స్పేస్ బార్‌ను గూగుల్ చంపేస్తోందా..?

మారుతోన్న ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీ మరింత స్లిమ్ అవుతోంది. మరీ ముఖ్యంగా కాలం ముందుకు నడుస్తోన్న కొద్ది గాడ్జెట్‌లు పోర్టబులిటీని సొంతం చేసుకుంటున్నాయి. టెక్నాలజీ ప్రపంచంలో నిత్యం కొత్త సంస్కరణల కోసం పరితపించే గూగుల్ తాజాగా సాంప్రదాయ కీబోర్డ్‌లోని స్పేస్‌బార్‌ను తొలగించే ఆలోచన చేస్తోందట.

క్వార్ట్జ్ రిపోర్ట్ వెల్లడించిన వివరాల మేరకు గూగుల్ తాను డిజైన్ చేస్తున్న ఓ నాజూకు శ్రేణి ల్యాప్‌టాప్‌కు సంబంధించి ఓ పేటెంట్‌ను పొందిందట. ఈ ల్యాప్‌టాప్ కీబోర్డ్ రూపకల్పన నిమిత్తం గూగుల్ కొత్త పేటెంట్‌ను పొందినట్లు సమచారం. కొత్త కీబోర్డ్ కాన్సెప్ట్‌తో గూగుల్ రూపొందించబోయే ఈ ల్యాప్‌టాప్‌లో పొడగించబడిన ట్రాక్‌ప్యాడ్‌తో కూడిన స్పేస్‌బార్‌ను గూగుల్ ఏర్పాటు చేసింది. స్పేస్ బార్ అలానే ట్రాక్ ప్యాడ్ మధ్య ఓ గీతను కూడా గూగుల్ ఏర్పాటు చేసింది.
ఇంకా చదవండి: బెస్ట్ తెలుగు ఆండ్రాయిడ్ యాప్స్..


Click it and Unblock the Notifications








