇది ఎయిర్‌టెల్‌లో వీక్షణ అనుభవాన్ని చాలా ఆహ్లాదకరంగా చేస్తుంది.

ఎయిర్‌టెల్ టీవీ మొబైల్ యాప్:

ఎయిర్‌టెల్ టీవీ మొబైల్ యాప్:

ఎయిర్‌టెల్ టీవీ మొబైల్ యాప్ డార్క్ మోడ్‌ ఫీచర్ తో వస్తుంది. ఇది కంటి చూపు ఒత్తిడిని తగ్గించడానికి మరియు డివైస్ బ్యాటరీని ఆదా చేయడానికి కూడా ప్రకాశవంతమైన స్క్రీన్‌లకు దూరంగా ఉంటుంది.ఎయిర్‌టెల్ టివి అప్లికేషన్ డార్క్ మోడ్‌తో పాటు కొత్త పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను కూడా అందుకుంది. ఇది క్రొత్త కంటెంట్‌ను అన్వేషించడానికి లేదా యాప్ ని ఉపయోగించి వీడియోను త్వరగా సూక్ష్మీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ టీవీకి 10,000 కి పైగా సినిమాలు లేదా ZEE5, హంగమా, ఈరోస్ నౌ, HOOQ, ఆల్ట్ బాలాజీ, షేర్‌ఇట్, యూట్యూబ్ వంటి భాగస్వాముల నుండి లభించే టీవీ షోలు వస్తాయని గమనించాలి. ఈ యాప్ పర్సనల్ వాచ్‌లిస్ట్, ఒకే లాగిన్‌తో రెండు మూడు డివైస్ లలో యాక్సిస్ పొందడం మరియు చివరి పాయింట్ నుండి ప్లేబ్యాక్ ఫీచర్ ని తిరిగి ప్రారంభించడం వంటి కొన్ని లక్షణాలను కూడా అందిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
airtel tv web version

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X