గూగుల్ ,వాట్సప్,ఫేస్‌బుక్‌లు ఒక్కటై దోచుకుంటున్నాయి

Posted By:

అవును మీరు విన్నది నిజం.. గూగుల్ ,వాట్సప్,ఫేస్‌బుక్‌లు కుమ్మక్కయ్యాయి. యూజర్లకు చెందిన సమస్త సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. మీరేం మాట్లాడుతున్నారో అవి పసిగడుతున్నాయి...తద్వారా వ్యాపార ప్రకటనలు డిసైడ్ చేస్తున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అవాస్ట్  సీఈఓ విన్సెంట్.. యాడ్ వర్డ్స్ కేంద్రంగా ఇదంతా నడుస్తోందని మీకు ఏవి ఇష్టమో తెలుసుకుని వాటినే యాడ్ రూపడంలో గూగుల్ లో పెడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు..కథేంటో మీరే చూడండి.

Read more: తెరపైకి ‘YouTube Red'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూజర్లకు చెందిన సమస్త సమాచారాన్ని..

యూజర్లకు చెందిన సమస్త సమాచారాన్ని గూగుల్ ,వాట్సప్,ఫేస్ బుక్ వంటి సంస్థలు దొంగిలిస్తున్నాయని వారి ముందు వ్యాపార ప్రకటనలు ఉంచేందుకు ఏవి ఇష్టమో ఏవి అయిష్టమో తెలసుకుంటున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ అవాస్ట్ ఆరోపించింది.

యూజర్లకు కూడా తమ వివరాలు గూగుల్ తదితర సంస్థలకు ..

అయితే యూజర్లకు కూడా తమ వివరాలు గూగుల్ తదితర సంస్థలకు చేరుతున్నాయన్న విషయం తెలుసని అవాస్ట్ సీఈఓ విన్సెంట్ స్టెక్లర్ ఆరోపించారు.

దాని ఆదాయం అంతా యాడ్ వర్డ్స్ కేంద్రంగా ..

గూగుల్ ఓ వ్యాపార ప్రకటన సంస్థ.దాని ఆదాయం అంతా యాడ్ వర్డ్స్ కేంద్రంగా వస్తుంది. వారికి వ్యాపార ప్రకటనలు పంపేందుకు ఆ సంస్థ గూఢచర్యం చేస్తోంది.

సైబర్ సెక్యూరిటీపై అవాస్ట్ కనుగొన్న విషయాలను ..

సైబర్ సెక్యూరిటీపై అవాస్ట్ కనుగొన్న విషయాలను గురువారం నాడు విడుదల చేశారు.

వాట్సఫ్ ,ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు..

అనంతరం ఆయన ప్రసంగిస్తూ వాట్సఫ్ ,ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్ దారిలోనే నడుస్తున్నాయని ఆరోపించారు.

యూజర్లు మాట్లాడుకునే మాటలను బట్టి..

యూజర్లు మాట్లాడుకునే మాటలను బట్టి ఇవి వ్యాపార ప్రకటనలను పంపుతున్నాయని ఆయన తెలిపారు.

ఆ నివేదిక వివరాలు తామింకా చూడలేదని..

ఇదే విషయమై గూగుల్ ప్రతినిధిని కోరగా ఆ నివేదిక వివరాలు తామింకా చూడలేదని దీనిపై కామెంట్ చేయబోమని అన్నారు.

ఫేస్ బుక్ సైతం ఈ విషయంలో..

ఫేస్ బుక్ సైతం ఈ విషయంలో ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించింది.

టాప్ 100 మొబైల్స్ యాప్స్ లో 10 వరకూ ..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 100 మొబైల్స్ యాప్స్ లో 10 వరకూ యూజర్లు పంచుకుంటున్న చిత్రాలు వీడియోలు ఆడియో మెసేజ్ లు కాపీలను సేకరిస్తున్నాయని ప్రతి యాప్స్ లో 9 వరకూ స్ట్మార్ట్ ఫోన్ ల లోని స్టోరేజ్ లోకి వెళ్లగలుగుతున్నాయని విన్సెంట్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google WhatsApp Facebook spying on users Avast
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot