రోజుకు 37 వేల స్మార్ట్‌ఫోన్లు హ్యాకింగ్, జీమెయిల్ ఖాతాలే టార్గెట్

న్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్) కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాల హ్యాక్

By Hazarath
|

హ్యాకర్లు ఇప్పుడు తమ రూటును మార్చారు. ప్రత్యేకంగా రూపొందించబడిన హానికరమైన సాప్ట్‌వేర్ ద్వారా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్లను, ఆ ఫోన్లలో ఉండే జీ మెయిల్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. ఇందుకోసమే ప్రత్యేకంగా గూలిగాన్ అనే హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ ని హ్యాకర్లు తయారుచేశారు. ఇప్పటికే లక్షల మంది వినియోగదారుల జీ మెయిల్ ఖాతాలు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

జియో యూజర్లకు చేదు వార్త, ఉచితానికి పుల్‌స్టాప్

గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా

గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా

ఇప్పుడు హ్యాకర్లు తమ రూటు మార్చారు. గూలిగ్యాన్ అనే హానికరమైన సాఫ్ట్ వేర్ ద్వారా పదిలక్షల (మిలియన్) కు పైగా గూగుల్ వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్టు భద్రతా పరిశోధకులు గుర్తించారు.

ఆండ్రాయిడ్ 4.0, 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా

ఆండ్రాయిడ్ 4.0, 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా

చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నివేదిక ప్రకారం గూలిగాన్ అనే మాల్వేర్ తో గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించే ఆండ్రాయిడ్ 4.0, 5.0 స్మార్ట్ ఫోన్ల ద్వారా హ్యాకర్లు దాడికి దిగుతున్నారు. తద్వారా లక్షలమంది వినియోగాదారుల జీమెయిల్స్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని బాంబు పేల్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 క్లిక్ చేయడం ద్వారా
 

క్లిక్ చేయడం ద్వారా

సాధారణంగా యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటున్న సందర్భంలోనూ, లేదా ఫిషింగ్ మేసెజెస్, హానికరమైన లింక్ లు, మెసేజ్ లను క్లిక్ చేయడం ద్వారా ఈ దాడి ప్రారంభమవుతోందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా

గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా

2016 ఆగస్టులో ప్రవేశపెట్టిన గూలిగ్యాన్ అప్లికేషన్ ద్వారా రోజుకు 37 వేల డివైస్ లు హ్యాక్ అవుతున్నాయని, వీటిల్లో 57 శాతం స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, సుమారు తొమ్మిది శాతం యూరోప్ లో ఉన్నట్టు తమ పరిశోధకులు గుర్తించారని పేర్కొంది.

సెన్సిటివ్ డాటాను

సెన్సిటివ్ డాటాను

ఇలా ఈ మెయిల్స్, ఫోటోలు సహా, డాక్యుమెంట్లు, ఇతర సెన్సిటివ్ డాటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతోపాటు గూగుల్ ప్లే ద్వారా కూడా వినియోగదారుల డాటాను తస్కరించే అవకాశంఉందని తెలిపింది.

 రేటింగ్ పై క్లిక్ చేసినపుడు

రేటింగ్ పై క్లిక్ చేసినపుడు

యాప్ డౌన్ లోడ్ సందర్భంగా ఖాతాదారుడు రేటింగ్ పై క్లిక్ చేసినపుడు హ్యాకర్లు ఎటాక్ చేస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం సమాచారాన్ని గూగుల్ సంస్థకి రిపోర్ట్ చేశామన్నారు. ఈ మాల్వేర్ పై విచారించి. వినియోగదారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.

హ్యాకింగ్ తుఫానుపై

హ్యాకింగ్ తుఫానుపై

అయితే ఈ తాజా హ్యాకింగ్ తుఫానుపై టెక్ దిగ్గజం గూగుల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. 

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Gooligan Android malware affects over 1 million devices: Report read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X