3 స్క్రీన్లతో ల్యాపీని ఎప్పుడైనా చూశారా..?

Written By:

మీరు ఇప్పటిదాకా సింగిల్ స్కీన్ కలిగిన ల్యాపీలు మాత్రమే చూసుంటారు. డబుల్ , త్రిబుల్ డిస్ ప్లే కలిగిన ల్యాపీలు వస్తాయని కలలో కూడా ఊహించి ఉండరు కదా.. అయితే త్వరలో ఆ ల్యాపీలు కూడా రానున్నాయి. ప్రముఖ గేమింగ్ అప్లికేషన్ సంస్థ రేజర్ బాత్ తన సరికొత్త ల్యాపీని సీఈఎస్ 2017షోలో ఆవిష్కరించింది. ఈ ల్యాపీ 3 డిస్ ప్లేలను కలిగి ఉంటుంది.

దడ పుట్టిస్తున్న గెలాక్సీ ఎస్8, 2 నెలలు ముందుగానే..

3 స్క్రీన్లతో ల్యాపీని ఎప్పుడైనా చూశారా..?

ప్రపంచంలో మూడు డిస్ ప్లేలను కలిగిన మొట్టమొదటి ల్యాపీ కూడా ఇదే. అయితే ఈ ల్యాపీలో మూడు స్క్రీన్లు ఉన్నప్పటికీ కీ బోర్డ్ మాత్రం ఒక్కటే ఉంటుంది. మూడు డిస్ప్లేలు 17.3 అంగుళాల చొప్పున వెడల్పుతో ఉంటాయి. 4కె రిజల్యూషన్ తో ఈ డిస్ ప్లే లు కనిపిస్తాయి. Nvidia GeForce GTX 1080 GPUతో ఈ ల్యాపీ వస్తోంది. దాదాపు 25 మిలియన్ ఫిక్సల్స్ లో ఉండే అవకాశం ఉంది.

భారీ డిస్కౌంట్‌ ధరల్లో ల్యాపీలు

3 స్క్రీన్లతో ల్యాపీని ఎప్పుడైనా చూశారా..?

ఈ మూడూ స్క్రీన్లు ఒకదాని వెనక మరొకటి కలిసి ఉండి, యూజర్లు బటన్ నొక్కితే రెండు చెరోవైపు పక్కకు స్లైడ్ అయి పొడవాటి స్క్రీన్గా ఏర్పడతాయి. ఈ ల్యాప్టాప్ను ప్రత్యేకంగా గేమ్స్ కోసం రూపొందించారు. ఈ ల్యాప్టాప్ 5.5 కిలోల బరువు ఉంటుంది. ఇటీవల అమెరికాలోని లాస్వెగాస్లో జరిగిన సీఈఎస్ ట్రేడ్ షోలో దీనిని ప్రదర్శించారు.

English summary
CES 2017: A look at Razer's triple-display laptop, Project Valerie read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot