గూగుల్ మ్యాప్ నుంచి సరికొత్త అప్‌డేట్

Written By:

గూగుల్ నుంచి ఇప్పుడు సరికొత్త అప్‌డేట్ వచ్చింది. కొత్తగా వచ్చిన అప్‌డేట్స్‌తో గూగుల్ మ్యాప్‌లో ఎప్పటికప్పుడు మీరు ట్రాఫిక్ అలర్ట్స్ ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం డివైస్‌లో ఇంటర్నెట్‌తోపాటు, జీపీఎస్‌ను యాక్టివేట్ చేయాలి. అంతేకాకుండా మ్యాప్స్‌లోని నావిగేషన్ మోడ్‌లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో నావిగేషన్‌లో ఉండగానే ఓ ఫిమేల్ వాయిస్ ట్రాఫిక్ అలర్ట్స్‌ను యూజర్‌కు వినిపిస్తుంది.

Read more : పదేళ్ల రహస్యాన్ని చేధించిన గూగుల్ మ్యాప్

గూగుల్ మ్యాప్ నుంచి సరికొత్త అప్‌డేట్

ఏదైనా రోడ్‌లో ట్రాఫిక్ జాం అయినా, ఇబ్బంది ఉన్నా యూజర్‌కు తెలుపుతుంది. సదరు ట్రాఫిక్ ఎంత సేపట్లో క్లియర్ అవుతుందో, లేదంటే వేరే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా, లేదా అనే వివరాలను కూడా యూజర్‌కు వివరిస్తుంది. ఈ యాప్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను యూజర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read more: గూగుల్ మ్యాప్‌లో ఎంత వెదికినా దొరకవు

ప్రధానంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొనే యూజర్లకు ఈ యాప్ అప్‌డేట్ మరింతగా ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాలను చూద్దాం.

Read more: 18 సంవత్సరాల గూగుల్ చరిత్ర ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన జపనీస్ పర్యాటకులు తమ కారుతో సహా ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోవల్సి వచ్చింది.

2

తప్పుడు జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన ఓ మహిళ తన కారుతో సహా ఇలా చిత్తడి ప్రదేశంలో చిక్కుకుపోయింది.

 

 

4

తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరించిన న్యూ జెర్నీ డ్రైవర్ తన కారును చట్టవిరుద్ధమైన ఎడమ మలుపుకు తిప్పవల్సి వచ్చింది.

 

 

5

యూకే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరించి తర మెర్సిడెస్ బెంజ్ కారుతో నదిలోకి చొచ్చుకుపోయింది.

 

 

6

జీపీఎస్ రూట్ మ్యాప్‌ను అనుసరించిన ఓ బస్ డ్రైవర్ తన వాహనాన్ని వంతెన కింద ఇలా ఇరికించాడు.

 

 

7

జీపీఎస్‌ను అనుసరించిన పలువురు యూకే వాహనదారులు ఇరుకైన రోడ్ల మీద ఇబ్బందులను ఎదుర్కొవల్సి వచ్చింది.

8

జర్మన్ కారు డ్రైవర్ కు ఇలాంటి చేదు అనుభం ఎదురైంది.

 

 

3

గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించిన ఓ మహిళ ఇలా కారును ఢీకొట్టింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google Maps Receives An Update
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot