ఆపిల్‌కు చుక్కలు చూపిస్తున్న దొంగలు

ఆపిల్ స్టోర్లను టార్గెట్ చేసిన దొంగలు క్షణాల్లో అందినకాడికి మొబైల్స్ దోచుకుపోతున్నారు. వరుస దొంగతనాలతో ఆపిల్ ని హడలెత్తిస్తున్నారు.

By Hazarath
|

అమెరికాలో ఇప్పుడు దొంగల రాజ్యం నడుస్తోంది. ముఖ్యంగా ఆపిల్ స్టోర్లను టార్గెట్ చేసిన దొంగలు క్షణాల్లో అందినకాడికి మొబైల్స్ దోచుకుపోతున్నారు. వరుస దొంగతనాలతో ఆపిల్ ని హడలెత్తిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న ఆపిల్ స్టోర్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. అయితే ఒక్కసారి కాదు .. కేవలం నాలుగు రోజుల్లో వరుసగా రెండు సార్లు దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. స్టోర్ స్టాఫ్‍ను అయోమయంలో పడేసి, చేతికి దొరికిన ఫోన్లన్నంటిన్నీ వారు ఎత్తుకుని పోతున్నారు.

ఈ యాప్స్‌తో మీ ఇంట వెలుగులే వెలుగులు !

మొదటి దాడి నవంబర్ 25

మొదటి దాడి నవంబర్ 25

మొదటి దాడి నవంబర్ 25 న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శాన్? ఫ్రాన్సిస్కోలోని చెస్ట్? నట్ వీధిలో ఆపిల్ స్టోర్లో చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసు డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని

కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని

సాధారణ వ్యక్తులాగానే వేగంగా స్టోర్‌లోకి ప్రవేశించి, కొన్ని క్షణాల్లోనే ఫోన్లను ఎత్తుకుని పారిపోతున్నారు. నవంబర్ 29 న అదేస్టోర్లో నలుగురు వ్యక్తులుగా వచ్చి ఇదే మాదిరి దొంగతనానికి పాల్పడినట్టు మరో వీడియోలో వెల్లడైంది.

అడ్డుకోవడానికి ప్రయత్నించినా
 

అడ్డుకోవడానికి ప్రయత్నించినా

ఈ సమయంలో స్టా‌ఫ్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం లేకుండా వారు మొబైళ్లను తీసుకుని వేగంగా పారిపోయారు. ఆపిల్ స్టోర్లలో దొంగలు పడటం ఇదేమీ కొత్త కాదని, వ్యాపార సమయాల్లో ఆపిల్ స్టోర్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో

వినియోగదారులు స్టోర్లో ఉండగానే దొంగలు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బెర్కెలీలోని స్టోర్లో కూడా తొమ్మిది రోజుల్లో మూడు సార్లు దొంగలు పడ్డారు. అయితే ఈ విషయంపై ఉద్యోగులు ఆపిల్ దగ్గర ఫిర్యాదు చేసినా కంపెనీ పట్టించుకోనట్టే వ్యవహరిస్తుందని తెలుస్తోంది.

దొంగతనానికి గురైన ఫోన్లు

దొంగతనానికి గురైన ఫోన్లు

అయితే దొంగతనానికి గురైన ఫోన్లు పనిచేయనవని వెల్లడవుతోంది. ఆ డివైజ్‌ లు పనిచేస్తాయనే భ్రమలో వారు దొంగతనం చేసి, అమ్మడానికి తీసుకెళ్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Grand Theft Apple: Watch Apple store getting robbed twice in 4 days read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X