దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

By Hazarath
|

రెండు టెక్ దిగ్గజాల మధ్య ఇప్పుడు కాపీ రైట్ వార్ నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇప్పుడు ఆ రెండు కంపెనీలు సవాల్ విసురుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ రెండు సంస్ధల పేర్లు ఏంటో తెలుసా..గూగుల్ ,ఒరాకిల్ . ఈ రెండు టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు కాపీరైట్ వార్ ముదిరిపాకాన పడింది. ఇక ఈ కేసు భారీ పరిహారంతో ముడిపడింది. ఒరాకిల్ గెలిస్తే గూగుల్ భారీ మెత్తాన్నే సమర్పించుకోవాల్సిన పరిస్థితి.

Read more: హిస్టరీని మిస్టరీగా మార్చిన చిత్రాలు

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

కాపీ రైట్ దావాపై గూగుల్, ఒరాకిల్ కంపెనీల మధ్య వార్ కు తెర లేచింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై వచ్చే సోమవారం జరగబోయే కాపీరైట్ విచారణలో ఈ కంపెనీలు నువ్వా..? నేనా ..? అంటూ వాదించుకోబోతున్నాయి.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

ఒకవేళ ఈ కేసులో ఒరాకిల్ నెగ్గితే గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ వాదిస్తున్నది.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని గూగుల్ చెబుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లోనే ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ రెండు కంపెనీల వాదనలపై జ్యూరీ ఎదుట విచారణ జరగనుంది.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై వచ్చే వారం కాపీరైట్ విచారణ సందర్భంగా ఒరాకిల్ కోరిన 8.8 బిలియన్ డాలర్లను గూగుల్ చెల్లించాల్సిన వస్తే మార్కెట్లో ఈ సెర్చ్ ఇంజన్ దిగ్గజంపై ప్రభావం చూపగలదని పెట్టుబడిదారులు, విశ్లేకులు భావిస్తున్నారు.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

అయితే ఆ ప్రభావం పెట్టుబడిదారులపైన తక్కువగానే ఉంటుందని ఎఫ్ బీబీ క్యాపిటల్ పార్టనర్స్ రీసెర్చ్ డైరెక్టర్ మికీ బైలీ తెలిపారు. ఎందుకంటే ఆ మొత్తాన్ని గూగుల్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని, ఈ ప్రభావం గూగుల్ పై తక్కువగానే చూపుతుందని పేర్కొన్నారు.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

అయితే ఈ జావా లాంగ్వేజ్ ను ఆండ్రాయిడ్ లో భవిష్యత్ లో ఎప్పుడూ గూగుల్ వాడుకోకుండా నిషేధాజ్ఞలు విధించాలని ఒరాకిల్ కోరుతోంది. ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ రాయల్టీ చర్చలతో మరింత పరపతిని పెంచుకోవాలని భావిస్తోంది.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

అయితే ఈ నిషేధాజ్ఞలను జడ్జినే విధించాల్సి ఉంటుంది కాబట్టి తీర్పు వన్ సైడ్ వచ్చే సూచనలున్నాయని నిపుణులంటున్నారు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ డివైజ్ ల ద్వారా అడ్వర్టైజింగ్, సెర్చ్ రెవెన్యూలను 29 బిలియన్ డాలర్ల(2900కోట్ల డాలర్లు)వరకూ గూగుల్ ఆర్జించిందని ఒరాకిల్ అంచనా వేసింది.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

యాప్ లు, ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాల ద్వారా అదనంగా 11.6 బిలియన్ డాలర్లు(1160 కోట్ల డాలర్లు) గూగుల్ పొందిందని కోర్టు డాక్యుమెంట్ లో ఒరాకిల్ పేర్కొంది. వీటిలో ఆండ్రాయిడ్ లాభాలు 11.4 బిలియన్ డాలర్లగా(1140కోట్ల డాలర్లు) తెలిపింది.

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

దిగ్గజ టెక్ కంపెనీల మధ్య కాపీరైట్ వార్: గెలిస్తే భారీ మొత్తమే

మొత్తంగా 8.8 బిలియన్ డాలర్లును కాపీ రైట్ ఉల్లంఘనల కింద గూగుల్ ను ఒరాకిల్ కోరేందుకు సిద్ధమైంది. అయితే ఆండ్రాయిడ్ విజయంతో, జావా ప్రాధాన్యతను ఒరాకిల్ ఎక్కువ చేసి చూపుతుందని గూగుల్ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Here Write Google to Face Off Against Oracle Next Week in $8.8 Billion Lawsuit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X