ఇదిగోండి డిజిటల్ లాకర్ యాప్

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేసే డిజిలాకర్ (DigiLocker) యాప్‌ను భారత ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. క్లౌడ్ ఆధారిత సేవలను అందించే ఈ డిజిటల్ లాకర్ డాక్యుమెంట్ క్లౌడ్ యాప్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్‌లను భద్రపరుచుకోవచ్చు. కాగితరహిత పాలనను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది.
మీ ఫోన్‌కు యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ఉందా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌లోకి రెండు విధాలుగా లాగిన్ కావచ్చు. మొదటి విధానంలో ఆధార్ కార్డ్ అంకెలను ఎంటర్ చేయటం ద్వారా, రెండవ విధానంలో మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా ఈ అప్లికేషన్‌లోకి సైనప్ కావొచ్చు. డిజిలాకర్ సర్వీసును ఇప్పటికే 1.5లక్షల మంది వినియోగించుకుంటున్నారు.
DigiLocker యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








