ట్విస్టంటే ఇది..లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు ఉద్యోగుల షాక్

Written By:

ఈ ట్విస్ట్‌ను ఇప్పటివరకూ ఎవ్వరూ చూసి ఉండరు..అలాగే విని కూడా ఉండరు...ఉద్యోగులకు లక్షల్లో జీతాలు పెంచిన యజమానికి ఆ ఉద్యోగులు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు టెస్లా..బాస్ పుట్టిన రోజున ఉద్యోగులు గిఫ్ట్‌గా టెస్లా కారును ప్రజెంట్ చేస్తూ అదిరిపోయే సర్ ప్రజ్ ఇచ్చారు.. ఆ బాస్ ఇంకా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్మండి.వివరాల్లోకెళితే..

ఇదేం వ్యాపారం..ఆన్‌లైన్‌లో వేలానికి మనుషుల పుర్రెలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

గ్రావిటి కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు కంపెనీ సీఈఓ డాన్ ప్రైస్ జీతాన్ని కళ్లుతిరిగే రీతిలో పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ఒక్కొక్కరికీ ఏడాదికి కనీసం 70వేల డాలర్లకు(రూ. 46.97 లక్షలు) జీతాన్ని పెంచుతూ ఆయన అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

మరీ అంత మంచి బాస్‌కు తమ వంతుగా ఏదైనా చేయాలని ఉద్యోగులు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పుట్టినరోజుకు గిఫ్ట్ గా టెస్లా కారును ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

అందుకోసం తమ జీతాల్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి ఈ అత్యంత ఖరీదైన కారు 'టెస్లా కారును ఉద్యోగులు ఆయనకు కానుకగా ఇచ్చారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ఈ సర్‌ప్రైజ్ గిఫ్టుతో ఆనందంలో మునిగిపోయిన ఆ సీఈవో 'దీనిని నేను నమ్మలేకపోతున్నాను. షాక్ కలిగిస్తున్నది. ఇలాంటి ఒకటి జరగుతుందని కలలో కూడా అనుకోలేదం'టూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ప్రైస్ ఇటీవల తన వేతనాన్ని 11 లక్షల డాలర్ల నుంచి 70 వేల డాలర్లకు తగ్గించుకొని.. ఆ మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు బదలాయించారు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

గ్రేవిటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70వేల డాలర్ల జీతం ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయం వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు రేకెత్తించింది కూడా.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ఇదిలా ఉంటే గ్రేవిటీ కంపెనీలో 30శాతం వాటా కలిగిన సోదరుడి నుంచే ఆయన కేసు ఎదుర్కొంటున్నారు. గ్రేవిటీ కంపెనీ సీఈవో అయిన ప్రైస్ ఎక్కువ వేతనాన్ని పొందుతున్నాడని ప్రధాన వాటాదారుడైన ఆయన సోదరుడు కేసు వేశాడు.

లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు

ఈ కేసు కొలిక్కివచ్చే దశలో ఉండటంతో గ్రేవిటీ ఉద్యోగులు ఊహించనిరీతిలో తమ బాస్ కలల కారును కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఉద్యోగులు బాస్‌ల మధ్య బంధం అంటే ఇలా ఉండాలి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Gravity Payments CEO receives Tesla from grateful employees
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot