పాస్‌వర్డ్ లేకుండానే గూగుల్ ఖాతా ఓపెన్!

Written By:

పాస్‌వర్డ్ లు గుర్తించుకోలేక మీరు ఇబ్బందిపడుతున్నారా..పాస్టవర్డ్ లు తరచూ మరచిపోయి మీరు చికాకు పడుతున్నారా..అయితే వాటన్నింటికి ఇప్పుడు గూగుల్ సరికొత్త పరిష్కారాలను కనుగొనే పనిలో తలమునకలయింది. ఇక మీరు పాస్‌వర్డ్ లేకుండానే జీమెయిల్ ఓపెన్ చేసేలా ప్రత్యేక సదుపాయాలను గూగుల్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మొబైల్ వెరిఫికేషన్ ద్వారా గూగుల్ జీమెయిల్ లాగిన్ అయ్యేలా సరికొత్త సాఫ్ట్ వేర్ ను గూగుల్ బయటకు తీసుకురానుంది.

Read more : ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలంటే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది నెటిజన్లు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది నెటిజన్లు

పాస్‌వర్డ్ ... 123456 ... పిజ్జా ... 'ఏంటివి అనుకుంటున్నారా? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధిక శాతం మంది నెటిజన్లు తమ ఖాతాలకు ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్ !

దాదాపుగా ఇలాంటి కాంబినేషన్ కలిగిన పదాలనే

దాదాపుగా ఇలాంటి కాంబినేషన్ కలిగిన పదాలనే

అవును మరి, క్లిష్టతరమైన పాస్‌వర్డ్ ను వాడితే గుర్తుంచుకోవడం కష్టమని అధిక మంది యూజర్లు ఇవి కాకపోయినా, దాదాపుగా ఇలాంటి కాంబినేషన్ కలిగిన పదాలనే తమ ఖాతాలకు పాస్‌వర్డ్ గా వాడుతున్నారని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

దీంతో వినియోగదారుల అకౌంట్లు సులువుగా

దీంతో వినియోగదారుల అకౌంట్లు సులువుగా

దీంతో వినియోగదారుల అకౌంట్లు సులువుగా హ్యాకింగ్ కు గురవుతున్నాయని అంటున్నారు. అయితే ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ 'గూగుల్' త్వరలో ఇలా పాస్‌వర్డ్ టైప్ చేసి అకౌంట్లోకి లాగిన్ అయ్యే పాత తరహా విధానానికి స్వస్తి పలకనుంది.

ఫిజికల్ యూఎస్బీ కీ ఆథెంటికేషన్' 'మొబైల్ వెరిఫికేషన్'

ఫిజికల్ యూఎస్బీ కీ ఆథెంటికేషన్' 'మొబైల్ వెరిఫికేషన్'

ఫిజికల్ యూఎస్బీ కీ ఆథెంటికేషన్' 'మొబైల్ వెరిఫికేషన్' అనే రెండు పద్ధతుల ద్వారా పాస్‌వర్డ్ లేకుండానే యూజర్లు తమ తమ అకౌంట్లలోకి లాగిన్ అయ్యే విధానాలను గూగుల్ సంస్థ తాజాగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.

మొదటి పద్ధతి'లో యూజర్ నుంచి గుర్తింపు తీసుకునే

మొదటి పద్ధతి'లో యూజర్ నుంచి గుర్తింపు తీసుకునే

మొదటి పద్ధతి'లో యూజర్ నుంచి గుర్తింపు తీసుకునే ఒక భౌతిక పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఇక రెండో పద్ధతి ఏంటంటే యూజర్ ముందుగా తన మొబైల్ డివైస్కు ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయ్యే సమయంలో

అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయ్యే సమయంలో

అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయ్యే సమయంలో అంతకు ముందు రిజిస్టర్ చేసిన మొబైల్కు ఒక రిక్వెస్ట్ వస్తుంది. దాన్ని ఓకే చేస్తేనే అకౌంట్లోకి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే కాదు.

ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు టెస్టింగ్ దశలో

ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు టెస్టింగ్ దశలో

ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు టెస్టింగ్ దశలో ఉన్నాయని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.

వీటి ద్వారా యూజర్ పాస్వర్డ్లను గుర్తుంచుకోవాల్సిన

వీటి ద్వారా యూజర్ పాస్వర్డ్లను గుర్తుంచుకోవాల్సిన

వీటి ద్వారా యూజర్ పాస్వర్డ్లను గుర్తుంచుకోవాల్సిన, ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google testing account sign-in using your phone not a password
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot