జియో ఉచితంపై వస్తున్న రూమర్లకు అధినేత చెక్ పెట్టనున్నాడా..?

Written By:

రిలయన్స్ జియో యూజర్ల కోసం చేదు వార్తని మోసుకొచ్చింది. డిసెంబర్ 31 వరకు ఉచితంగా జియో సేవలు పొందవచ్చని దీంతో పాటు మరో మూడు నెలలు జియోని పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు జియూ పుల్ స్టాప్ పెట్టినట్లుగా తెలుస్తోంది. జియోకి చెందిన అధికారులు అనధికార సమాచారం ప్రకారం జియో ప్రివ్యూ ఆఫర్ ని డిసెంబర్ 3తో ముగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం సంగతి పక్కన బెడితే జియో ఇన్వెస్టర్ల సమావేశం ఈ రోజు జగరనున్న నేపథ్యంలో అధినేత ఏం చెబుతారనే దానిపైనే అందరి చూపు పడింది. 

జియో మాయ, ప్రతి 60 సెకన్లకి 1000మంది కష్టమర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ 3 లాస్ట్

సెప్టెంబర్ 5 న ప్రారంభమైన జియో సేవలు 90 రోజుల ఉచితంతో ముందుకు సాగాయి. అయితే ఈ 90 రోజులు డిసెంబర్ 3తో ముగిసిపోనున్న నేఫథ్యంలో ట్రాయ్ టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని జియోకి చెప్పడంతో ప్రివ్యూ ఆఫర్ డిసెంబర్ 3తో ముగియనున్నట్లు తెలుస్తోంది.

పాత యూజర్లు

అయితే జియో పాత యూజర్లు ఉచిత సేవలను డిసెంబర్ 31 వరకు పొందవచ్చని జియో చెబుతోంది. ట్రాయ్ నిబంధలనకు ఇది విరుద్ధం అయినప్పటికీ కష్టమర్లకు ఇచ్చిన వాగ్ధానం కోసం జియో ఈనిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త యూజర్లు

డిసెంబర్ 3 తర్వాత సిమ్ తీసుకునే జియో యూజర్లు జియో ప్లాన్లు వేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఉచిత సేవలు అందవని జియో చెప్పినట్లుగా తెలుస్తోంది.అయితే వారికోసం కొన్ని రకాల స్పెషల్ ప్లాన్లను తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరో మూడు నెలలు సాధ్యమేనా..?

జియో డిసెంబర్ 28న మరో మూడు నెలలు ఉచిత ఆఫర్ సేవలు పొడిగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కథనాల మీద కథనాలు వస్తున్నాయి. అయితే ట్రాయ్ రూల్ ప్రకారం ఇది అసలు సాధ్యం కాదని తెలుస్తోంది. ఒకవేళ జియో ఉచిత ఆఫర్లను పొడిగించాలనుకుంటే వేరే పేరుతో దాన్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. సేమ్ సర్వీస్ జియో ఉచిత ఆఫర్ ఇవ్వలేదని తెలుస్తోంది.

డిసెంబర్ 4 నుంచి కొనాల్సిందే

జియో ఉచిత సేవలను డిసెంబర్ 31 వరకు ఇస్తానని చెప్పినప్పటికీ యూజర్లు డిసెంబర్ 4 నుంచి జియో ప్లాన్లలోకి మారాల్సిందేనని తెలుస్తోంది. ట్రాయ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో జియో కూడా మాట తప్పతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ 4 నుంచి తప్పనిసరిగా పే చేయాల్సిందేనని తెలుస్తోంది.

డేడా స్పీడ్

డిసెంబర్ 31 వరకు ఉచిత సేవలు పొందే యూజర్లకు జియో డేటా స్పీడ్ ఎలా ఇస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 4 నుంచి జియో పే సేవలు ప్రారంభమవుతున్న నేఫథ్యంలో ఉచిత డేటా స్పీడ్ తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

జియో యూజర్లు రెడీగా ఉండండి

కాబట్టి జియో సేవలు పొందుతున్న వారు ఇకపై అప్రమత్తంగా ఉండాలని ఉచిత సేవలు ఎప్పటిదాకా అనేదానిపై దృష్టిసారించాలని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. సో జియో యూజర్లు రెడీగా ఉండండి మరి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Jio Welcome Offer for free data & calls ends on December 3: What happens next for Jio users read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot